Pigeon Halts Cricket| ఒక పావురం ఒక అంతర్జాతీయ మ్యాచ్‌ను నిలిపివేసింది. స్టేడియంలో అందరూ చూస్తూ ఉండగా ఇది జరిగింది. ఈ ఘటన ఇంగ్లండ్ లోని ఓవల్ మైదానంలో జరిగింది. జూన్ 3న ఇంగ్లాండ్, వెస్టిండీస్ జట్ల మధ్య జరిగిన మూడవ వన్డే మ్యాచ్‌లో కెన్నింగ్టన్ ఓవల్‌లో వర్షం కారణంగా కాసేపు ఆగిపోయిన మ్యాచ్ ప్రారంభించిన కాసేపటికే ఒక ఆసక్తికర సంఘటన జరిగింది. మైదానంలో పావురాలు మ్యాచ్‌ను కొద్దిసేపు నిలిపివేశాయి. వెస్టిండీస్ ఆటగాడు గుడకేష్ మోటీ ఆడిన షాట్ అక్కడ పావురాలు అడ్డుగా నిలిచాయి. ఆ సమయంలో ఫీల్డర్ ఆ పావురాలను తరిమేసినా.. ఒక పావురం మాత్రం అక్కడే ఉండిపోయింది. అప్పుడు ఆ ఫీల్డర్ దాన్ని తన చేతుల్లోకి ఎత్తుకొని చూశాడు.
మోటీ షాట్‌తో పావురానికి గాయం
ఇంగ్లండ్ బౌలర్ అడిల్ రషీద్ బౌలింగ్‌లో మోటీ కవర్స్ దిశగా ఒక షాట్ ఆడాడు. ఆ సమయంలో అక్కడ మైదానంలో చాలా పావురాలు గుంపుగా కూర్చొని ఉన్నాయి.దీంతో ఆ బాల్ వెళ్లి ఒక పావురాన్ని తాకింది. ఆ దెబ్బకు మిగతా పావురాలు ఎగిరిపోయాయి, కానీ ఒక పావురం.. తడిగా ఉన్న మైదానంలో నిలబడిపోయింది. అక్కడ ఫీల్డింగ్ చేస్తున్న ఇంగ్లాండ్ ఆటగాడు మాథ్యూ పాట్స్ దాన్ని ఎగరగొట్టేందుకు ప్రయత్నించాడు. కానీ అది కదల్లేదు. చివరకు అది ఎగిరి వెళ్లాక ఆట మళ్లీ మొదలైంది. ఈ సంఘటన అందరినీ ఆశ్చర్యపరిచింది. ఆ తర్వాత మోటీ తన బ్యాటింగ్‌తో వెస్టిండీస్ స్కోరును 200 పరుగులు దాటించాడు.
వెస్టిండీస్ బ్యాటింగ్ ఇబ్బందులు
ఈ సిరీస్‌లో వెస్టిండీస్ బ్యాటింగ్ నిరాశపరిచింది. మూడవ వన్డేలో కేవలం 90 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయారు. షెర్ఫేన్ రూథర్‌ఫోర్డ్ ఐపీఎల్ ఫామ్‌ను కొనసాగిస్తూ 71 బంతుల్లో 70 పరుగులు చేశాడు, కానీ పెద్ద స్కోరు చేయలేకపోయాడు. అతని వికెట్ పడిన తర్వాత వెస్టిండీస్ 154/7కు చేరింది. అడిల్ రషీద్ మూడు వికెట్లు, కార్స్ రెండు వికెట్లు తీశారు. 40 ఓవర్లలో వెస్టిండీస్ 251/9 స్కోరు చేసింది. ఇందులో రూథర్‌ఫోర్డ్ (70), మోటీ (63) రాణించారు. అయినప్పటికీ, ఇంగ్లాండ్ వారిని 300 కంటే తక్కువ స్కోరుకు కట్టడి చేసింది.
సులభంగా విజయం సాధించిన ఇంగ్లండ్
డిఎల్ఎస్ (DLS) పద్ధతి ప్రకారం.. 246 పరుగుల సవరించిన లక్ష్యాన్ని ఇంగ్లాండ్ 29.4 ఓవర్లలో 252/3తో సులభంగా ఛేదించింది. జామీ స్మిత్ 28 బంతుల్లో 64, బెన్ డకెట్ 58, జో రూట్ 44 పరుగులు చేశారు. ఈ విజయంతో ఇంగ్లాండ్ 3-0 తేడాతో సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేసింది. కొత్త వన్డే కెప్టెన్ హ్యారీ బ్రూక్‌కు ఇది అద్భుతమైన ఆరంభం.
Also Read: ఇంపాక్ట్ ప్లేయర్‌గా ఆడలేను.. ఐపిఎల్ రిటైర్మెంట్‌పై స్పందించిన కొహ్లీ
సిరీస్ ఇలా సాగింది
మొదటి మ్యాచ్‌లో వెస్టిండీస్ 238 పరుగుల తేడాతో ఓడింది. రెండవ మ్యాచ్‌లో జో రూట్ 166 పరుగుల అద్భుత ఇన్నింగ్స్‌తో ఇంగ్లాండ్ గెలిచింది. మూడవ మ్యాచ్‌లోనూ వెస్టిండీస్ గెలవలేకపోయింది. ఈ సిరీస్ ఓటమి వెస్టిండీస్‌కు నిరాశపరిచింది, కానీ రూథర్‌ఫోర్డ్, మోటీ లు మంచి ఆటతీరుతో ఆకట్టుకున్నారు. ఇంగ్లండ్ మాత్రం తమ ఆధిపత్యాన్ని చాటుకుంది.
🚨 PIGEONS STOPS PLAY 😂👌🚨 pic.twitter.com/ArTvFUOQk7
— Johns. (@CricCrazyJohns) June 3, 2025