Kannappa Trailer: మంచు విష్ణు హీరోగా నటించిన కన్నప్ప సినిమా జూన్ 27వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలను వేగవంతం చేస్తున్నారు. మంచు విష్ణు తన డ్రీం ప్రాజెక్టుగా అత్యంత భారీ బడ్జెట్ సినిమాగా, పాన్ ఇండియా స్థాయిలో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. తాజాగా ప్రమోషన్లలో భాగంగా నేడు ఈ సినిమా ట్రైలర్ విడుదల చేశారు.ఈ ట్రైలర్లు భాగంగా మొదట్లోనే ఓ కుర్రాడు ఒక రాయి తీసుకొని దేవుడు లేడు జీవుడు లేడు అంటూ దేవుడి విగ్రహం పై రాయి విసురుతాడు. ఇలా చిన్నప్పటినుంచి దేవుడిపై భక్తి లేనటువంటి తిన్నడు పెద్దయిన తర్వాత శివయ్య పై ఎలా భక్తి పెంచుకున్నారనేది ఆసక్తికరంగా ఉంటుంది. ఇక ఈ వాయు లింగం కోసం జరిగే యుద్ధ సన్నివేశాలు ఎంతో అద్భుతంగా ఆకట్టుకున్నాయి. ఇక ట్రైలర్ చూస్తుంటే విజువల్స్, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా అద్భుతంగా ఉంది ప్రభాస్ స్క్రీన్ స్పేస్ కూడా అందరిని ఆకట్టుకునే విధంగా ఉందని చెప్పాలి. ఇక ఈ సినిమా జూన్ 27వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే.
డ్రీం ప్రాజెక్ట్…
కన్నప్ప సినిమా తన డ్రీం ప్రాజెక్టుగా మంచు విష్ణు(Manchu Vishnu) ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. ఈ సినిమా కోసం దాదాపు పది సంవత్సరాలు పాటు ఈయన కష్టపడుతూ ఎట్టకేలకు ఈ సినిమాని విడుదలకు సిద్ధం చేస్తున్నారు. ఈ సినిమాను పాన్ ఇండియా స్థాయిలో ఒకేసారి ఐదు భాషలలో ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్న విషయం తెలిసిందే. ఇలా ఈ సినిమా పాన్ ఇండియా చిత్రం కావడంతో ఈ సినిమాలో అక్షయ్ కుమార్, కాజల్ అగర్వాల్, మోహన్ లాల్, ప్రభాస్ వంటి స్టార్ సెలబ్రిటీలు బాగమయ్యారు.
తిన్నడుగా మంచు విష్ణు..
విష్ణు తిన్నడు పాత్రలో నటించగా రుద్ర(Rudra) పాత్రలో ప్రభాస్(Prabhas) ఎంతో అద్భుతంగా నటించారని తెలుస్తుంది ఇక ఈ సినిమాలో ప్రభాస్ పాత్ర కూడా చాలా అద్భుతంగా ఉండబోతుందని తాజాగా విడుదల చేసిన ట్రైలర్ చూస్తేనే తెలుస్తోంది. ఇక శివుడిగా అక్షయ్ కుమార్ పార్వతీదేవిగా కాజల్ అగర్వాల్ నటించారు. ఇక ఈ సినిమా నుంచి విడుదల చేసిన అప్డేట్స్ చూస్తుంటే మాత్రం ఈసారి కన్నప్ప సినిమాతో మంచు విష్ణు పాన్ ఇండియా స్థాయిలోనే మంచి హిట్ అందుకోబోతున్నారని స్పష్టమవుతుంది. ఇక ఈ సినిమాకు బాలీవుడ్ డైరెక్టర్ ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహించిన సంగతి తెలిసిందే.
ముఖేష్ కుమార్ సింగ్ ఇదివరకు బాలీవుడ్ మహాభారతం సిరీస్ ను ఎంతో అద్భుతంగా దర్శకత్వం వహించారు. ఇలా మహాభారతం సిరీస్ చూసిన తరువాతే దర్శకుడిగా ముఖేష్ కుమార్ సింగ్ ను ఎంపిక చేసినట్లు మంచు విష్ణు పలు సందర్భాలలో తెలియచేశారు. ఎట్టకేలకు జూన్ 27 తేదీ ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచు విష్ణుకి ఎలాంటి సక్సెస్ అందిస్తుందో తెలియాల్సి ఉంది.