Navodaya Notification: విద్యార్థులకు ఇది సూపర్ న్యూస్. 2026-27 ఎడ్యుకేషనల్ ఇయర్‌కు సంబంధించి జవహర్ నవోదయ విద్యాలయాల్లో ఆరో తరగతి ప్రవేశాల కోసం నోటిఫికేషన్ వచ్చేసింది. దేశవ్యాప్తంగా మొత్తం 654 విద్యాలయాల్లో ఆరో తరగతి సీట్ల భర్తీకి రెండు విడుతలగా ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నారు. విద్యార్థులు జూలై 29 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో 2025 డిసెంబర్ 13వ తేదీన ఎగ్జామ్ ఉంటుంది. ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్ పూర్తి వివరాల గురించి తెలుసుకుందాం.
ఏపీలో 15.. తెలంగాణలో 9
జవహర్ నవోదయ విద్యాలయ సమితి పర్యవేక్షణలో దేశ వ్యాప్తంగా మొత్తం 654 నవోదయ స్కూళ్లు ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ స్కూళ్లు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో 15, తెలంగాణలో 9 జవహార్ నవోదయ విద్యాలయాలు ఉన్నాయి. ఏపీలో ఉన్న మొత్తం 15 పాఠశాలల్లో.. 2 స్కూళ్లను ఎస్‌సీ/ఎస్‌టీ జనాభా అధికంగా ఉన్న జిల్లాల్లో అదనంగా ఏర్పాటు చేశారు.
వయస్సు: 2014 మే 1 నుంచి 2016 జూలై 31 మధ్య స్టూడెంట్స్ జన్మించి ఉండాలి.
దరఖాస్తు ప్రారంభ తేది: మే 30
దరఖాస్తుకు చివరి తేది: జూలై 29
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్
అఫీషియల్ వెబ్‌సైట్: https://cbseitms.rcil.gov.in
నివాసం: అప్లై చేసుకున్న జిల్లాలో నివసించి ఉండాలి. అదే జిల్లాలో చదువుతున్న పాఠశాలలో చదువుతున్నవారు అప్లై చేసుకోవాలి.
ప్రవేశ పరీక్ష ఎలా ఉంటుందంటే?
ఆరో తరగతిలో ప్రవేశానికి సంబంధించి జవహర్ నవోదయ విద్యాలయ సెలక్షన్ టెస్ట్ (JNVST) మొత్తం 100 మార్కులకు ఎగ్జామ్ ఉంటుంది. 80 ప్రశ్నలు అడుగుతారు. ఇందులో మెంటల్ ఎబిలిటీ నుంచి 40 ప్రశ్నలు (50 మార్కులు), అర్థమెటిక్ నుంచి 20 ప్రశ్నలు (25 మార్కులు), లాంగ్వేజ్ టెస్ట్ నుంచి 20 ప్రశ్నలు (25 మార్కులు) అడుగుతారు. ఎగ్జామ్ టైం 2 గంటలు ఉంటుంది. ఎగ్జామ్ పూర్తిగా ఆబ్జెక్టివ్ టైపులో ఉంటుంది. స్థానిక భాషలో కూడా ప్రశ్నలు ఉంటాయి. విద్యార్థులు తమకు ఆసక్తి ఉన్న లాంగ్వేజ్ ను అప్లికేషన్ సమయంలో టిక్ చేయాల్సి ఉంటుంది. రెండు తెలుగు రాష్ట్రాల విద్యార్థులకు తెలుగు, ఇంగ్లిష్, హిందీ, మరాఠి, ఉర్దూ, కన్నడ భాషల్లో ఎగ్జామ్ రాయొచ్చు. ఏపీ విద్యార్థులు అదనంగా ఒరియా భాషలో కూడా రాయొచ్చు.
ALSO READ: UPSC Recruitment: డిగ్రీతో యూపీఎస్సీలో భారీగా ఉద్యోగాలు.. ఈ జాబ్ వస్తే జీతం రూ.2లక్షల పైనే
ఎగ్జామ్ లో మంచి టాలెంట్ చూపిన విద్యార్థులను ఆయా రాష్ట్రాల్లోని జిల్లాలో ఏర్పాటైన జవహార్ నవోదయ స్కూళ్లలో ప్రవేశం కల్పిస్తారు. ప్రవేశ పరీక్షలో సాధించిన మార్కులు, దరఖాస్తు చేసుకున్న జిల్లా, సదరు జిల్లాలో ఉన్న జేఎన్‌వీలో సీట్ల సంఖ్యను పరిగణనలోకి తీసుకుని రిజర్వేషన్లు తదితర అంశాలకు అనుగుణంగా జిల్లా స్థాయిలో తుదిజాబితాను రిలీజ్ చేస్తారు. ఈ జాబితాలో నిలిచిన విద్యార్థులకే ప్రవేశం కల్పిస్తారు. అయితే.. జేఎన్‌వీలలోని సీట్లలో రూరల్ ఏరియా స్టూడెంట్స్‌కు తొలి ప్రాధాన్యం కల్పించనున్నారు. మొత్తం సీట్లలో 75 శాతం సీట్లను గ్రామీణ ప్రాంత విద్యార్థులకు కేటాయిస్తున్నారు. గ్రామీణ ప్రాంత విద్యార్థులకు నాణ్యమైన విద్యనందించడమే లక్ష్యంగా ఈ విధానాన్ని ప్రభుత్వం అమలు చేస్తోంది. అదే విధంగా మహిళా విద్యార్థులను సైతం ప్రోత్సహించే విధంగా.. మొత్తం సీట్లలో మహిళా విద్యార్థులకు 33 శాతం సీట్లను కల్పిస్తున్న విషయం తెలిసిందే.
ALSO READ: Coast Guard: ఇండియన్ కోస్ట్ గార్డులో 630 ఉద్యోగాలు, మంచి వేతనం.. ఈ అర్హత ఉంటే చాలు
అవసరమైన సర్టిఫికెట్స్:
1. డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్
2. రెసిడెన్షియల్ సర్టిఫికెట్
3. ఐదో తరగతి చదువుతున్న స్కూల్ నుంచి సర్టిఫికెట్
4. స్టూడెండ్, పేరెంట్స్ సైన్ అండ్ సిగ్నేచర్
5. ఇతర అవసరమైన సర్టిఫికెట్స్ (కాస్ట్, ఇన్‌కామ్)
ఎగ్జామ్ తేది: 2025 డిసెంబర్ 13 (కొన్ని రాష్ట్రాల విద్యార్థులకు మాత్రం 2026 ఏప్రిల్ 11)
ఫ్రీ స్టడీ:
JNVలో ఎలాంటి ఫీజులు తీసుకోకుండా ఫ్రీ ఎడ్యుకేషన్ ఉంటుంది. రెసిడెన్షియల్ విధానంలో వసతి, భోజన సదుపాయం, యూనిఫామ్, పాఠ్య పుస్తకాలు అన్నింటినీ ఫ్రీగా అందజేస్తారు. విద్యా వికాస్ నిధి పేరిట ఏర్పాటు చేసిన నిధికి మాత్రం నెలకు రూ.600 పే చేయాల్సి ఉంటుంది. ఈ చెల్లింపు నుంచి ఎస్‌సీ, ఎస్‌టీ వర్గాలు, మహిళా విద్యార్థులు, బీపీఎల్ వర్గాల పిల్లలకు మినహాయింపు ఉంది. ప్రభుత్వ ఉద్యోగుల పిల్లలు మాత్రం నెలకు రూ.1500 పే చేయాల్సి ఉంటుంది.