Manchu Vishnu : మా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (MAA) అధ్యక్షుడు, మంచు విష్ణు (Manchu Vishnu) ఫ్యామిలీ వివాదం నడుస్తున్న సంగతి తెలిసిందే. తండ్రి కొడుకులు మంచు మోహన్ బాబు (Mohan Babu), మనోజ్ (Manchu Manoj) ల మధ్య ఆస్తి వివాదం నెలకొనగా, ఇరువురిపై కేసులు పెట్టేదాకా వెళ్ళింది వివాదం. ప్రస్తుతం జల్పల్లి లోని మోహన్ బాబు ఇంట్లో ఈ వివాదంపై రాజీ కుదిర్చే ప్రయత్నం జరుగుతోందని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే మరోవైపు మంచు విష్ణు ఫ్యూచర్లో దుబాయ్ లో సెటిల్ కాబోతున్నాడు అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. ఈ వివాదంతో పాటు, మంచు మనోజ్ చేసిన ట్వీట్ ను ఉదాహరణగా చూపిస్తున్నారు.
గత కొంతకాలం నుంచి మంచు విష్ణు (Manchu Vishnu) తన డ్రీమ్ ప్రాజెక్ట్ ‘కన్నప్ప’ షూటింగ్లో భాగంగా విదేశాల్లోనే ఉంటున్న సంగతి తెలిసిందే. అయితే షూటింగ్ కాబట్టి విదేశాలకు వెళ్లక తప్పదు. అది పూర్తయ్యాక తిరిగి రావాల్సిందే. కానీ మంచు విష్ణు మాత్రం తన ఫ్యామిలీతో భవిష్యత్తులో విదేశాల్లోనే స్థిరపడే ఆలోచనలో ఉన్నారా? అనే ప్రశ్నకి అవును అని సమాధానం వినిపిస్తోంది ఫిలిం నగర్ వర్గాల నుంచి. ఎందుకంటే కొంతకాలం నుంచి మంచి విష్ణు భార్య వెరానికా, తమ నలుగురు పిల్లలతో కలిసి దుబాయ్ లోనే నివాసం ఉంటుంది. మంచు విష్ణు మాత్రం ఓవైపు షూటింగ్లలో పాల్గొంటూ, అప్పుడప్పుడు ఫ్యామిలీని కలిసి వస్తున్నారు. దీంతో ఆయన అక్కడే స్థిరపడే ఛాన్స్ ఉందనే గుసగుసలు వినిపిస్తున్నాయి.
తాజాగా నెలకొన్న వివాదం నేపథ్యంలో విష్ణు (Manchu Vishnu) అమెరికా నుంచి ఇండియాకు తిరిగి వస్తూ, మధ్యలో దుబాయ్ లో ఆగి తన ఫ్యామిలీని కలిసి వచ్చినట్టుగా తెలుస్తోంది. ఈ మేరకు వెరానికా సోషల్ మీడియాలో మంచు విష్ణును కలిసిన ఫోటోను షేర్ చేసింది. “విష్ణు ఎప్పుడూ తనే సర్ప్రైజ్ చేస్తూ ఉంటాడు. కానీ ఈసారి మాత్రం నేను సర్ప్రైజ్ చేశాను” అంటూ మంచు విష్ణు ఎయిర్ పోర్ట్ నుంచి వస్తున్న ఫోటోను షేర్ చేసింది. మంచు మనోజ్, మోహన్ బాబుల మధ్య నెలకొన్న వివాదం నేపథ్యంలోనే ఇది జరిగింది. ఇక అంతకంటే ముందుగానే అంటే సోమవారం మంచు మనోజ్ సోషల్ మీడియాలో చేసిన పోస్ట్ లో “నా సోదరుడు మంచు విష్ణు పలు కారణాల వల్ల దుబాయ్ కి వెళ్ళాడు” అని పేర్కొన్నారు. దీంతో ఆయన సెటిల్ అవ్వడానికి దుబాయ్ దారి వెతుక్కుంటున్నాడు అన్న వార్తలు నిజమేనని అంటున్నారు.
దుబాయ్ అంటే కుటుంబ పోషణ కు ఖర్చు ఓ రేంజ్ లో ఉంటుంది. అయితే మంచు విష్ణు (Manchu Vishnu) తన విద్యా సంస్థల నుంచి వచ్చే ఆదాయాన్ని ఉపయోగించుకుని, అక్కడ స్థిరపడాలని ఆలోచిస్తున్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో అసలు వివాదం ఇదేనని, మంచు విష్ణు కుటుంబ ఆస్తులను తన స్వలాభం కోసం ఉపయోగించుకుంటున్నాడని, “నా తండ్రి నన్ను పక్కకు తప్పించి, మంచు విష్ణుకు సపోర్ట్ గా ఉంటున్నాడు” అంటూ మనోజ్ చేసిన కామెంట్స్ కు కారణం ఇదేనని అనుకుంటున్నారు. ఇక మరోవైపు మంచు విష్ణు హైదరాబాదులో ఉన్న స్కూల్స్ చూసుకుంటూనే, సినిమాలతో బిజీగా ఉన్నారు. ఇక మా అసోసియేషన్ అధ్యక్షుడిగా ఆయన రెండోసారి కొనసాగుతున్న సంగతి తెలిసిందే. మరి ఆయన దుబాయ్ కి మకాం మార్చాలి అనుకుంటే ‘మా’ అధ్యక్షుడిగా ఇచ్చిన హామీలు, ముఖ్యంగా ‘మా’ బిల్డింగ్ సంగతి ఏంటి ? అంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు.