Delhi Crime News: ఢిల్లీలో దారుణ ఘటన జరిగింది. ఓ వైపు ప్రియురాలు పెళ్లి చేసుకుంటుంటే.. మరోవైపు అదే ఫంక్షన్ హాల్ ఎదుట ప్రియుడు సజీవదహనం అయ్యాడు. ఈ పెళ్లిని చూసి తట్టుకోలేక అబ్బాయి కారులోకి వెళ్లి సజీవదహనం చేసుకున్నాడని అమ్మాయి బంధువులు చెప్తుంటే, తమ కొడుకును చంపి కారు ఉంచి కాల్చేశారని మృతుడి పేరెంట్స్ ఆరోపిస్తున్నారు. తూర్పు ఢిల్లీలో సంచలనం కలిగించిన ఈ కేసుపై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నాయి. ఇంతకీ అసలు ఏం జరిగిందంటే..
ఇంతకీ అసలు ఏం జరిగిందంటే?
నోయిడాకు చెందిన అనిల్ ప్రజాపతి.. ఓ ప్రైవేట్ కంపెనీలో ఆపరేషనల్ మేనేజర్ గా పని చేస్తున్నారు. తన బంధువుల అమ్మాయితో ప్రేమలో పడ్డాడు. కారణాలు ఏంటో తెలియదు కానీ, అమ్మాయి పేరెంట్స్ ఈ పెళ్లికి ఒప్పుకోలేదు. ఆమెకు వేరే సంబంధం చూశారు. అబ్బాయికి కూడా వేరే అమ్మాయితో పెళ్లి కుదిరింది. ఫిబ్రవరి 14న అనిల్ జరగాల్సి ఉంటుంది. అయితే, తన పెళ్లికి సంబంధించిన ఆహ్వాన పత్రికలు పంచేందుకు అనిల్ నోయిడా నుంచి తూర్పు ఢిల్లీకి వెళ్లాడు. ఆ అమ్మాయి పెళ్లి జరిగే ఘాజీపూర్ లోని ఫంక్షన్ హాల్ దగ్గరికి వెళ్లాడు. కాసేపటికే, కారులో 24 ఏండ్ల యువకుడు నిప్పటించుకుని చనిపోయాడు అని పోలీసులకు కాల్ వచ్చింది. వెంటనే వాళ్లు అక్కడికి వెళ్లే సరికి యువకుడు పూర్తిగా కాలిపోయాడు. కారులోనే సజీవదహనం అయ్యాడు.
యువకుడి మరణంపై ఇరు కుటుంబాల పరస్పర ఆరోపణలు
అటు ఈ ఘటనపై ఇరు కుటుంబ సభ్యులు పరస్పర ఆరోపణలు చేసుకుంటున్నారు. తమ అబ్బాయిని అమ్మాయి తల్లిదండ్రులు కొట్టి చంపి, కారులో ఉంచి సజీవదహనం చేశారని మృతుడి తల్లిందడ్రులు ఆరోపించారు. ఆ అమ్మాయిని ప్రేమించాడనే కారణంతోనే చంపేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలోనూ తమ అబ్బాయిపై అమ్మాయి బంధువులు దాడి చేశారని ఆరోపించారు. అటు అమ్మాయి తల్లిదండ్రులు మాత్రం తమకు, ఈ మరణానికి ఏ సంబంధం లేదన్నారు. తమను బద్నాం చేసేందుకే ఆ అబ్బాయి.. పెళ్లి వేడుక దగ్గర ఆత్మహత్య చేసుకున్నాడని ఆరోపిస్తున్నారు. పెళ్లి మంటపంలో కావాలనే న్యూసెన్స్ చేశాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒకరిపై మరొకరు ఆరోపణలు చేసుకుంటున్న నేపథ్యంలో అసలు వాస్తవాలు తెల్చే పనిలో పడ్డారు పోలీసులు. ఇందుకోసం ప్రత్యేక బృందాలు దర్యాప్తు చేస్తున్నాయి.
Read Also: నార్సింగి డబుల్ మర్డర్ కేసులో షాకింగ్ ట్విస్ట్, రెండో ప్రియుడే హంతకుడు!
ఘటనపై లోతుగా విచారణ చేస్తున్న పోలీసులు
రాత్రి 11 గంటల సమయంలో ఓ యువకుడు కారులో నిప్పటించుకుని చనిపోయాడని ఘాజీపూర పోలీస్ స్టేషన కు కాల్ వచ్చిందని పోలీసులు తెలిపారు. వెంటనే స్పాట్ కు చేరుకుని క్లూస్ టీమ్ తో ఆధారాలు సేకరించినట్లు చెప్పారు. మృతదేహాన్ని పోస్టుమార్టంకు పంపినట్లు తెలిపిన పోలీసులు, యువకుడి మరణంపై దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు తెలిపారు. త్వరలోనే అసలు వాస్తవాలు బయటకు వస్తాయన్నారు. బీఎన్ఎస్ సెక్షన్ 194 ప్రకారం దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.
Read Also: టీనేజ్ అథ్లెట్ పై 60 మంది లైంగిక దాడి, విషయం బయటకు ఎలా వచ్చిందంటే?