Manchu Vishnu:మంచు ఫ్యామిలీలో గత రెండు రోజులుగా గొడవలు సినీ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారాయి. అయితే గొడవలు జరుగుతున్న నేపథ్యంలో తాజాగా దుబాయ్ లో ఉన్న మంచు విష్ణు(Manchu Vishnu)శంషాబాద్ ఎయిర్ పోర్ట్ కి చేరుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. “మా కుటుంబంలో చిన్నపాటి సమస్యలు తలెత్తాయి. త్వరలోనే అన్నింటికీ పరిష్కారం చూపిస్తాము. ఫ్యామిలీ వివాదాన్ని పెద్దగా చేసి చిత్రీకరించడం తగదు” అంటూ తెలిపారు మంచు విష్ణు. ఆ తర్వాత భారీ ప్రైవేట్ సెక్యూరిటీ మధ్య ఆయన తన ఇంటికి చేరుకున్నారు.
పరస్పర కంప్లైంట్ ఇచ్చుకున్న తండ్రీకొడుకులు..
ఇకపోతే మోహన్ బాబు, మనోజ్ మధ్య వివాదం జరగగా.. ఇరువురు కూడా పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసులు నమోదు చేసుకున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా తనకు మౌనిక (Mounika), మనోజ్(Manoj)నుండి ముప్పు పొంచి ఉందని, రక్షణ కల్పించాలని రాత్రి 11 గంటల సమయంలో మోహన్ బాబు వాట్సాప్ లో ఇచ్చిన ఫిర్యాదు మేరకు కొడుకు, కోడలి పై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు పోలీసులు. మరొకవైపు మంచు మనోజ్ కూడా తనకు ప్రాణహాని ఉందంటూ ఫిర్యాదు ఇవ్వగా.. మోహన్ బాబుకు చెందిన పదిమంది అనుచరులపై పహాడీ షరీఫ్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదయింది. అయితే ఈ కేసులో మంచు మనోజ్ తన కుటుంబంపై ఎటువంటి కంప్లైంట్ ఇవ్వలేదు.
తండ్రిపై మనోజ్ అసహనం.
ఇకపోతే కేస్ ఫైల్ అయిన నేపథ్యంలో మంచు మనోజ్ మండిపడ్డారు. తన భార్య భూమా మౌనికపై తన తండ్రి మోహన్ బాబు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని ఇలాంటి ఆరోపణల గురించి ప్రస్తావిస్తున్నందుకు తనకు చాలా బాధగా ఉందని కూడా తెలిపారు.. ఇక పరస్పర పోలీస్ కంప్లైంట్ లు అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి.
అసలు గొడవంతా ఆస్తుల కోసమేనా..?
మోహన్ బాబు యూనివర్సిటీ, మోహన్ బాబు విద్యానికేతన్ విద్యాసంస్థలలో ఆర్థికపరమైన అవకతవకలు ఏర్పడ్డాయని, ఈ విషయంలోనే ప్రశ్నించగా మనోజ్ పై దాడి చేశారనే వార్తలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా పిల్లల చదువుకు అయ్యే ఖర్చు కంటే ఎక్కువ డబ్బులు తీసుకుంటున్నారని, ఇది తన తండ్రి గౌరవానికి దెబ్బతీస్తుంది అనే విధంగా గతంలో కూడా మంచు మనోజ్ కామెంట్లు చేసిన విషయం తెలిసిందే. ముఖ్యంగా బాధిత పిల్లల తల్లిదండ్రులకు అండగా నిలిచిన మంచు మనోజ్ ప్రశ్నిస్తే తనపై ఇలా దాడి చేశారని ఆయన స్నేహితులు కామెంట్ చేస్తున్నట్లు సమాచారం. గతంలోనే విద్యానికేతన్ సంస్థల విషయాలలో ఇలాంటివి మంచు మనోజ్ తెరపైకి తీసుకొచ్చారు. కానీ ఆ సమయంలో ఎవరూ స్పందించలేదు. ఇక ఇప్పుడు ఆస్తుల పంపకాల విషయంలో గొడవలు అంటూ మరొకవైపు చర్చలు జరుగుతున్నాయి. ఇక ఈ గొడవలను సద్దు మణిగేలా చేయడానికి ముంబైలో ఉంటున్న మంచు లక్ష్మి కూడా నిన్న తన తమ్ముడు మంచు మనోజ్ ఇంటికి వచ్చి మళ్లీ ఆమె వెళ్లిపోయింది. ఆ తర్వాత మంచు మనోజ్ ఎవరితోనో చాలా సీరియస్గా ఫోన్ మాట్లాడుతుండడం మనం చూడవచ్చు. ఇక ఇప్పటికే మోహన్ బాబు ఇంటి వద్ద మనోజ్ కు సంబంధించి 30 మంది బౌన్సర్లు, విష్ణుకి సంబంధించిన 40 మంది బౌన్సర్లు చేరుకున్నారు. విష్ణు కూడా ఇంటికి చేరుకోవడంతో ఇక అక్కడ పరిస్థితి ఎలా ఉందో అన్నది చర్చనీయాంశంగా మారింది.