Jagan Tadepalli Palace: వాస్తు దోషం జగన్‌ను వెంటాడుతోందా? ఏ ఇష్యూ పట్టుకున్నా నెగిటివ్ సంకేతాలే వస్తున్నాయా? ఉన్నట్లుండి దక్షిణ దిశలో కంచె తొలగింపు దేనికి సంకేతం? వాస్తు దోషాలే కారణమని జగన్ భావిస్తున్నారా? ఇంటిని చక్కదిద్దుకునే పనిలో పడ్డారా? అవుననే సంకేతాలు బలంగా వినిపిస్తున్నాయి.
వైసీపీ అధినేత జగన్.. ఓ అడుగు ముందుకేస్తే, నాలుగు అడుగులు వెనక్కి వెళ్తోంది. పార్టీ వ్యవహారాలు, సొంత వ్యవహారాలు.. ఇలా ఏది చూసినా రకరకాలుగా సమస్యలు తీవ్రమవుతున్నాయి. రోజురోజుకీ అవి పెరుగుతూ పెద్దవి అవుతున్నాయి. ఏ మాత్రం ఉపశమనం కలగలేదు. ఈ సమస్యలు అన్నింటికీ ఇంటి చుట్టూ ఉన్న కంచే కారణమని వాస్తు పండితులు చెప్పేశారట. అందుకే, ఇప్పుడు దాన్ని ఉంచాలా? తొలగించాలా? వాస్తు ప్రకారం మార్పులు చెయ్యాలా అనే ఆలోచనలో ఉన్నారట. ఇప్పటికే కొన్ని పనులు మొదలుపెట్టేశారని సమాచారం.
ఎన్నికలకు మూడు నెలల నుంచి ఇదే జరుగుతోంది. అధికారంలో ఉండడంతో పెద్దగా ఆయన పట్టించుకోలేదు. ఆయన జాతకంలో ఏమైనా సమస్యలున్నాయా? తాడేపల్లి ప్యాలెస్‌కి దోషం ఉందా? ఇవే ప్రశ్నలు జగన్‌ను పలుమార్లు వెంటాడాయి.
బెంగుళూరులో కొంత మంది పండితులను కలవడం, వారు వచ్చి తాడేపల్లి ప్యాలెస్‌ను పరిశీలించడం జరిగిపోయిందట. ఈ క్రమంలో ఇంటికి పలు మార్పులు సూచించారట. ప్రస్తుతం తాడేపల్లి ప్యాలెస్‌లో వాస్తు మార్పులకు శ్రీకారం చుట్టారు. ఎన్నికలకు ముందు దక్షిణ దిశలో కంచె తొలగించారు.
ALSO READ: ఏపీ మన్యంలో అలజడి.. కారును తగలబెట్టిన మావోయిస్టులు
లేటెస్ట్‌గా ఈశాన్యంలో మార్పులు చేస్తున్నారట. తూర్పు, ఈశాన్యం మూసి ఉంచడం మంచిది కాదని చెప్పారట. వున్నట్లుండి జగన్ తన ఇంటికి వాస్తు మార్పులు చేయడంతో రాజకీయవర్గాల్లో ఆసక్తికర చర్చ మొదలైంది. మార్పులు తర్వాత కొద్దిరోజులు ఆగాలని, ఆ తర్వాత అంతా మంచే జరుగుతుందని పండితులు చెప్పారట.
2024 ఎన్నికలకు ముందు నుంచే జగన్‌ను సమస్యలు వెంటాడుతున్నాయి. ఆయన పెద్దగా పట్టించుకోలేదు. కాకపోతే ఆ సమయంలో ఇంటికి కొన్ని మార్పులు చేరారు. అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఫలితంగా వైసీపీకి అధికారం దూరమైంది.
ఎన్నికల తర్వాత కూడా లేనిపోని సమస్యలు జగన్‌ను వెంటాడుతున్నాయి. ఓ వైపు ఫ్యామిలీలో ఆస్తుల వ్యవహారం తీవ్ర దుమారం రేగింది. దాదాపు నెలరోజులపాటు మీడియాలో రచ్చ అయ్యింది. ఈ విషయంలో జగన్ ఇమేజ్ ఊహించని విధంగా డ్యామేజ్ అయ్యింది. ఈ క్రమంలో సరస్వతి భూములపై కూటమి సర్కార్ దృష్టి పెట్టింది.
కేంద్రం నుంచి వైసీపీ ఆశించినంత మద్దతు కరువైంది. కనీసం ముఖం చూడడం మానేశారట. ఇంకోవైపు నమ్ముకున్న నేతలు పార్టీకి దూరమవుతున్నారు. కేడర్ దిక్కుతోచని స్థితిలో పడిపోయింది. ప్రజల్లోకి వెళ్లేందుకు ఆయా అంశాలను చక్కదిద్దే పనిలో పడ్డారట జగన్.