Prabhas:ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న ప్రభాస్(Prabhas) ప్రస్తుతం ఎంత పాపులర్ స్టారో చెప్పనక్కర్లేదు.. ఏ దేశానికి వెళ్లినా ఈయన్ని గుర్తుపట్టే అంత రేంజ్ కి వెళ్ళిపోయారు. అలాంటి ప్రభాస్ ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తలో చాలా అవమానాలు ఫేస్ చేశాడు. ముఖ్యంగా ఈశ్వర్ (Eshwar) సినిమా సమయంలో అసలు ఇతగాడికి యాక్టింగ్ వస్తుందా.? ఇతడిని హీరోగా పెట్టి సినిమా తీయడం వేస్ట్.. బడ్జెట్ బొక్క.. అంటూ ఎంతో మంది అవమానించారట. కానీ ప్రభాస్ మెల్లిమెల్లిగా చాప కింద నీరులా తన స్టార్డంని అందరికీ తెలిసేలా చేశాడు. అలా ‘బాహుబలి’ సినిమాతో ఆయన దశ తిరిగిపోయింది.ఆ తర్వాత ప్రభాస్ చేసే సినిమాలన్నీ పాన్ ఇండియా రేంజ్ లోనే విడుదలయ్యాయి. అంతేకాదు లేటెస్ట్ గా చేసే సినిమాలన్నీ కూడా పాన్ ఇండియా సినిమాలే. అయితే అలాంటి పాన్ ఇండియా స్టార్ ఓ హీరో కాల్ చేస్తే గజగజ వణికిపోతారట. మరి ఇంతకీ ప్రభాస్ ఏ హీరోని చూసి అంతలా భయపడతారో ఇప్పుడు చూద్దాం..
ఆ హీరో అంటే భయం అంటున్న ప్రభాస్..
చాలామంది హీరోలకు ఎవరో ఒకరి మీద గౌరవం, భయం అనేవి ఉంటాయి. అలా ప్రభాస్ కి కూడా తన పెదనాన్న కృష్ణంరాజు (krishnam raju) తో పాటు మోహన్ బాబు (Mohan babu) అంటే చాలా భయమట. అయితే పెదనాన్న కృష్ణంరాజుతో సరదాగా ఉంటారు కానీ ఏదైనా విషయం చెప్పడానికి మొహమాట పడతారు. కానీ మోహన్ బాబు ఫోన్ చేస్తేనే ప్రభాస్ వణికిపోతారట. అయితే ఈ విషయాన్ని స్వయంగా మంచు విష్ణు ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. మంచు విష్ణు మాట్లాడుతూ.. “మా నాన్నగారు కాల్ చేస్తే ప్రభాస్ వణికి పోతాడు. ఓసారి కన్నప్ప మూవీ (Kannappa Movie) కోసం మా నాన్న స్వయంగా ప్రభాస్ కి కాల్ చేసి నువ్వు ఈ సినిమాలో కచ్చితంగా నటించాలి అని చెప్పారు.అప్పటికే వణికిపోతున్న ప్రభాస్ ఓకే కచ్చితంగా చేస్తాను అని క్షణం కూడా ఆలోచించకుండా చెప్పారట. అయితే మళ్లీ ఈ విషయాన్ని నాకు కాల్ చేసి చెబుతూ ఏదైనా విషయం ఉంటే నువ్వు నాకు పర్సనల్గా కాల్ చేసి చెప్పు.కానీ ఆయన దాకా రానివ్వకు” అని ప్రభాస్ నాతో చెప్పాడు.మా నాన్న కాల్ చేస్తే ప్రభాస్ కి మాట్లాడ్డానికి చాలా భయం అంటూ మంచు విష్ణు(Manchu Vishnu) చెప్పుకొచ్చారు..
Posani Arrest : పోసాని అరెస్ట్‌పై పేలుతున్న ట్రోల్స్… ఆ సినిమాలో కోర్టు సీన్‌తో లాయర్‌పై పంచ్‌లు
గౌరవంతో కూడుకున్న భయం అంటూ..
ఇక మంచు ఫ్యామిలీకి కృష్ణంరాజు ఫ్యామిలీకి చాలా రోజుల నుండి మంచి బాండింగ్ కొనసాగుతోంది.అందుకే ప్రభాస్ హీరోగా నటించిన బుజ్జిగాడు (Bujjigadu) సినిమాలో మోహన్ బాబు కీ రోల్ పోషించారు. అలాగే ‘కన్నప్ప’ మూవీ లో కూడా ప్రభాస్ గెస్ట్ రోల్ లో నటించాలని అడిగిన వెంటనే ప్రభాస్ కూడా ఓకే చెప్పారట. అలా వీరి మధ్య ఉన్న బాండింగ్ కారణంగానే ఒకరికి ఒకరు గౌరవ మర్యాదలు ఇచ్చుకుంటారని మంచు విష్ణు చెప్పారు.ఇక మంచు విష్ణు భారీ బడ్జెట్ తో తీస్తున్న కన్నప్ప మూవీలో చాలామంది స్టార్ హీరో , హీరోయిన్లు ఉన్నారు. అలాగే ఈ సినిమాలో ప్రభాస్ రెమ్యూనరేషన్ తీసుకోకుండానే సినిమా చేస్తున్నట్టు తెలుస్తోంది.