BigTV English
Advertisement

IND vs NZ: వ‌ర్షం కార‌ణంగా భార‌త్‌, న్యూజిలాండ్ మ్యాచ్ రద్దు అయితే ఎలా? సెమీస్‌లో రోహిత్ సేనకు నష్టమేనా ?

IND vs NZ: వ‌ర్షం కార‌ణంగా భార‌త్‌, న్యూజిలాండ్ మ్యాచ్ రద్దు అయితే ఎలా? సెమీస్‌లో రోహిత్ సేనకు నష్టమేనా ?

IND vs NZ: ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో భాగంగా గురువారం పాకిస్తాన్ – బంగ్లాదేశ్ జట్ల మధ్య జరగాల్సిన మ్యాచ్ వర్షం కారణంగా రద్దు అయ్యింది. పాకిస్తాన్ లోని రావాల్పిండి క్రికెట్ స్టేడియంలో టోర్నీలోని 9వ మ్యాచ్ జరగాల్సి ఉండగా.. నిరంతర వర్షం, తడి అవుట్ ఫీల్డ్ కారణంగా టాస్ కూడా పడలేదు. టాస్ పడక ముందు నుండే వర్షం కురుస్తూ ఉండడంతో ఇక అంపైర్లు మ్యాచ్ రద్దు చేశారు. ప్రస్తుత ఎడిషన్ లో వర్షం కారణంగా రద్దయిన రెండవ మ్యాచ్ ఇది.


 

ఫిబ్రవరి 25న కూడా ఆస్ట్రేలియా – సౌత్ ఆఫ్రికా జట్ల మధ్య జరగాల్సిన మ్యాచ్ కూడా ఇలానే టాస్ పడకుండా రద్దు అయ్యింది. పాకిస్తాన్ – బంగ్లాదేశ్ మ్యాచ్ గ్రూప్ – ఏ లో భాగంగా జరగాల్సిన నామమాత్రపు మ్యాచ్ రద్దు అయ్యింది. ఈ గ్రూపు నుండి ఈ రెండు జట్లు ఇప్పటికే సెమీస్ రేసు నుంచి నిష్క్రమించాయి. ఇక గ్రూప్ – ఏ నుండి భారత్ – న్యూజిలాండ్ సెమీస్ బెర్తులు ఖరారు చేసుకున్నాయి. ఇక గ్రూపు – బి లో సెమీస్ రేసు ఆసక్తికరంగా మారింది. మంగళవారం దక్షిణాఫ్రికా – ఆస్ట్రేలియా జట్ల మధ్య జరగాల్సిన మ్యాచ్ కూడా వర్షం కారణంగా రద్దయింది.


దీంతో ఇరుజట్లకు ఒక్కో పాయింట్ ని కేటాయించారు. అయితే ఈ మ్యాచ్ వర్షం కారణంగా రద్దు కావడంతో గ్రూప్ బి లోని జట్లు అన్నీ కూడా సెమీస్ రేసులోకి వచ్చాయి. ఈ నేపథ్యంలో శుక్రవారం జరిగే ఇంగ్లాండ్ – ఆఫ్ఘనిస్తాన్ జట్ల మధ్య పోరు ఇరుజట్లకు డూ ఆర్ డై గా మారింది. ఈ మ్యాచ్ లో ఓడిపోయిన జట్టు ఛాంపియన్స్ ట్రోఫీ నుండి నిష్క్రమిస్తుంది. ఇక మార్చి రెండున గ్రూప్ – ఏ లోని భారత్ – న్యూజిలాండ్ జట్ల మధ్య నామమాత్రపు మ్యాచ్ జరగబోతోంది. ఈ మ్యాచ్ లో గెలిచిన జట్టు గ్రూప్ ఏ లో టేబుల్ టాపర్ గా సెమీస్ లో అడుగుపెడుతుంది.

కానీ దుబాయ్ వేదికగా జరిగే ఈ మ్యాచ్ ని ఇరుజట్లు తేలికగా తీసుకోవడం లేదు. అయితే ఈ మ్యాచ్ కూడా ఒకవేళ వర్షం కారణంగా రద్దు అయితే పరిస్థితులు ఎలా ఉంటాయంటే.. ప్రస్తుతం పాయింట్ల పట్టికను చూస్తే గ్రూప్ – ఎ లో న్యూజిలాండ్ అగ్రస్థానంలో ఉంది. భారత్ రెండవ స్థానంలో నిలిచింది. అయితే భారత్ న్యూజిలాండ్ జట్ల మధ్య జరిగే మ్యాచ్ వర్షం కారణంగా రద్దు అయితే.. ఈ ఇరుజట్లకు ఒక్కో పాయింట్ ని కేటాయిస్తారు. దీంతో పాయింట్ల పట్టికలో ఎలాంటి మార్పు ఉండదు.

 

ఈ నేపథ్యంలో న్యూజిలాండ్ టేబుల్ టాపర్ గా, భారత్ రెండవ స్థానంతో సెమీస్ లోకి అడుగుపెడతాయి. అయితే ఛాంపియన్ ట్రోఫీ నిబంధనల ప్రకారం టేబుల్ టాపర్ గా ఉన్న జట్టు గ్రూప్ బి లో రెండవ స్థానంలో నిలిచిన జట్టుతో, అలాగే గ్రూప్ – ఎ లో రెండవ స్థానంలో ఉన్న జట్టుతో ఆడాల్సి ఉంటుంది. ఇక సెమి ఫైనల్స్, ఫైనల్ కి మాత్రమే రిజర్వ్ డే లు ఉన్నాయి. అయితే ప్రస్తుతం దుబాయిలో ఎండాకాలం కావడంతో అక్కడ వర్షాలు పడే అవకాశం లేదు. దీంతో భారత్ – న్యూజిలాండ్ మ్యాచ్ వర్షం పడి రద్దు అయ్యే అవకాశం లేనట్లే.

Related News

Anushka-Kohli: కోహ్లీ – అనుష్క శర్మ విడాకులు ?సోష‌ల్ మీడియాలో దారుణంగా పోస్టులు

WPL Retention 2026 : రిటైన్ లిస్టు ఇదే..WPL 2026 టోర్న‌మెంట్ షెడ్యూల్ ఇదే..!

IND VS AUS 4th T20I : వాషి యో వాషి..3 వికెట్లు తీసిన వాషింగ్ట‌న్‌, కంగారుల‌పై టీమిండియా విజ‌యం

Kajal Aggarwal: టీమిండియా మ్యాచ్ కు కాజ‌ల్‌..భ‌ర్త‌ను హ‌గ్ చేసుకుని మ‌రీ, ఆస్ట్రేలియా టార్గెట్ ఎంతంటే

Tata Motors: వ‌ర‌ల్డ్ క‌ప్ గెలిచిన టీమిండియా ప్లేయ‌ర్ల‌కు టాటా బంప‌ర్ ఆఫ‌ర్‌

PV Sindhu: బోల్డ్ అందాలతో రెచ్చిపోయిన PV సింధు.. వెకేషన్ లో భర్తతో రొమాన్స్

IND VS AUS, 4th T20I: టాస్ ఓడిన టీమిండియా..మ్యాక్స్‌వెల్ తో పాటు 4 గురు కొత్త‌ ప్లేయ‌ర్లు వ‌చ్చేస్తున్నారు

Harleen Deol: మోడీ సార్‌.. ఎందుకు ఇంత హ్యాండ్స‌మ్ గా ఉంటారు? హర్లీన్ డియోల్ ఫ‌న్నీ క్వ‌శ్చ‌న్‌

Big Stories

×