SV 17:విభినమైన కథలను ఎంచుకుంటూ వైవిద్యభరితమైన నటనతో ఇండస్ట్రీలో తనకంటూ హీరోగా ఓ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు నటుడు శ్రీ విష్ణు(Sri Vishnu).చాలా సినిమాల్లో ఫ్రెండ్ క్యారెక్టర్ లలో, సెకండ్ హీరోగా నటించిన శ్రీ విష్ణు..ఇటీవల వరుస సినిమాలు చేస్తూ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రస్తుతం స్టార్ హీరోల సినిమాల్లో కీ రోల్స్ చేయడం మానేసి, తక్కువ బడ్జెట్ లో చిన్న చిన్న సినిమాలు చేస్తూ భారీ హిట్ కొడుతున్నారు. అలాంటి శ్రీ విష్ణు నటిస్తున్న తాజా మూవీ మృత్యుంజయ (Mrityunjaya)..ఈ సినిమాకి సంబంధించి టైటిల్ ని కూడా తాజాగా అనౌన్స్ చేశారు.అయితే శ్రీ విష్ణు బర్త్డే సందర్భంగా ఆయన 17వ సినిమాకి సంబంధించి టైటిల్ అలాగే టీజర్ రెండూ విడుదల చేశారు. మరి ఈ టీజర్ ఎలా ఉంది..? ఇందులో శ్రీ విష్ణు ఎలాంటి పాత్ర పోషిస్తున్నారు అనేది ఇప్పుడు చూద్దాం..
శ్రీ విష్ణు ఎస్ వి 17 టైటిల్, టీజర్ రిలీజ్..
శ్రీ విష్ణు హీరోగా హుస్సేన్ షా కిరణ్ దర్శకత్వంలో వస్తున్న తాజా మూవీ ఎస్వి17(SV 17).. అయితే తాజాగా ఈ సినిమాకి సంబంధించి టైటిల్ అనౌన్స్ చేశారు మూవీ మేకర్స్. పిక్చర్ పర్ఫెక్ట్ ఎంటర్టైన్మెంట్స్, లైట్ బాక్స్ మీడియా సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఎస్వి17 మూవీకి ‘మృత్యుంజయ’ అనే సినిమా టైటిల్ ని ఫిక్స్ చేశారు. అలాగే ఈ సినిమాలో శ్రీ విష్ణు ఖైదీ పాత్రలో డిటెక్టివ్ గా కనిపించబోతున్నట్టు తెలుస్తోంది. ఇక మృత్యుంజయ మూవీ టీజర్ విషయానికి వస్తే.. ఈ సినిమా ఒక ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ జానర్ లో రాబోతున్నట్టు అర్థమవుతుంది. ఈ మూవీలో ఖైదీ పాత్రలో హీరో శ్రీ విష్ణు కనిపించబోతున్నారు. అలాగే ఈ టీజర్ ” గేమ్ ఓవర్ జై” అనే డైలాగ్ తో స్టార్ట్ అయింది.ఆ తర్వాత ఇందులో నటించిన పాత్రలన్నింటిని చూపించారు.ఇక చివర్లో ఖైదీ పాత్రలో ఉన్న శ్రీ విష్ణు ఓ డైలాగ్ చెబుతారు. “నేను గేమ్ అయిపోయింది అనే వరకు అస్సలు అవ్వదు” అనే డైలాగ్ చెబుతాడు
ఆకట్టుకుంటున్న టీజర్..
మృత్యుంజయ మూవీ టీజర్ తోనే ఆకట్టుకోవడంతో సినిమాపై భారీ హోప్స్ పెరిగాయి. ఇక మృత్యుంజయ మూవీ సినిమాలో శ్రీ విష్ణు సరసన రెబా మోనిక జాన్(Reba Monica John) హీరోయిన్ గా నటిస్తోంది.ఇక ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ జానర్ లో డిటెక్టివ్ గా ఈ సినిమాలో శ్రీ విష్ణు అదరగొట్టబోతున్నారని టీజర్ చూసిన అభిమానులు కామెంట్లు పెడుతున్నారు. ఇక ఈ మూవీలో శ్రీ విష్ణు మేకోవర్ కూడా చాలా డిఫరెంట్ గా ఉంది. దాంతో సినిమాపై మరిన్ని అంచనాలు పెరిగాయి. ఇక ఈ సినిమా టీజర్ లో బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా బాగుంది. అలాగే మృత్యుంజయ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ గా కీరవాణి తనయుడు కాలభైరవ(Kala Bhairava) వర్క్ చేస్తున్నాడు. మృత్యుంజయ మూవీ రిలీజ్ డేట్ త్వరలోనే ప్రకటించబోతున్నట్టు తెలుస్తోంది.తక్కువ బడ్జెట్ తో సినిమాలు చేస్తూ భారీ హిట్ కొడుతున్న శ్రీ విష్ణు ఈ సినిమాతో కూడా హిట్ కొడతారని టీజర్ చూస్తేనే అర్థమవుతుంది.
Thank you for your wishes DQ garu 🤗 So glad ❤️#Mrithyunjay https://t.co/RyJ0dGmEDh
— Sree Vishnu (@sreevishnuoffl) February 28, 2025