Posani Arrest :ప్రముఖ సినీ నటుడు, రచయిత, రాజకీయవేత్త అయిన పోసాని కృష్ణ మురళి (Posani Krishna Murali), మొన్న రాత్రి అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఆయన అరెస్టుపై పలువురు మీమర్స్ , ట్రోలర్స్.. ట్రోల్స్ చేస్తూ తెగ రెచ్చిపోతున్నారు. ముఖ్యంగా ఒక సినిమాలోని కోర్టు సీన్ తో పోసాని తరఫు లాయర్ పై కూడా పంచులు వేస్తూ ఉండడం గమనార్హం. మరి అసలు విషయం ఏమిటో ఇప్పుడు చూద్దాం.
పోసాని అరెస్ట్ పై ట్రోల్స్ వైరల్..
పోసాని కృష్ణ మురళిని పోలీసులు అరెస్టు చేయగా.. ఆయన తరఫున న్యాయవాది పొన్నవోలు కేసు వాదిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే నాగచైతన్య (Naga Chaitanya) హీరోగా నటించిన ‘దోచేయ్’ సినిమాలోని కోర్టు సీన్ ను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. పోసాని తో పాటు పోసాని తరఫున న్యాయవాదిగా కేసు వాదిస్తున్న పొన్నవోలు టార్గెట్ గా తెగ ట్రోల్స్ చేస్తున్నారు. ఈ కోర్ట్ సీన్ లో కమెడియన్ సప్తగిరి (Saptagiri) డబ్బులు తీసుకొని పోసాని తరఫున కేస్ వాదిస్తున్నట్టు మనం చూడవచ్చు. ఇప్పుడు రియల్ లో కూడా పొన్నవోలు సుధాకర్ రెడ్డి (ponnavolu Sudhakar Reddy) పోసాని తరఫున అలాగే వాదిస్తున్నాడు అంటూ ట్రోల్స్ చేస్తూ ఉండడం గమనార్హం. ఏదిఏమైనా పోసాని అరెస్టు అయిన సందర్భంగా పలువురు మీమర్స్ , ట్రోలర్స్ ఇలాంటి వీడియోలను షేర్ చేస్తూ తెగ వైరల్ చేస్తున్నారు.
పోసాని అరెస్ట్.. ఏమైందంటే..?
రాయదుర్గం మై హోమ్ భుజా అపార్ట్మెంట్స్ లో నివాసం ఉంటున్న పోసానిని ఏపీలోని రాయచోటి పోలీసులు మొన్న రాత్రి అదుపులోకి తీసుకున్నారు. గతంలో అన్నమయ్య జిల్లాలో ఓబులవారిపల్లె పోలీస్ స్టేషన్ లో కూడా పోసానిపై కేసు నమోదయింది. గతంలో సినిమా పరిశ్రమపై విమర్శలు చేశారని స్థానికులు ఫిర్యాదు చేయగా.. 196, 353(2), 111 రెడ్ విత్ 3(5) పలు సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ నేపథ్యంలోనే బుధవారం రాత్రి సంబేపల్లి ఎస్సై రాయదుర్గం చేరుకొని పోసానిని అదుపులోకి తీసుకోవడం జరిగింది.నిన్న ఓబులవారిపల్లెకు పోసానిని తరలించి రాజంపేట హైకోర్టులో హాజరు పరిచారు. ఈ నేపథ్యంలోనే అక్కడ జరిగిన కోర్టు సన్నివేశాలను ఇలా ట్రోల్స్ రూపంలో వైరల్ చేస్తూ ఉండడం గమనార్హం.
Deepika RangaRaju: బట్టలు అవసరం లేదంటున్న కావ్య.. ఇదెక్కడ తయారయిందిరా..?
సీఎం, డీసీఎంపై గతంలో సంచలన కామెంట్స్..
గతంలో వైకాపా ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఏపీఎఫ్టీవీడీసీ చైర్మన్ గా పనిచేశారు పోసాని. అయితే ఆ పదవిలో ఉన్నప్పుడు అటు సినీ పరిశ్రమపై, ఇటు ప్రస్తుత ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు(CM Nara Chandra Babu Naidu), ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ (Pawan Kalyan), విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ (Nara Lokesh) లపై అనుచిత వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఈ విషయంపై కూడా ఆయనపై కేసు నమోదయింది. ఇకపోతే గత కొద్ది రోజుల క్రితమే తాను రాజకీయాలకు దూరం అవుతున్నానని, ఇకపై జీవితాన్ని కుటుంబానికే కేటాయించబోతున్నానని చెప్పిన పోసానిని ఇప్పుడు అరెస్టు చేయడంపై ప్రతి ఒక్కరు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
పోసాని కేసు వాదీస్తున్న పొన్నవోలు అంకుల్ 😂😂😉😉
pic.twitter.com/t3EdSy6AUi— 𝗣𝗿𝗮𝘀𝗮𝗻𝗻𝗮🚲🚲®️ (@prasana_kumar) February 27, 2025