Manchu Vishnu:మంచు విష్ణు.. అత్యంత ప్రతిష్టాత్మకంగా తాజాగా తెరకెక్కిస్తున్న చిత్రం కన్నప్ప. జూన్ 27వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో తాజాగా ఈ సినిమా ప్రమోషన్స్ కార్యక్రమాలు చేపట్టారు. అందులో భాగంగానే సినిమాకు సంబంధించిన విషయాలతో పాటు పలు వ్యక్తిగత విషయాలను కూడా పంచుకుంటున్న మంచు విష్ణు తాజాగా ఆమె మరణం నాన్నకు నరకంగా అనిపించింది అంటూ అసలు విషయాన్ని బయటపెట్టి అందరిని ఆశ్చర్యపరిచారు మరి ఆమె ఎవరు? ఆమె మరణం మోహన్ బాబును అంతలా కృంగదీసిందా అసలు విష్ణు ఏం చెప్పాలనుకుంటున్నాడు అనే విషయాలు ఇప్పుడు చూద్దాం.
సౌందర్య మరణానికి మోహన్ బాబు కారణం..
ఆమె ఎవరో కాదు దివంగత సినీనటి సౌందర్య.. ఈమె మరణం గురించి ఇప్పటికే ఎన్నో వార్తలు వినిపించాయి. ఈమె చనిపోయి 20 ఏళ్లు పూర్తయినా కూడా ఇంకా సౌందర్య మరణ మిస్టరీ వీడలేదు అనే చెప్పాలి. అలా రీసెంట్గా సౌందర్య మరణం గురించి ఖమ్మం జిల్లాకు చెందిన వ్యక్తి ఒక సంచలన ఫిర్యాదు చేసిన సంగతి మనకు తెలిసిందే. సౌందర్య విమాన ప్రమాదంలో మరణిస్తే ఆయన మాత్రం సౌందర్యని చంపింది మోహన్ బాబేనని, సౌందర్య జల్ పల్లి లోని తన 6 ఎకరాల భూమి అమ్మమంటే.. అమ్మక పోవడంతో కక్ష్య పెంచుకున్న మోహన్ బాబు సౌందర్యని ఆమె సోదరుడిని ఒక పథకం ప్రకారం చంపించాడు. సాక్ష్యాలు కూడా దొరకకుండా చేశాడు. అంటూ సంచలన ఫిర్యాదు చేశారు. ఇక ఈ ఫిర్యాదుతో అప్పట్లో మోహన్ బాబు పేరు సోషల్ మీడియాలో మార్మోగిపోయింది. అయితే ఎప్పుడు వివాదాల్లో ఇరుక్కునే మోహన్ బాబు సౌందర్య మరణం తర్వాత అలా ప్రవర్తించారు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు మంచు విష్ణు.
ఆ పిచ్చివాడిని మాపై ఉసిగొలిపింది మీడియానే – మంచు విష్ణు
తాజాగా కన్నప్ప మూవీ ప్రమోషన్స్ లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న మంచు విష్ణు సౌందర్య మరణం గురించి మాట్లాడుతూ.. “సౌందర్య మరణం గురించి మా నాన్నపై ఎన్నో ఆరోపణలు వినిపించాయి. కానీ ఇందులో ఎలాంటి నిజం లేదు. అయితే ఇలాంటి నిరాధారమైన ఆరోపణలకు మీడియా ప్రాధాన్యతను ఇచ్చి.. ఆ పిచ్చివాడిని మా నాన్నపై ఆరోపణలు చేసేలా ఉసిగొల్పారు.మా నాన్న పై ఈ ఆరోపణలు చేయమని ఆ వ్యక్తిని ఉసిగొలిపింది ఈ మీడియానే. ఆ వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు కారణంగా మా ఫ్యామిలీ చాలా బాధతో పాటు మనోవేదనకు గురైంది. అయితే సౌందర్య మరణ వార్త విన్నప్పుడు.. మేము షూటింగ్ సెట్లోని ఎడిటింగ్ రూమ్ లో ఉన్నాం. ఆ టైంలో సౌందర్య చనిపోయారు అని మాకు సమాచారం అందిది. దాంతో నాన్నకి ఈ విషయం చెబుతామని నేను ఆయన రూమ్ కి వెళ్ళినప్పుడు సైలెంట్ గా అక్కడ కూర్చొని ఉన్నారు. ఆ తర్వాత డైరెక్టర్ నాకు సైగలు చేసి సౌందర్య మరణించిన విషయాన్ని చెప్పమన్నాడు. ఇక సౌందర్య మరణ వార్తని చెప్పగానే మా నాన్న బాధతో కేకలు వేసారు. చాలా బిగ్గరగా అరిచారు. ఇది నిజం కాదు అనేలా మాట్లాడారు.ఆరోజు నాన్న ప్రవర్తించిన తీరు ఇప్పటికీ నాకు గుర్తుంది. ఆమె మరణం మా నాన్నను మనోవేదనకి గురి చేసింది. ఆమె మరణం నాన్నకి నరకంగా మారింది అంటూ మంచు విష్ణు తెలిపారు. ఇక సౌందర్య మరణం గురించి ఓ వ్యక్తి చేసిన ఆరోపణలు మా ఫ్యామిలీని ఎంతో ఇబ్బంది పెట్టాయి అంటూ తాజాగా సంచలన విషయం చెప్పుకొచ్చారు విష్ణు.
మోహన్ బాబు పై వస్తున్న ఆరోపణలకు స్పందించిన సౌందర్య భర్త..
అయితే గతంలో మంచు మోహన్ బాబుపై ఓ వ్యక్తి సౌందర్య మరణానికి కారణం మోహన్ బాబే అని చెప్పారు.కానీ ఆ వ్యక్తి చేసిన ఫిర్యాదుని ఖండించారు సౌందర్య భర్త రఘు. మోహన్ బాబుకి మాకు మంచి అనుబంధం ఉందని, సౌందర్యది విమాన ప్రమాదమని,అందులో మోహన్ బాబు ప్రమేయం ఏమీ లేదని,ఇప్పటికీ మోహన్ బాబుతో మాకు సన్నిహిత సంబంధాలే ఉన్నాయంటూ కొట్టిపారేశారు. ఏది ఏమైనా సౌందర్య మరణం పై వచ్చిన వార్తలు నిజం కాదని మరోసారి ప్రూవ్ చేసే ప్రయత్నం చేశారు విష్ణు.
ALSO READ:Shruti Haasan: తండ్రి కోసం బహిరంగంగా అలాంటి పని.. ఇది గమనించారా?