Shruti Haasan: శృతిహాసన్ (Shruti Haasan).. స్టార్ హీరోయిన్గా పేరు సొంతం చేసుకున్న శృతిహాసన్.. తెలుగు, తమిళ్ హిందీ భాషలలో నటిగా భారీ పాపులారిటీ అందుకుంది.ఈమె ఎవరో కాదు ప్రముఖ స్టార్ హీరో కమలహాసన్ (Kamal Haasan)పెద్ద కూతురు. తన తండ్రి కమల్ హాసన్ దర్శకత్వంలో 2000 సంవత్సరంలో వచ్చిన ‘హే రామ్’ అనే సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించి కెరియర్ను మొదలుపెట్టింది. అయితే ఆ సమయంలో ఈమెకు సంగీతంపై ఎక్కువ ఇష్టం ఉండడంతో సంగీతం పైనే శ్రద్ధ చూపింది. అయితే వయసుకు వచ్చాక హీరోయిన్గా అవకాశాలు వస్తుండడంతో 2008లో సోహం షా దర్శకత్వంలో తెరకెక్కిన లక్ అనే సినిమాలో ఇమ్రాన్ ఖాన్ సరసన తొలి సినిమా చేసింది. కానీ ఈ సినిమా డిజాస్టర్ గా నిలిచింది. ఇక తర్వాత తెలుగులో కె రాఘవేంద్రరావు కొడుకు అయిన కే ప్రకాష్ దర్శకత్వంలో వచ్చిన ‘అనగనగా ఓ ధీరుడు’ సినిమాలో సిద్ధార్థ సరసన నటించి విమర్శకుల ప్రశంసలు అందుకుంది.ఈ సినిమా కమర్షియల్ పరంగా పరాజయం అయినా.. ఉత్తమ తెలుగు నూతన నటి విభాగంలో దక్షిణ భారత ఫిలింఫేర్ అవార్డు లభించింది.
సింగర్ గా తనలోని టాలెంట్ నిరూపించుకున్న శృతిహాసన్..
ఇక తర్వాత పలు చిత్రాలు చేసి డిజాస్టర్ మూటగట్టుకున్న ఈమె.. ధనుష్ (Dhanush) సరసన ‘3’ అనే సినిమాలో నటించి, విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకుంది. ఆ తర్వాత హరీష్ శంకర్ (Hareesh Shankar)దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) సరసన ‘గబ్బర్ సింగ్’ సినిమాలో నటించినది. ఈ సినిమా భారీ విజయాన్ని అందించడమే కాకుండా శృతిహాసన్ రేంజ్ కూడా పెంచింది. అంతేకాదు నటిగా ఈమెను నిలబెట్టింది కూడా.. ఆ తర్వాత బలుపు, రామయ్య వస్తావయ్య ఇలా పలు చిత్రాలలో నటించిన ఈమె వ్యక్తిగత కారణాలవల్ల ఇండస్ట్రీకి దూరమై.. మళ్ళీ క్రాక్ సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చింది. ఇకపోతే 2023లో వీరసింహారెడ్డి , వాల్తేరు వీరయ్య చిత్రాలతో ఆకట్టుకున్న ఈమె 2024 లో ప్రభాస్ తో సలార్ సినిమా చేసి పాన్ ఇండియా హోదా అందుకుంది.
తండ్రి కోసం శృతిహాసన్ బహిరంగంగా అలాంటి పని..
ఇకపోతే శృతిహాసన్ నటి మాత్రమే కాదు మంచి సింగర్ కూడా. శృతిహాసన్ ‘శ్రీమంతుడు’ సినిమాలో “దిమ్మతిరిగే పాట” స్వయంగా పాడి అందరి దృష్టిని ఆకట్టుకుంది. అంతేకాదు ‘ 7th సెన్స్’ లో “యమ్మా యమ్మా” అనే పాట కూడా పాడింది. ‘వేదాళం’ సినిమాలో “ఆలుమ డోలుమా”, ‘వకీల్ సాబ్’ లో “మగువా మగువా ఫిమేల్ వర్షన్” అలాగే “సత్యమేవ జయతే” , “కంటిపాప” ఇలా పలు పాటలు పాడి తన గాత్రాన్ని వినిపించింది. అయితే ఎప్పుడు కూడా బహిరంగంగా పలు షోలలో పాల్గొని తన గాత్రాన్ని స్వయంగా వినిపించలేదు. అయితే మొదటిసారి తన తండ్రి కోసం బహిరంగంగా ఒక వేదికపై పాటను ఆలపించి, తనలోని సింగర్ను అందరికీ ప్రత్యక్షంగా పరిచయం చేసింది శృతిహాసన్. తాజాగా తన తండ్రి కమల్ హాసన్ నటించిన చిత్రం థగ్ లైఫ్. ఈ సినిమా జూన్ 5వ తేదీన విడుదల కాంబోతున్న నేపథ్యంలో ఇటీవల ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఇందులో తమిళ్ లో అద్భుతంగా పాట పాడి అందరి దృష్టిని ఆకర్షించింది శృతిహాసన్. ఏది ఏమైనా శృతిహాసన్ ఇలా బహిరంగంగా తొలిసారి పాట పాడి అందరి దృష్టిని ఆకట్టుకోవడమే కాకుండా తనలోని గొప్ప టాలెంట్ ని చూసి అటు ఏ ఆర్ రెహమాన్ (AR Rahman) కూడా మురిసిపోయారు. అక్కడ ఈ విషయం హైలెట్గా నిలిచింది.
ALSO READ:Bigg Boss:ఆ నటుడుని మోసం చేసిన బిగ్ బాస్ బ్యూటీ.. ఏకంగా ఎన్ని లక్షలంటే ?
?utm_source=ig_web_copy_link
?utm_source=ig_web_copy_link