BigTV English

Manchu Brothers: మంచు ఫ్యామిలీ రచ్చలో మరో ట్విస్ట్.. వీడియోతో విష్ణు క్లారిటీ..

Manchu Brothers: మంచు ఫ్యామిలీ రచ్చలో మరో ట్విస్ట్.. వీడియోతో విష్ణు క్లారిటీ..

Manchu Brothers: మంచు ఫ్యామిలీ ఈ మధ్య ఏదో ఒక ఇష్యూపై వార్తల్లో నిలుస్తోంది. మంచు మనోజ్- భూమా మౌనిక వివాహంతో మొదలైన హంగామా.. సోదరుడు విష్ణు చేసిన రచ్చతో పీక్స్‌కు చేరింది. కొంతకాలంగా మంచు బ్రదర్స్‌ మధ్య గొడవలు జరుగుతున్నాయని ప్రచారం ఉంది. మనోజ్ – మౌనిక పెళ్లి సమయంలోనూ విష్ణు అంటీముట్టనట్టుగా ఉన్నారన్న టాక్‌ వినిపించింది. పెళ్లి జరిగిన కొన్ని రోజులకే ఓ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. మనోజ్‌కు దగ్గరగా ఉండే వ్యక్తి ఇంటికి వెళ్లి విష్ణు గొడవకు దిగాడు. ఆ వీడియోను మనోజ్ సోషల్‌ మీడియాలో పోస్ట్ చేయడంతో… వైరల్‌గా మారింది. జరగాల్సిన రచ్చంత జరిగాక.. ఆ వీడియోను మనోజ్‌ తన అకౌంట్‌ నుంచి డిలీట్ చేశారు. అప్పటి నుంచి మంచు ఫ్యామిలీలో అసలేం జరుగుతుందన్న చర్చ మొదలైంది.


ఇక్కడే మంచు విష్ణు అసలైన ట్విస్ట్‌ ఇచ్చాడు. బిజినెస్‌ మైండ్‌ను ఉపయోగించి ఎవరూ ఊహించని విధంగా కొత్త వీడియోను రిలీజ్‌ చేశారు. ఆ వీడియోలో మంచు విష్ణు గొడవ పడిన దృశ్యాలను ప్రారంభంలో పెట్టారు. ఇది టీజర్‌ మాత్రమే.. త్వరలో హౌస్‌ ఆఫ్‌ మంచు అనే రియాల్టీ షోతో మీ ముందుకు వస్తామంటూ అర్ధం వచ్చేలా వీడియోను ముగించారు. విష్ణు రిలీజ్‌ చేసిన వీడియో చూస్తే మనోజ్ ఇంటికెళ్లి చేసిన రచ్చంతా ఫేక్ అన్నట్లుగా అర్ధమవుతోంది. త్వరలో ప్రారంభించనున్న రియాల్టీ షోలో భాగంగా… ప్రమోషన్స్ కోసం ఆ వీడియో చేసినట్టు తెలుస్తోంది.

ఇప్పుడంతా ఓటీటీ… రియాల్టీ షోల టైమ్‌. దీన్ని క్యాష్‌ చేసుకోవాలని మంచు ఫ్యామిలీ ప్లక్కా ప్లాన్‌ వేసిందా? త్వరలో ఓటీటీ వేదికగా ఓ సరికొత్త ప్రయత్నం చేయబోతున్నారా? హౌస్ ఆఫ్ మంచు పేరుతో రియాలిటీ షోను ప్రారంభించనున్నారని టాక్‌ వినిపిస్తోంది. అవా ఎంటర్‌టైన్‌మెంట్‌ ఈ రియాలిటీ షోను రూపొందిస్తున్నట్లు వీడియోను చూస్తే అర్ధమవుతుంది. మంచు విష్ణు తాజాగా విడుదల చేసిన వీడియో కూడా మార్కెటింగ్‌ టెక్నిక్‌లో భాగమే అంటున్నారు సినీ జనాలు. ఈ రియాలిటీ షోలో మంచు విష్ణు ఫ్యామిలీకి సంబంధించిన వారి వ్యక్తిగత జీవితాలను చూపించనున్నట్లు తెలుస్తోంది.


మంచు ఫ్యామిలీ గొడవలపై ముందు నుంచీ రకరకాలుగా వార్తలు వచ్చాయి. విష్ణు గొడవ వీడియో బయటకు రావడమే ఆలస్యం మెయిన్‌ స్ట్రీమ్‌ మీడియాతో పాటు… యూట్యూబ్‌ ఛానళ్లు… సోషల్‌ మీడియాలో అదే హాట్‌ టాపిక్‌ అయిపోయింది. ఆ వీడియోను చూసినవారంతా మంచు ఫ్యామిలీలో అసలేం జరుగుతోందని అనుకున్నారు. అన్నదమ్ముళ్ల మధ్య నిజంగానే ఈ రేంజ్‌లో వైరం ఉందా అనుకున్నారు. అయితే ఇదంతా కేవలం ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి చేసిన ప్లానేనా? అని అనుమానాలున్నాయి.

కొత్త వీడియోపై నెటిజన్లలో మరోరకం అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. విష్ణు రిలీజ్‌ చేసిన వీడియో రియాల్టీ షో కోసం లీక్ చేసిన వీడియోనా… పోయిన పరువు కాపాడుకోవడానికి తీసిన కవరింగ్‌ వీడియోనా.. అని కామెంట్లు చేస్తున్నారు.

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×