BigTV English

Mekapati : మేకపాటికి గుండెనొప్పి.. చెన్నై తరలించేందుకు ప్రయత్నం..

Mekapati : మేకపాటికి గుండెనొప్పి.. చెన్నై తరలించేందుకు ప్రయత్నం..

Mekapati : నెల్లూరు జిల్లా ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి అస్వస్థతకు గురయ్యారు. మర్రిపాడులోని తన నివాసంలో గుండెనొప్పి రావడంతో కుటుంబసభ్యులు వెంటనే వైద్యులను రప్పించారు. ఇంట్లోనే ఆయనకు చికిత్స అందిస్తున్నారు. మెరుగైన వైద్యం కోసం ఎమ్మెల్యేను చెన్నై తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.


గత నెలలో మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డికి గుండెపోటు వచ్చింది. అప్పుడు రెండు వాల్వులు బ్లాక్‌ అయినట్లు వైద్యులు గుర్తించి చికిత్స అందించారు. ఆ తర్వాత కోలుకున్నారు. 2021 డిసెంబర్‌లో చంద్రశేఖర్‌రెడ్డికి గుండెపోటు వచ్చింది. ఆ సమయంలో బెంగళూరులో సర్జరీ చేసి స్టంట్‌ వేశారు.

మేకపాటి చంద్రశేఖర్ రెడ్డిని ఇటీవల వైసీపీ అధిష్టానం పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. ఈ నేపథ్యంలో స్థానిక వైసీపీ నేతలతో ఆయనకు వార్ నడుస్తోంది. ఈ క్రమంలో గురువారం ఉదయగిరిలో పర్యటించారు. బస్టాండ్ సెంటర్ లో కుర్చీ వేసుకుని గంటన్నరపాటు కుర్చున్నారు. తనను తరిమికొడమన్నా నేతలు రావాలని సవాల్ చేశారు.


మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి 4సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. తొలి నుంచి వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుటుంబానికి మద్దతుగా ఉన్నారు. వైఎస్ఆర్ మరణం తర్వాత జగన్ వెంట నడిచారు. అయితే కొంతకాలంగా వైసీపీతో ఆయనకు దూరం పెరిగింది. తాజాగా జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో మేకపాటి క్రాస్ ఓటింగ్ చేశారని ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో పార్టీ ఆయనను సస్పెండ్ చేసింది.

Tags

Related News

Chandrababu: మళ్లీ జన్మంటూ ఉంటే నాకు అక్కడ పుట్టాలని ఉంది -చంద్రబాబు

Jagan-Sharmila: అన్న పేరెత్తకుండా షర్మిల, చెల్లి పేరు లేకుండా జగన్ రక్షా బంధన్ ట్వీట్లు

AP villages: లం*జబండ.. ఇదేం ఊరండి బాబు, పేరు మార్చాలంటూ.. గ్రామస్తులు గోల!

Tirumala devotees: తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. దర్శనానికి పట్టే సమయం ఎంతంటే?

CM Chandrababu: సిఎం చంద్రబాబు పై అభిమానం… 108 ఆలయాల్లో ఆ అభిమాని ఏం చేశారంటే?

AP new rule: ఏపీలో కొత్త రూల్.. పాటించకుంటే జరిమానా తప్పదు!

Big Stories

×