BigTV English

Prabhas in Kannappa : ఓపిక పట్టండి… ‘కన్నప్ప’లో ప్రభాస్ రోల్‌పై విష్ణు షాకింగ్ రిప్లై

Prabhas in Kannappa : ఓపిక పట్టండి… ‘కన్నప్ప’లో ప్రభాస్ రోల్‌పై విష్ణు షాకింగ్ రిప్లై

Prabhas in Kannappa : మంచు విష్ణు (Manchu Vishnu) డ్రీమ్ ప్రాజెక్ట్ గా ‘కన్నప్ప’ (Kannappa) సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఇక ఇందులో ప్రభాస్ (Prabhas) కీలకపాత్రను పోషించబోతున్నారు. తాజాగా సోషల్ మీడియా వేదికగా ప్రభాస్ రోల్ గురించి ఓ నెటిజన్ మంచు మనోజ్ కు స్పెషల్ గా రిక్వెస్ట్ చేశారు. అతని రిక్వెస్ట్ కి స్పందిస్తూ మంచు విష్ణు షాకింగ్ రిప్లై ఇచ్చారు.


ప్రస్తుతం వరుస పాన్ ఇండియా సినిమాలతో బిజీగా ఉన్న స్టార్ ఎవరు అంటే టక్కున గుర్తొచ్చే పేరు ప్రభాస్ (Prabhas). ఆయన వరుస హిట్లు అందుకోవడమే కాకుండా, వరుసగా దాదాపు ఐదారు పాన్ ఇండియా సినిమాలను లైన్లో పెట్టారు. ప్రస్తుతం అత్యధిక పాన్ ఇండియా సినిమాలు లైనప్ లో ఉన్న నెంబర్ వన్ పాన్ ఇండియా స్టార్ గా నిలిచారు ప్రభాస్. దీంతో క్షణం తీరిక లేకుండా బిజీబిజీగా సినిమాలు చేస్తున్నారు.

అయితే ఒకానొక టైంలో ప్రభాస్ (Prabhas) లుక్స్ పై దారుణంగా ట్రోలింగ్ జరిగిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా ‘ఆది పురుష్’ టైంలో మరీ దారుణంగా ప్రభాస్ లుక్స్ ని ట్రోల్ చేశారు. ప్రభాస్ లుక్ ను చూసి ఆయన అభిమానులు కూడా డిసప్పాయింట్ అయ్యారు. ఇక సినిమా కూడా చెత్తగా ఉందంటూ తీవ్రమైన నెగటివిటీని ఎదుర్కోవాల్సి వచ్చింది. కానీ ఆ తర్వాత వచ్చిన ‘సలార్’ మూవీతో ప్రభాస్ లుక్స్ పై వచ్చిన ట్రోలింగ్ తో పాటు నెగెటివిటీకి కూడా ఫుల్ స్టాప్ పడింది. డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ప్రభాస్ అభిమానుల ఎక్స్పెక్టేషన్స్ కు తగ్గట్టుగా ఆయనను తెరపై చూపించి, డార్లింగ్ ఫ్యాన్స్ మన్ననలు అందుకున్నారు.


ఇక ‘కల్కి’లో కూడా ప్రభాస్ (Prabhas) లుక్స్ పై స్పెషల్ కేర్ తీసుకున్నారు డైరెక్టర్ నాగ్ అశ్విన్. ఇక ఇప్పుడు ప్రభాస్ నెక్స్ట్ సినిమాలలో కూడా ఇలాంటి లుక్స్ ని కంటిన్యూ చేస్తే బాగుంటుందని అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు మూవీ లవర్స్. అయితే అందులో భాగంగానే ప్రభాస్ అభిమాని ఒకరు సోషల్ మీడియా వేదికగా మంచు విష్ణుని ప్రభాస్ లుక్స్ గురించి ఒక రిక్వెస్ట్ చేశారు.

“మూవీ ఎలా ఉన్నా పర్లేదు. ప్రభాస్ (Prabhas) అన్న క్యారెక్టర్ అండ్ లుక్ తేడా రాకుండా చూసుకో. మూవీకి ఐదు సార్లు వెళ్తాను” అంటూ కామెంట్ చేశాడు. ఆ నెటిజన్ రిక్వెస్ట్ కి మంచు విష్ణు (Manchu Vishnu) స్పందిస్తూ “మై బ్రదర్ నాకు 100% నమ్మకం ఉంది మీరు ప్రభాస్ క్యారెక్టర్ ని ఇష్టపడతారని. ఇంకా చెప్పాలని ఎగ్జైటింగ్ గా ఉంది. కానీ ఓపిక పట్టండి” అంటూ రాస్కొచ్చారు. కానీ ఈ సినిమా నుంచి కొంతకాలం క్రితం లీకైన ప్రభాస్ లుక్ పై నెగిటివ్ కామెంట్స్ వినిపించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ‘కన్నప్ప’ (Kannappa) సినిమాలో ప్రభాస్ (Prabhas) రోల్ తో పాటు లుక్ గురించి కూడా అభిమానులు ఆందోళన చెందుతున్నట్టుగా తెలుస్తోంది.

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×