BigTV English

Sri Tej Health Update: విషమంగానే శ్రీ తేజ్ ఆరోగ్యం.. కమిషనర్ సీపీ ఆనంద్ ఏం అన్నారంటే.?

Sri Tej Health Update: విషమంగానే శ్రీ తేజ్ ఆరోగ్యం.. కమిషనర్ సీపీ ఆనంద్ ఏం అన్నారంటే.?

Sri Tej Health Update: ఆర్టీసీ క్రాస్ రోడ్‌లో ‘పుష్ప 2’ సినిమా ప్రీమియర్ షో చూడడానికి వచ్చిన శ్రీతేజ్ అని బాలుడికి తొక్కిసలాటలో తీవ్ర గాయాలయ్యాయి. పరిస్థితి విషయంగా ఉండడంతో ఆ బాలుడిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. గత 13 రోజులుగా శ్రీతేజ్ హాస్పిటల్‌లోనే ఉన్నాడు. తాజాగా కమిషనర్ సీపీ ఆనంద్ స్వయంగా కిమ్స్ ఆసుపత్రికి వెళ్లి శ్రీతేజ్ ఆరోగ్యం ఎలా ఉందో కనుక్కున్నారు. ఆ తర్వాత ఈ విషయంపై ప్రెస్‌తో మాట్లాడారు. శ్రీతేజ్ పరిస్థితి ఇంకా విషమంగానే ఉందని తెలిపారు. 13 రోజులుగా శ్రీతేజ్ స్పృహాలో లేడు. ఈ విషయంలో అల్లు అర్జున్ ఒకరోజు జైలుకు కూడా వెళ్లొచ్చారు. దీంతో నేరుగా సీపీ ఆనంద్.. దీని గురించి ప్రెస్‌కు వివరించారు.


వెంటిలేటర్‌పై ట్రీట్మెంట్

‘‘సంధ్య థియేటర్‌లో సంఘటన జరిగి రెండు వారాలు గడుస్తోంది. రెండు వారాలుగా కిమ్స్‌లో చికిత్స పొందుతున్న శ్రీతేజ్ ఆరోగ్య పరిస్థితి ఏంటి, రానున్న రోజుల్లో ఎలాంటి చికిత్స చేయాలి అని డాక్టర్లను అడిగి తెలుసుకున్నాం. తన ఆరోగ్య పరిస్థితి గురించి డాక్టర్లు నాకు బులిటెన్ ఇవ్వనున్నారు. ఆరోజు జరిగిన తొక్కిసటాలో ఆక్సిజన్ అందక శ్రీతేజ్‌కు బ్రెయిన్ డ్యామేజ్ జరిగింది. దాని నుండి కోలుకోవడానికి సమయం పడుతుందని డాక్టర్లు తెలిపారు. ప్రస్తుతం వెంటిలేటర్ సపోర్ట్‌తో ట్రీట్మెంట్ జరుగుతోంది. ఈ ట్రీట్మెంట్ చాలాకాలం పాటు జరిగే అవకాశం ఉంది. టెక్నికల్ విషయాలకు సంబంధించిన బులిటెన్ త్వరలోనే విడుదల కానుంది’’ అని సీపీ ఆనంద్ వివరించారు.


Also Read: నో అపాయింట్మెంట్.. అల్లు అర్జున్‌ను పవన్ దగ్గరికి రానివ్వడం లేదా.?

విషమంగానే ఉంది

తెలంగాణ ప్రభుత్వం సైతం శ్రీతేజ్ ఆరోగ్య పరిస్థితిపై దృష్టిపెట్టింది. తనకు చికిత్స ఎలా జరుగుతుంది అనే విషయాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకుంటోంది. అందులో భాగంగానే కమిషనర్ సీపీ ఆనంద్ రంగంలోకి దిగారు. డాక్టర్లతో మాట్లాడిన తర్వాత ఈ ట్రీట్మెంట్ చాలాకాలం పాటు కొనసాగే అవకాశం ఉందని క్లారిటీ ఇచ్చారు. ఇప్పటివరకు డాక్టర్లు ఎలాంటి క్లారిటీ ఇవ్వకపోవడంతో శ్రీతేజ్ ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉందని వార్తలు వచ్చాయి. తాజాగా సీపీ ఆనంద్ చెప్పిన మాటలు వింటంటే ఆ వార్తలు నిజమే అని క్లారిటీ వస్తుంది. ఈ ట్రీట్మెంట్ చాలాకాలం పాటు కొనసాగే అవకాశం ఉంది అని సీపీ ఆనంద్ చెప్పగా.. అంటే శ్రీతేజ్ ఆరోగ్యం విషమంగానే ఉందని ప్రేక్షకులు అనుకుంటున్నారు.

ప్రభుత్వం హామీ

శ్రీతేజ్ తల్లి రేవతి మృతి విషయంలో పోలీసులు అల్లు అర్జున్‌ను అరెస్ట్ చేశారు. కానీ వెంటనే తనకు మధ్యంతర బెయిల్ రావడంతో ఒక్కరాత్రి జైలులో ఉండి వెంటనే రిలీజ్ అయ్యాడు అల్లు అర్జున్. అయితే ఈ మధ్యంతర బెయిల్‌ను క్యాన్సెల్ చేయాలని పోలీసులు కోర్టును ఆశ్రయించనున్నారని వార్తలు వచ్చాయి. కానీ ఆ వార్తలపై క్లారిటీ ఇవ్వడానికి సీపీ ఆనంద్ సిద్ధంగా లేరు. కిమ్స్ ఆసుపత్రికి వచ్చిన సీపీ ఆనంద్.. కేవలం శ్రీతేజ్ ఆరోగ్యం గురించే మాట్లాడారు. కచ్చితంగా తనకు మెరుగైన చికిత్స అందేలా చేస్తామని హామీ ఇచ్చారు. తనకు, తన కుటుంబానికి ప్రభుత్వం కావాల్సిన సాయం అందిస్తుందని తెలిపారు.

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×