BigTV English

Mangalavaram MovieTrailer : రిలీజ్ కు ముందే మంగళకరమైన బిజినెస్ .. మైండ్ బ్లాక్ చేస్తున్న మంగళవారం..

Mangalavaram MovieTrailer : రిలీజ్ కు ముందే మంగళకరమైన బిజినెస్ .. మైండ్ బ్లాక్ చేస్తున్న మంగళవారం..

Mangalavaram MovieTrailer : ఆర్ఎక్స్ 100 సినిమా ఏ రేంజ్ హిట్ కొట్టిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. చాలా చిన్న మూవీతో సైలెంట్ గా ఇండస్ట్రీలోకి వచ్చి సూపర్ హిట్ అందుకున్న డైరెక్టర్ అజయ్ భూపతి. అతను ప్రస్తుతం మంగళవారం అనే మరొక సినిమాతో ఆర్ఎక్స్ 100 బ్యూటీ పాయల్ రాజ్ పుత్ మెయిన్ లీడ్ లో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. ఈ చిత్రానికి వెరైటీగా మంగళవారం అనే పేరు పెట్టడం దగ్గర నుంచి ఈ చిత్రంపై ఒక రకమైన హైప్ జనరేట్ అయింది. అలాగే మూవీ నుంచి వచ్చిన టీజర్ , పాటలు, ట్రైలర్ అన్ని మంచి పాజిటివ్ బజ్ క్రియేట్ చేశాయి.


మూవీ ట్రైలర్ చూసిన తర్వాత నుంచి అందరూ చిత్రాన్ని చూడాలి అన్న ఆసక్తిని కనబరుస్తున్నారు. ఇక స్టోరీ విషయానికి వస్తే ఇది ఏదో ఊరికి సంబంధించిన మిస్టేరియస్ హత్యల వెనుక ఉన్న స్టోరీ అన్నది ట్రైలర్లో రివీల్ చేశాడు డైరెక్టర్. గ్రామదేవతకు మంగళవారం అంటే ఇష్టం కాబట్టి.. మంగళవారం నాడే హత్యలు జరుగుతున్నాయి కాబట్టి ..మూవీకి వెరైటీగా మంగళవారం అని టైటిల్ పెట్టిన విషయాన్ని కూడా ట్రైలర్ ద్వారా చెప్పకనే చెప్పాడు. అయితే ప్రస్తుతం మంగళవారం చిత్రానికి సంబంధించిన మరొక క్రేజీ అప్డేట్ వెలుగులోకి వచ్చింది.

అందరికీ ఈ చిత్రంపై భారీ అంచనాలు ఏర్పడటంతో మూవీ బిజినెస్ కూడా అంతే భారీగా జరుగుతుంది. ఏదో క్యాజువల్ మూవీలాగా వచ్చి వెళ్తుంది అనుకున్న ఈ చిత్రం కాస్త ఊహించని స్థాయిలో బిజినెస్ అందుకుంటుంది. ఆంధ్రా, సీడెడ్ ఏరియాస్ మొత్తానికి కలిపి 7.20 కోట్లకు దీని డీల్ సెట్ చేశారు. ఈ మూవీ ఏరియా వైజ్ ఊహించని డిమాండ్ సొంతం చేసుకుంటోంది. ఒక్క ఆంధ్రా రైట్స్ కోసమే ఆరు కోట్ల ఆఫర్ వస్తోందని టాక్.


ఎంతో అద్భుతమైన కథతో డైరెక్టర్ అజయ్ భూపతి ఈ చిత్రాన్ని మంచి థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ తో తీర్చిదిద్దారని.. చాలా లిమిటెడ్ బడ్జెట్ తో మూవీని తీశాడని తెలుస్తోంది. అయితే థియేట్రికల్ బిజినెస్ కోసం వస్తున్న ఆఫర్స్ విషయం మాత్రం దీనికి భిన్నంగా చాలా హై బడ్జెట్ లో కనిపిస్తుంది. ఒక్క చిన్న సినిమాకు ఇంత క్రేజీ ఆఫర్స్ వస్తున్నాయి అంటే మూవీపై ఎంత క్రేజీ బజ్ నెలకొందో చూడండి. డిస్ట్రిబ్యూటర్లు ఈ మూవీకి ప్రజెంట్ ఉన్న క్రేజ్ ని బట్టి ఎక్కువగా కొనడానికి ఇష్టపడుతున్నారు అని తెలుస్తోంది. మరో పక్క నాన్ థ్రెటికల్ రైట్స్ కోసం పలు ఓటిటి సంస్థలు కూడా పోటీ పడుతున్నట్లు టాక్.

ఇదంతా చూస్తుంటే మంగళవారానికి మంగళకరమైన బిజినెస్ జరుగుతుంది అనిపిస్తుంది. చిన్న బడ్జెట్ మూవీ సక్సెస్ అందుకుంటే ఇక డైరెక్టర్, డిస్ట్రిబ్యూటర్ , నిర్మాతలకు పండగే పండగ. ఆర్ఎక్స్ 100 క్లిక్ అయినప్పటికీ ఆ తరువాత పాయల్ పెద్దగా ఆఫర్స్ అందుకోలేక పోయింది. మళ్లీ తిరిగి ఈ చిత్రంతో హిట్ అందుకొని అయినా సాలిడ్ గా సెటిల్ అవ్వాలి అని ఆ బ్యూటీ ఆశపడుతోంది. ఈ మూవీ నవంబర్ 17న థియేటర్లలోకి రాబోతోంది. ఇంతవరకు అంతా బాగానే ఉంది కానీ తీరా దిగాక పోటీ తట్టుకొని నిలబడుతుందా లేదా చూడాలి.

Related News

Kissik Talks Show : డైరెక్టర్స్ చేస్తుంది తప్పు.. ఆ పద్ధతి మార్చుకోండి.. గీతా సింగ్ సంచలన కామెంట్స్..

Kissik Talks Show : నటి గీతా సింగ్ ఫస్ట్ రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా..?

SivaJyothi: గుడ్ న్యూస్ చెప్పబోతున్న శివ జ్యోతి… బుల్లి సావిత్రి రాబోతోందా?

Movie Industry : ఇండస్ట్రీలో ఇవి మారాల్సిందే… లేకపోతే దుకాణం క్లోజ్ ?

Mother Teresa : మదర్ తెరిస్సా 115 జయంతి.. సేవా కార్యక్రమాలలోలయన్స్ క్లబ్, హెల్ప్ ఫౌండేషన్!

Dharsha Guptha: ఇంస్టాగ్రామ్ ద్వారా నెలకు లక్షల్లో ఆదాయం..ఈ ముద్దుగుమ్మ పనే బాగుందే!

Big Stories

×