Mangli Birthday Party Case: సింగర్ మంగ్లీ (Singer Mangli)ప్రస్తుతం వివాదంలో చిక్కుకున్న సంగతి తెలిసిందే . ప్లే బ్యాక్ సింగర్ గా మంచి గుర్తింపు సంపాదించుకున్న ఈమె తాజాగా ఒక వివాదంలో చిక్కుకున్నారు. తాజాగా సింగర్ మంగ్లీ పుట్టినరోజు (Birthday)కావడంతో ఈమె ఒక పార్టీ నిర్వహించారు. ఈ పార్టీలో తన స్నేహితులు పాల్గొన్నారు. అయితే ఈ పార్టీలో పెద్ద ఎత్తున డ్రగ్స్ ఉపయోగిస్తున్నారనే వార్తలు రావడంతో పోలీసులు రిసార్ట్ పై దాడి చేసి వారందరిని అదుపులోకి తీసుకున్నారు. ఇలా సింగర్ మంగ్లీ పై కేసు నమోదు చేయడమే కాకుండా ఎఫ్ఐఆర్ లో కీలక విషయాలను నమోదు చేసినట్టు తెలుస్తుంది.
అనుమతి లేదు…
సింగర్ మంగ్లీ పుట్టినరోజు వేడుకలను త్రిపుర రిసార్ట్ లో నిర్వహించారని తెలుస్తుంది. అయితే ఇక్కడ పుట్టిన రోజు వేడుకలను నిర్వహించడం కోసం వీరు ఎలాంటి అనుమతి తీసుకోలేదని పోలీసులు తెలియజేశారు. ఇక పుట్టినరోజు వేడుకలలో భాగంగా పెద్ద ఎత్తున డీజే సౌండ్ లను పెట్టడంతో అది భరించలేని స్థానికులు ఒంటిగంట సమయంలో పోలీసులకు ఫిర్యాదు చేశారని తెలుస్తోంది. ఇలా స్థానికుల ఫిర్యాదుతో మహిళ ఎస్సై త్రిపుర రిసార్ట్ కు వెళ్లారు. ఇక ఈ పుట్టిన రోజు వేడుకలలో భాగంగా దాదాపు పది మంది వరకు అమ్మాయిలు 12 మంది అబ్బాయిలు పాల్గొన్నట్లు తెలియజేశారు.
డ్రగ్స్ తీసుకున్నారా…
పోలీసులు అక్కడికి చేరుకునే సమయానికి ప్రతి ఒక్కరు కూడా మద్యం మత్తులో తూలుతూ ఉన్నట్లు తెలియజేశారు. ఇక ఈ బర్త్డే పార్టీలో పెద్ద ఎత్తున విదేశీ మద్యాన్ని కూడా వాడినట్లు తెలిపారు. అయితే ఈ మధ్య వాడటానికి ఎక్సైజ్ పర్మిషన్ కూడా లేదని, డీజే కోసం అలాగే బర్త్డే పార్టీ కోసం కూడా మంగ్లీ ఏ విధమైనటువంటి అనుమతి తీసుకోలేదని మేనేజర్ వెల్లడించారు. ఇలా మత్తులో ఉన్న వారందరికీ డ్రగ్స్ కిట్టు ద్వారా పరీక్షలు నిర్వహించగా ఒక వ్యక్తి గంజాయి తీసుకున్నట్లు వెళ్లడైంది.
ఏ విధమైనటువంటి అనుమతి లేకుండా ఇక్కడ పార్టీని నిర్వహించినందుకు మంగ్లీ సోదరుడు శివరామకృష్ణ పై కేసు నమోదు చేశారు. అదేవిధంగా ఈ పార్టీకి అనుమతి ఇవ్వకపోవడంతో త్రిపుర రిసార్ట్ మేనేజ్మెంట్ దామోదర్ రెడ్డి పై కూడా కేసు నమోదు చేశారు.. అలాగే ఈవెంట్ మేనేజర్ మేఘ రాజ్ పై కూడా కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు.. ఇలా పోలీసులు ఉన్నఫలంగా రైడ్ నిర్వహించడంతో మంగ్లీ పోలీసులతో కూడా దురుసుగా వ్యవహరించిన తీరు తెలిసిందే. అయితే ప్రస్తుతం వీరిపై ఎఫ్ఐఆర్ నమోదు చేయడమే కాకుండా పూర్తిస్థాయిలో విచారణ కూడా జరపబోతున్నట్లు తెలుస్తోంది. అనుమతి లేకుండా విదేశీ మద్యం వాడటం డ్రగ్స్ ఉపయోగించడంతో సింగర్ మంగ్లీ ఆమె చెల్లెలు సత్యవతి పై కేసు నమోదు చేశారు. మరి పోలీసు దర్యాప్తులో ఎలాంటి నిజానిజాలు బయటపడతాయో తెలియాల్సి ఉంది.