Avika Gor Engaged: ‘చిన్నారి పెళ్లికూతురు’.. ఈ పేరు గురించి తెలియని ఇండియన్ ఉండరు అనడంలో సందేహం లేదు. అంతేకాదు అంతర్జాతీయ స్థాయిలో ఈ ముద్దుగుమ్మ చిన్నప్పుడే భారీ పాపులారిటీ అందుకుంది. అలా ‘చిన్నారి పెళ్లికూతురు’ సీరియల్ తో అటు బాలీవుడ్ ఇటు సౌత్ అందరి దృష్టిని ఆకర్షించి సెన్సేషన్ క్రియేట్ చేసింది అవికా గోర్ . ‘ఉయ్యాల జంపాల’ అనే సినిమాతో తెలుగు ప్రేక్షకులకు హీరోయిన్ గా పరిచయమైన ఈమె.. మొదటి సినిమాతోనే అందరి దృష్టిని ఆకట్టుకుంది. ప్రస్తుతం పలు చిత్రాలలో నటిస్తూ బిజీగా మారిన ఈమె.. ఇప్పుడు పెళ్లికి సిద్ధం అయిపోయింది. ఐదేళ్ల ప్రేమకు స్వస్తి పలుకుతూ.. మిలింద్ చంద్వానీతో ఎట్టకేలకు నిశ్చితార్థం చేసుకుంది ఈ ముద్దుగుమ్మ.
ఘనంగా అవికా గోర్ నిశ్చితార్థం..
ఈ క్రమంలోనే తమ నిశ్చితార్థానికి సంబంధించిన ఫోటోలను ఇంస్టాగ్రామ్ వేదికగా పంచుకుంది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో పలువురు సెలబ్రిటీలు, అభిమానులు అవికా గోర్ కి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఇకపోతే తాజాగా అవికా గోర్ తన ప్రియుడు, కాబోయే వరుడితో కలిసి దిగిన ఫోటోలను షేర్ చేస్తూ.. “ఆయన నోరు తెరిచి అడగ్గానే సంతోషంతో ఏడ్చేశాను. ఈ క్షణం కోసమే ఎంతగానో ఎదురు చూస్తున్నట్టుగా అవును అంటూ గట్టిగా అరిచాను.
ఇక నేను పూర్తిగా సినిమాలలో మునిగిపోయడం వల్ల నాకు మైండ్ లో మంచి బిజిఎం కూడా వినిపిస్తోంది. స్లో మోషన్ లో మా కల నెరవేరినట్టు అనిపిస్తుంది. అతడేమో ప్రశాంతంగా, తెలివిగా కనిపిస్తున్నాడు. ఇప్పుడు మేమిద్దరం జంటగా ఫిట్ అయ్యాము. ఎప్పుడైతే ఆయన నన్ను పెళ్లి చేసుకుంటావా అని అడిగారో అప్పుడే నా కళ్ళల్లో నీళ్లు ఉప్పొంగాయి.నా మనసు ఉత్సాహంతో ఊగిపోయింది” అంటూ భావోద్వేగ క్షణాలతో నిండిన మనసుతో తన మనసులో మాటను చెప్పుకొచ్చింది అవికా. ప్రస్తుతం ఈ ఫోటోలు ఇప్పుడు వైరల్ గా మారుతున్నాయి.
వరుడు బ్యాక్ గ్రౌండ్ ఏంటంటే?
ఇకపోతే అవికా గోర్ మిలింద్ చంద్వానీ తో ఏడడుగులు వేయబోతోంది. ప్రస్తుతం ఈ జంటకు సంబంధించిన ఫోటోలు వైరల్ అవ్వడంతో అవికా వివాహం చేసుకోబోతున్న అబ్బాయి ఎవరు? ఆయన బ్యాగ్రౌండ్ ఏంటి? అంటూ తెగ ఆరా తీస్తున్నారు. మిలింద్ చంద్వానీ ఒక సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్.. క్యాంప్ డైరీస్ వ్యవస్థాపకుడు కూడా.. ఇది నిరుపేద పిల్లలలో సాధికారత కల్పించడానికి అంకితమైన ఒక ఎన్జీవో సంస్థ. ఒకరకంగా చెప్పాలి అంటే వెనుకబడిన పిల్లలకు సహాయం చేయడం పై ఈ క్యాంప్ డైరీస్ అనే ఎన్జీవో సంస్థ దృష్టి సారించింది. మిలింద్ ఐఐఎం అహ్మదాబాద్ నుండి ఎంబీఏ పట్టా అందుకున్నారు. ఇన్ఫోసిస్ లో సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా తన ప్రయాణాన్ని మొదలుపెట్టారు. 2019లో MTV రోడీ రియల్ హీరోస్ లో పోటీదారుడుగా పాల్గొని అందరి దృష్టిని ఆకర్షించారు. అటు పనితో పాటు ఇటు అసిస్టెంట్ స్కూల్ ప్రిన్సిపల్ గా కూడా పనిచేశారు.
ఐదేళ్ల క్రితం అనగా 2020లో హైదరాబాదులోనే వీరిద్దరి మధ్య పరిచయం ఏర్పడిందని,అలా ఏర్పడిన పరిచయం.. ప్రేమగా మారి..ఇప్పుడు నిశ్చితార్థానికి దారితీసింది. ఇక త్వరలోనే పెళ్లి కూడా చేసుకోబోతున్నట్లు సమాచారం.
ALSO READ: Mangli Drugs Case: మంగ్లీ డ్రగ్స్ కేసులో ఇరుక్కున్న సెలెబ్రిటీలు వీళ్లే.. ఎఫ్‌ఐఆర్ నమోదు!