BigTV English

Thug Life : గో బ్యాక్ ఇండియన్ అని చెప్పాం కదా, మళ్ళీ ఎందుకు వచ్చావ్?

Thug Life : గో బ్యాక్ ఇండియన్ అని చెప్పాం కదా, మళ్ళీ ఎందుకు వచ్చావ్?

Thug Life : ప్రపంచవ్యాప్తంగా ఆడియన్స్ అంతా ఎంతగానో ఎదురు చూసిన సినిమా ఇండియన్ 2. ప్రేక్షకులు ముందుకు వచ్చిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్ గా మిగిలింది. కల్ట్ స్టేటస్ ఉన్న భారతీయుడు అనే సినిమాకి సీక్వెల్ గా తెరకెక్కిన సినిమా పైన అందరికీ మంచి అంచనాలు ఉండేవి. అప్పట్లో ఆ సినిమా ఎంతటి సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అన్ని యాస్పెక్ట్స్ లోనూ ఆ సినిమా అద్భుతంగా వర్కౌట్ అయింది. ఆ సినిమా కాన్సెప్ట్, ఆ సినిమాలోని ఎమోషన్స్, ఆ సినిమా మ్యూజిక్ అన్నీ కూడా భారతీయుడు సినిమా హిట్ అవ్వడానికి కీలకపాత్రను వహించాయి.


ఆడియన్స్ కి ఓపిక నశించింది 

భారతీయుడు 2 విషయానికి వస్తే ఈ సినిమాలో ఎమోషన్స్ అంతగా వర్కౌట్ కాలేదు. కొన్ని సీన్స్ ఎందుకు పెట్టారో కూడా అర్థం కాదు. వీటన్నిటిని మించి ఈ సినిమా లెంత్ దాదాపు మూడు గంటలకు పైగా ఉంటుంది. రీసెంట్ టైమ్స్ లో ఆడియన్స్ కు ఉన్న ఓపిక గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ మధ్యకాలంలో సినిమా ఏ మాత్రం ఆసక్తిగా లేకపోయినా కూడా జేబులో ఉన్న మొబైల్ తీసి చూసుకోవటం మొదలుపెట్టారు ఆడియన్స్. రంగస్థలం, అర్జున్ రెడ్డి వంటి సినిమాలను ప్రేక్షకులు మూడు గంటలు ఉన్నా కూడా ఆదరించారంటే దానికి కారణం దర్శకుడు అంత ఆసక్తికరంగా వాటిని మలిచాడు.


గో బ్యాక్ ఇండియన్ అంటే మళ్ళీ ఎందుకు వచ్చావు.?

ఇండియన్ 2 సినిమాలో కొన్ని పరిణామాలు జరుగుతున్నప్పుడు గో బ్యాక్ ఇండియన్ అనే నినాదాన్ని తీసుకొస్తారు కొంతమంది యూత్. అయితే ఇప్పుడు మళ్లీ అది చర్చలోకి వచ్చింది. దీనికి కారణం మనీరత్నం దర్శకత్వంలో కమల్ హాసన్ నటించిన థగ్ లైఫ్ సినిమాలో కమల్ హాసన్ గెటప్ అని చెప్పాలి. ఈ సినిమా ఫస్ట్ అఫ్ వరకు కమలహాసన్ గెటప్ బానే ఉంటుంది. సెకండ్ ఆఫ్ విషయానికి వస్తే నేపాల్ వెళ్లిన తర్వాత లాంగ్ హెయిర్ పెట్టి మళ్ళీ భారతీయుడు గెటప్ గుర్తు వచ్చేలా చేశారు. అందుకే ఈ సినిమాకు సంబంధించి గో బ్యాక్ ఇండియన్ అని చెప్పాము కదా మళ్లీ ఎందుకు వచ్చావు అంటూ థగ్ లైఫ్ సినిమాలోని కొన్ని ఫొటోస్ ను పెట్టి సోషల్ మీడియాలో ట్రోల్ చేయడం మొదలు పెడుతున్నారు. ఏదేమైనా తెలుగు ప్రేక్షకులు విపరీతంగా ఆదరించే మణిరత్నం, శంకర్ లాంటి దర్శకులు ఇలా చేస్తారని ఎవరు ఊహించలేదు.

Also Read : Atlee – Allu Arjun : నువ్వు తీసే ఆల్ మిక్సర్ సినిమాకి ఇంత ఎలివేషన్ ఎందుకు?

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×