Curd For Pigmentation: పిగ్మెంటేషన్ అనేది ఒక సాధారణ చర్మ సమస్య. ఇది తరచుగా సూర్యరశ్మి, హార్మోన్ల అసమతుల్యత, సరైన స్కిన్ కేర్ లేకపోవడం వల్ల వస్తుంది. ఈ సమస్యను ఎదుర్కోవడానికి పెరుగు ఒక సహజమైన, ప్రభావవంతమైన నివారణ.
పెరుగులో ఉండే లాక్టిక్ ఆమ్లం చర్మాన్ని ఎక్స్‌ఫోలియేట్ చేయడానికి , ప్రకాశవంతంగా మార్చడానికి సహాయపడుతుంది. అలాగే.. ఇది చిన్న చిన్న మచ్చలను కాంతివంతం చేయడంలో అంతే కాకుండా చర్మాన్ని లోతుగా పోషించడంలో ప్రభావవంతంగా పనిచేస్తుంది. ముఖంపై మొండి మచ్చలను తొలగించడానికి పెరుగును ఎలా ఉపయోగించాలో ఇప్పుడు తెలుసుకుందాం.
పెరుగు, తేనె మాస్క్:
ముందుగా 1 టీస్పూన్ తేనెను 2 టీస్పూన్ల పెరుగులో కలపండి. ఈ మిశ్రమాన్ని ముఖంపై సమానంగా అప్లై చేయండి. ఇప్పుడు 15-20 నిమిషాలు అలాగే ఉంచి.. ఆపై గోరువెచ్చని నీటితో కడగాలి.
తేనెలో ఉండే యాంటీఆక్సిడెంట్లు చర్మాన్ని తేమగా చేస్తాయి. పెరుగు మచ్చలను తొలగించడంలో సహాయపడుతుంది. అంతే కాకుండా ఈ మాస్క్ చర్మాన్ని ప్రకాశవంతంగా , మృదువుగా చేస్తుంది.
పెరుగు, శనగపిండి ప్యాక్:
ఈ ఫేస్ ప్యాక్‌ను ముఖానికి అప్లై చేయడానికి.. ముందుగా 1 టీస్పూన్ శనగ పిండిలో 2 టీస్పూన్ల పెరుగు కలపండి. దానికి చిటికెడు పసుపు వేసి మందపాటి పేస్ట్ లాగా చేయండి. దీనిని ముఖం మీద అప్లై చేసి 15 నిమిషాలు ఆరనివ్వండి. తర్వాత వాష్ చేయండి. ఈ ఫేస్ ప్యాక్ చర్మాన్ని లోతుగా శుభ్రపరుస్తుంది. అంతే కాకుండా చిన్న చిన్న మచ్చలను కూడా తొలగిస్తుంది. శనగ పిండి చర్మం రంగును సమానంగా చేస్తుంది. అంతే కాకుండా పసుపు చర్మానికి కొత్త మెరుపును తెస్తుంది.
పెరుగు, నిమ్మకాయ మిశ్రమం:
మచ్చలను తొలగించడానికి.. ముందుగా అర టీస్పూన్ నిమ్మరసంలో 2 టీస్పూన్ల పెరుగు కలపండి. మచ్చలు ఉన్న ప్రదేశంలో అప్లై చేయండి. ఇప్పుడు 10 నిమిషాల తర్వాత ముఖాన్ని శుభ్రం చేసుకోండి.
నిమ్మకాయలో విటమిన్ సి ఉంటుంది. ఇది చర్మం యొక్క రంగును మెరుగుపరచడంలో.. మచ్చలను తగ్గించడంలో సహాయ పడుతుంది. పెరుగు, నిమ్మరసంతో తయారు చేసిన ఈ మిశ్రమం చర్మాన్ని సహజంగా శుభ్రంగా, ప్రకాశ వంతంగా చేస్తుంది.
పెరుగు, పసుపుతో మొటిమలకు చెక్:
ముఖం మీద మొండి మచ్చలను తొలగించడానికి.. మీరు పెరుగు, పసుపుతో తయారుచేసిన మాస్క్‌ను అప్లై చేయవచ్చు. ఇది మచ్చలను తొలగించడమే కాకుండా.. కొన్ని రోజుల్లోనే మచ్చలను కూడా తొలగిస్తుంది. దీనిని ఉపయోగించడానికి.. మీరు 2 టీస్పూన్ల పెరుగులో 1 చిటికెడు పసుపు, 1 టీస్పూన్ తేనె కలపండి. దీని తరువాత తయారుచేసిన మిశ్రమాన్ని ముఖంపై అప్లై చేసి సుమారు 15 నిమిషాలు అలాగే ఉంచండి. దీని తరువాత మీ ముఖాన్ని సాధారణ నీటితో శుభ్రం చేసి ఆపై మాయిశ్చరైజర్‌ను అప్లై చేయండి.
Also Read: వర్షాకాలంలో చర్మాన్ని కాపాడుకోండిలా !
ఈ హోం రెమెడీస్ వాడటం వల్ల మంచి ఫలితం ఉంటుంది. ముఖం తెల్లగా మెరిసిపోవాలన్నా లేదా మంగు మచ్చలు కూడా తొలగిపోవాలన్నా పెరుగుతో తయారు చేసిన హోం రెమెడీస్ వాడటం మంచిది. ఇవి నల్ల మచ్చలను పూర్తిగా తొలగిస్తాయి. అంతే కాకుండా కాంతివంతంగా కూడా మారుస్తాయి.