BigTV English

Pimples Skincare Tips: వేసవిలో మొటిమల సమస్య.. క్లీన్ చర్మం కోసం ఈ చిట్కాలు పాటించండి

Pimples Skincare Tips: వేసవిలో మొటిమల సమస్య.. క్లీన్ చర్మం కోసం ఈ చిట్కాలు పాటించండి

Pimples Skincare Tips| వేసవి కాలంలో ఎండలు తీవ్రంగా ఉండడం వల్ల చాలా ఆరోగ్య సమస్యలు వస్తాయి. శరీరమంతా బాగా చెమటలు పట్టడంతో అందం కూడా ప్రభావితమవుతుంది. ఎండాకాలంలో వచ్చే సమస్యల్లో చాలా సాధారమైనది మొటిమల సమస్య. మొటిమలు ముఖంపైనే కాదు మెద, చేతులు, వీపు భాగంలో వరకూ వ్యాపిస్తాయి. ఈ మొటిమలు రావడానికి చాలా కారణాలున్నాయి. ముఖ్యంగా వాతావరణంలో వేడి ఎక్కువగా ఉండడం, చెమట, దుమ్ము, శరీరంలో ఆయిల్ ఉత్పత్తి ఎక్కువగా ఉండడం లాంటివి మొటిమలు రావడానికి కారణాలు. ఈ మొటిమలు రావడంతో చర్మంపై ఉన్న రంద్రాలు బ్లాక్ అవుతాయి. ఆ తరువాత క్రమంగా మొటిమలు తగ్గినా చర్మంపై చాలా కాలం పాటు మచ్చలు అలాగే ఉండిపోతాయి. ఈ మచ్చలు లేకుండా వేసవిలో కూడా క్లీన్ చర్మం ఉండాలంటే కొన్ని స్కిన్ కేర్ చిట్కాలు పాటించాలి.


మొటిమల నివారణకు పాటించాల్సిన చిట్కాలు ఇవే..

1. ముఖాన్ని ఎక్కువ సార్లు కడగం తప్పు..
వేసవిలో చల్లదనం కోసం చాలా మంది ముఖాన్ని తరుచూ కడుగుతూనే ఉంటారు. ఇలా ఒక రోజులో ఎక్కువ సార్లు ఫేస్ వాష్ చేయడం వల్ల ముఖ చర్మంపై సాధారణంగా ఉత్పత్తి అయ్యే ధ్రవాలు తొలగిపోతాయి. దీంతో చర్మం మరింత ధ్రవం ఉత్పత్తి చేస్తుంది. రోజుకు రెండు సార్లు మాత్రమే మైల్డ్ ఫేస్ వాష్ చేస్తే సరిపోతుంది.

2.జెల్ లేదా మాస్చరైజర్ ఉత్పత్తులు ఉపయోగించండి
చాలా మంది ముఖం అందంగా ఉండడానికి ఫేస్ క్రీమ్స్ ఉపయోగిస్తుంటారు. అయితే వేసవి కాలంలో హేవీగా ఉండే ఫేస్ క్రీమ్స్, ఆయిలీ ప్రాడక్ట్స్ చర్మాన్ని బ్లాక్ చేస్తాయి. వీటికి బదులు అలోవేరా జెల్ లేదా వాటర్ మాస్చరైజర్లతో ఫేస్ వాష్ చేసుకోండి. దీని వల్ల ముఖ చర్మం లైట్ గా, ఫ్రెష్ గా ఉంటుంది.


3.సన్ స్రీన్ క్రీమ్స్ తో జాగ్రత్త
వేసవి కాలంలో సన్ స్క్రీన్ క్రీమ్స్ ఉపయోగించడం చాలా అవసరం. అయితే ఈ సన్ స్క్రీన్ క్రీమ్స్ చర్మానికి హాని కూడా కలిగిస్తాయి. పైగా చర్మం నల్లబడేట్లు చేస్తాయి. దీని వల్ల చర్మంపై మొటిమలు, మచ్చలు వచ్చే అవకాశముంది. అందుకే నాన్ కొమెడోజెనిక్ సన్ స్క్రీన్, ఎస్ పిఎఫ్ 30 లేదా అంతకంటే ఎక్కువ ఉండే సన్ స్క్రీన్ క్రీమ్స్ మాత్రమే ఉపయోగించాలి. ఎండాకాలంలోనే కాదు ఎల్లప్పుడూ ఇవే ఉపయోగించాలి.

4. తక్కువగా మేకప్ చేసుకోండి, సమయానికి తొలగించండి
కొందరు ముఖంపై హెవీ మేకప్ చేసుకుంటూ ఉంటారు. ఇది వారికి అలవాటుగా మారుతుంది. కానీ వేసవిలో మాత్రం లైట్ మేకప్ మాత్రమే వేసుకోవాలి. హెవీ మేకప్ వల్ల చర్మ రంద్రాలు (skin pores) మూసుకుపోతాయి. దాని వల్ల చర్మానికి ఆక్సిజన సరిగా అందక ఆ ప్రదేశం నల్లబడి పోవడం లాంటివి జరుగుతుంది. అందుకే అవసరమైతేనే మేకప్ వేసుకోవాలి. అది కూడా వేసవిలో అయితే లైట్ గా వేసుకోవాలి. సాయంత్రం లేదా రాత్రి నిద్రపోయేముందు ఆ మేకప్ ని మంచి క్లీన్సర్ తో తొలగించాలి. మేకప్ తొలగించడానికి మైల్డ్ క్లీన్సర్ ఉపయోగించండి. దీని వల్ల వేసవిలోనూ చర్మానికి హాయిగా ఉంటుంది. ఫలితంగా చర్మం ఆరోగ్యంగా కూడా ఉంటుంది.

Also Read: ఎయిర్‌పోర్ట్ సమీపంలో నివసిస్తున్నారా?.. ఆయువు తగ్గిపోతుంది జాగ్రత్త

5. ముఖాన్ని చేతులతో తడుముతూ ఉండొద్దు
వేసవిలో అందరికీ చెమట బాగా పోస్తుంది. ముఖంపై నుంచి చెమట తొలగించడానికి చాలా మంది చేతులు ఉపయోగిస్తారు. పని చేస్తుండడంతో చేతులపై సాధారణంగా బ్యాక్టీరియా చేరిఉంటుంది. చేతులతో ముఖంపై చెమటను తుడుచుకునే సమయంలో ఆ బ్యాక్టీరియా ముఖానికి వ్యాపిస్తుంది. దీని వల్ల మొటిమలు వస్తాయి. అందుకే శుభ్రత పాటించండి. ముఖంపై చెమటను తొలగించడానికి చేతులు ఉపయోగించకండి. వీలైతే క్లీన్ కర్చీఫ్ లేదా ఫేస్ టిష్యూస్ ఉపయోగించండి.

6. ఫ్రూట్స్ బాగా తినాలి

వేసవిలో కూరగాయలు, పండ్లు బాగా తినాలి. ముఖ్యంగా విటమిన్ సి, యాంటి ఆక్సిడెంట్స్ ఉన్నవి తీసుకోవాలి. పపయా, స్ట్రాబెర్రీస్, టమోటాలు వంటివి తీసుకోవాలి. ఇందులోని పోషకతత్వాలు ముఖ చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి.

ఈ చిట్కాలు పాటించడం ద్వారా వేసవిలో మొటమలు రాకుండా నివారించవచ్చు. ఫలితంగా చర్మం మచ్చలు లేకుండా ఆరోగ్యంగా మెరిసిపోతూ ఉంటుంది.

Related News

Ajwain Water Benefits: వాము నీరు తాగితే.. ఈ ఆరోగ్య సమస్యలు పరార్ !

Fact Check: నవ్వితే కళ్ల నుంచి నీరు వస్తుందా? అయితే కారణం ఇదీ?

Skin Whitening Tips: ఛాలెంజ్, ఈ టిప్స్ పాటిస్తే.. 7 రోజుల్లోనే నిగనిగలాడే చర్మం

Steel Pans: స్టీల్ పాత్రల్లో.. వీటిని పొరపాటున కూడా వండకూడదు !

Oral Health: వర్షాకాలంలో తరచూ వచ్చే గొంతు నొప్పికి.. ఈ టిప్స్‌తో చెక్ !

Diabetic Patients: షుగర్ పేషెంట్లు ఎలాంటి ఫుడ్ తినాలో తెలుసా ?

Big Stories

×