BigTV English

Single Movie : ఎవరెవరిని ఇమిటేట్ చేశాడో గమనించారా.?

Single Movie : ఎవరెవరిని ఇమిటేట్ చేశాడో గమనించారా.?

Single Movie : తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఎటువంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఎంట్రీ ఇచ్చి తమ ప్రతిభతో మంచి గుర్తింపును సాధించుకొని ప్రూవ్ చేసుకున్న వాళ్లు చాలామంది ఉన్నారు. ఇండస్ట్రీలో చాలామంది మెగాస్టార్ చిరంజీవిని ఇన్స్పిరేషన్ గా తీసుకుంటారు. అలానే రవితేజ,నాని కూడా ఎటువంటి బ్యాగ్రౌండ్ లేకుండా తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి సక్సెస్ ఫుల్ గా తమ జర్నీని కొనసాగిస్తున్నారు. వెబ్ డిజైనర్ గా కెరియర్ మొదలుపెట్టి బాణం సినిమాతో నటుడుగా ఎంట్రీ ఇచ్చాడు శ్రీ విష్ణు. ఆ తర్వాత నారా రోహిత్ నటించిన సోలో సినిమాలో ఒక కీలక పాత్రలో కనిపించాడు. సన్ ఆఫ్ సత్యమూర్తి సినిమాలో కూడా మంచి రోల్ లో కనిపించాడు. వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహించిన మెంటల్ మదిలో సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు.


మంచి కాన్సెప్ట్ సినిమాలు

శ్రీ విష్ణు కెరియర్ లో మెంటల్ మదిలో, బ్రోచేవారెవరురా, రాజరాజ చోర వంటి ఎన్నో అద్భుతమైన సినిమాలు ఉన్నాయి. అయితే ఒక సందర్భంలో శ్రీ విష్ణు కెరియర్ లో కూడా వరుసగా డిజాస్టర్ సినిమాలు వచ్చాయి. అప్పుడు మళ్లీ సామజవరగమన సినిమాతో మంచి సక్సెస్ అందుకున్నాడు. ఆ తర్వాత చేసిన ఓం భీమ్ బుష్, స్వాగ్ సినిమాలు ఊహించిన సక్సెస్ ను అందించలేకపోయాయి. ఇక ప్రస్తుతం శ్రీ విష్ణు కార్తీక్ రాజు దర్శకత్వంలో సింగిల్ అనే ఒక సినిమాను చేస్తున్నాడు. ఈ సినిమా మే 9న విడుదల కానుంది. ఈ సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థ గీత ఆర్ట్స్ నిర్మించింది.


చాలామందిని ఇమిటేట్ చేశాడు

శ్రీ విష్ణు టాలెంట్ గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు చాలామంది కరోనా టైంలో శ్రీ విష్ణు సినిమాలు చూసి, సెన్సార్ కు దొరక్కుండా మేనేజ్ చేసిన బూతులను కనిపెట్టారు. ఇప్పటికీ శ్రీ విష్ణు సినిమాల్లో చాలా బూతులు వినిపిస్తూ ఉంటాయి. కానీ అవి బూతులు అనిపించవు. అదే మ్యాజిక్. ఇక ప్రస్తుతం చేస్తున్న సింగిల్ సినిమా విషయానికి వస్తే చాలామందిని ఇమిటేట్ చేశారు. అయితే దీనిలో శివయ్య, మంచు కురిసిపోవడం లాంటివి కాకుండా బాలకృష్ణ స్పీచ్, అల్లు అరవింద్ డాన్స్, దిల్ రాజు డాన్స్ ఇవన్నీ కూడా ఇమిటేట్ చేశాడు శ్రీ విష్ణు. ఫ్యామిలీ స్టార్ సినిమా టైంలో దిల్ రాజు చాలామంది మీడియా వాళ్లతో కలిసి డాన్స్ చేశారు ఆ తరుణంలో ఆ వీడియో బాగా వైరల్ అయింది దానిని కూడా రీ క్రియేట్ చేశాడు శ్రీ విష్ణు. అలానే సాయి పల్లవి అల్లు అరవింద్ కలిసి చేసిన డాన్స్ వీడియోను కూడా రీ క్రియేట్ చేశాడు. మరొకసారి ఆ ట్రైలర్ చూస్తే ఇవన్నీ అర్థమయ్యే అవకాశం ఉంది.

Also Read : Gopichandh Malineni: మేకప్ రూమ్‌కి పిలిచి చిరంజీవిగారు క్లాస్ పీకారు

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×