Big Stories

Gas Price : గ్యాస్‌ సిలిండర్‌ ధర ఎంత తగ్గిందో తెలుసా? ..వినియోగదారులకు శుభవార్త

Gas Price : గ్యాస్ సిలిండర్ల ధరను చమురు సంస్థలు మరోసారి తగ్గించాయి. అయితే వాణిజ్య గ్యాస్ సిలిండర్లకు మాత్రమే ఈ నిర్ణయం వర్తిస్తుంది. 19 కేజీల ఎల్పీజీ సిలిండర్‌ ధరను రూ. 115.50 తగ్గిస్తున్నట్లు చమురు సంస్థలు ప్రకటించాయి. తగ్గించిన ధరలు తక్షణమే అమల్లోకి వస్తాయని వెల్లడించాయి. దీంతో
ఢిల్లీలో కమర్షియల్‌ గ్యాస్‌ సిలిండర్‌ ధర రూ.1,744కు చేరుకుంది. ముంబైలో వాణిజ్య సిలిండర్ ధర రూ. 1,696గా ఉంది. అయితే 14.2 కేజీల గృహ వినియోగ సిలిండర్‌ ధరల్లో మాత్రం చమురు సంస్థలు ఎలాంటి మార్పు చేయలేదు. జూలై నుంచి 14.2 కేజీల గ్యాస్ సిలిండర్ రేటు నిలకడగా ఉంది. అయితే కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర మాత్రం తగ్గుతూ వస్తోంది. ఒక దశలో రూ. 2 వేల మార్కును కమర్షియల్ సిలిండర్ల ధర తాకింది. ఆ తర్వాత వీటి ధరలను క్రమంగా తగ్గిస్తున్నాయని చమురు సంస్థలు. వాణిజ్య సిలిండర్ ధర తగ్గింపుతో హోటళ్లు, ఫాస్ట్ ఫుడ్ వ్యాపారులకు లబ్ధి చేకూరుతుంది.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News