Manchu Vishnu : రెండు మూడు రోజులుగా మంచు ఫ్యామిలీలో జరుగుతున్న గొడవలపై ఎవరికివారు చర్చించుకుంటున్నారు. ఈ క్రమంలోనే కొద్దిసేపటి క్రితం మీడియా ముందుకు వచ్చిన మంచు మనోజ్ (Manchu Manoj)సాయంత్రం 5:00 గంటలకు ప్రెస్ మీట్ పెట్టి అన్ని సాక్ష్యాలను బయటపెడతానని తెలియజేశారు. ఇకపోతే నిన్న జరిగిన సంఘర్షణలో మోహన్ బాబు(Mohan Babu) బీపీ డౌన్ కావడంతో స్పృహ తప్పి పడిపోయారు. ఇక తన తండ్రిని తీసుకొని కాంటినెంటల్ హాస్పిటల్ కి వెళ్లారు మంచు విష్ణు(Manchu Vishnu). ఇక ఇప్పుడు కాంటినెంటల్ హాస్పిటల్ నుండి మీడియాతో మాట్లాడారు. అందులో భాగంగానే జర్నలిస్ట్ కు జరిగిన గాయం పై రెస్పాండ్ అవుతూ.. అసలు ఏం జరిగింది ?అనే విషయాన్ని తెలియజేశారు.
మీడియా ముందుకు వచ్చిన మంచు విష్ణు..
మంచు విష్ణు మీడియాకు నమస్కారం పెడుతూ ముందుకు వచ్చాడు.. ఇక మాట్లాడుతూ.. ” ‘కన్నప్ప’ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ పనులలో లాస్ ఏంజిల్స్ లో నేను బిజీగా ఉన్నాను. అయితే అప్పుడే నాకు ఇంట్లో గొడవలు జరుగుతున్నాయి అంటూ ఫోన్ కాల్ వచ్చింది. నాకు ఫ్యామిలీ ముఖ్యం కాబట్టి అన్నింటినీ వదులుకొని వచ్చేసాను. ఇక నిన్న జరిగిన ఘటనలో ఒక టీవీ రిపోర్టర్ కు గాయాలు తగలడం, అత్యంత బాధాకరంగా అనిపించింది. అయితే ఇది కావాలని చేసింది కాదు. మనోజ్ గేట్స్ పగలగొట్టుకొని ముందుకు రావడంతోనే నాన్నగారు కోపంతో అనుకోకుండా అలా రియాక్ట్ అయ్యారు. ఆ సమయంలోనే మీడియా మిత్రులపై దాడి చేయడం జరిగింది. కలిసిమెలిసి ఉంటామని అనుకున్నాము. కానీ ఇలా జరిగిపోయింది. మీడియా కూడా లిమిట్స్ క్రాస్ చేస్తోంది. మేము పబ్లిక్ ఫిగర్స్, మా న్యూస్ మీరు పబ్లిక్ లోకి తీసుకెళ్లాలి. కానీ కొంతమంది అ లిమిట్స్ ను క్రాస్ అవుతున్నారు.
రిపోర్టర్ కుటుంబానికి అండగా మంచు విష్ణు..
ఇకపోతే ఆ రిపోర్టర్ కుటుంబంతో మేము మాట్లాడాము. అన్ని విధాలుగా చూసుకుంటామని , అండగా ఉంటామని కూడా చెప్పాము. ప్రస్తుతం వారి కుటుంబంతో రెగ్యులర్ గా టచ్ లో ఉన్నాము. నేనే వారితో స్వయంగా మాట్లాడాను అంటూ జర్నలిస్ట్ పై జరిగిన దాడిలో మంచు విష్ణు రియాక్ట్ అవుతూ ఇలా కామెంట్లు చేశారు.
జర్నలిస్టుపై మోహన్ బాబు దాడి..
నిన్న రాత్రి సమయంలో మంచు మనోజ్ గేట్లు బద్దలు కట్టుకొని లోపలికి వెళ్లిపోయారు. ఆ సమయంలో మోహన్ బాబు ఫైర్ అవుతూ రియాక్ట్ అవ్వడం జరిగింది. అదే సమయంలో అక్కడున్న మీడియా మిత్రులు లోపలికి వెళ్లే ప్రయత్నం చేయగా.. ఆక్రోశం తో ఊగిపోయిన మోహన్ బాబు మీడియా మిత్రుడు బుర్రలు పగలగొట్టారు. ఇక ఆ సమయంలో ముక్కు – చెవికి మధ్య అనుసంధానమైన ఎముక ఏకంగా మూడు చోట్ల ఫ్రాక్చర్ అయింది. దీంతో మీడియా సంఘాలు మండిపడుతూ మోహన్ బాబుపై కేసు ఫైల్ చేయాలని డిమాండ్ చేయగా.. బాధితులు కూడా తమకు మోహన్ బాబు నుంచి ప్రాణహాని ఉందని పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు .ప్రస్తుతం మోహన్ బాబు పై 118 బీఎన్ఎస్ సెక్షన్ కింద పోలీసులు కేసు నమోదు చేయడం జరిగింది.