BigTV English

Director Chidambaram: మంజుమ్మల్ బాయ్స్ డైరెక్టర్ చిదంబరం బాలీవుడ్ ఎంట్రీ.. అక్కడ ఎలాంటి సినిమా అందిస్తాడో..!

Director Chidambaram: మంజుమ్మల్ బాయ్స్ డైరెక్టర్ చిదంబరం బాలీవుడ్ ఎంట్రీ.. అక్కడ ఎలాంటి సినిమా అందిస్తాడో..!

Manjummel Boys Director Chidambaram next movie: థ్రిల్లర్ సినిమాలను అందించడంలో మలయాళ సినీ పరిశ్రమను మించినవారు మరొకరు ఉండరు. అందులో ఎలాంటి సందేహం లేదు. మాలయాళ సినీ ఇండస్ట్రీ నుంచి సస్పెన్స్ అండ్ థ్రిల్లర్ జోనర్‌లో ఒక సినిమా వస్తుందంటే.. తెలుగు ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. అలాంటిదే ఇటీవల రిలీజ్ అయిన ‘మంజుమ్మల్ బాయ్స్’ ఒకటి. ఈ ఏడాది అతి తక్కువ బడ్జెట్‌తో అత్యధిక వసూళ్లు రాబట్టిన మూవీల్లో ఈ సినిమా ఒకటి. ఈ సర్వైకల్ థ్రిల్లర్ ఒక చిన్న సినిమాగా వచ్చి ఎవరి ఊహలకు అందని రీతిలో దుమ్ము దులిపేసింది.


దర్శకుడు చిదంబరం తెరకెక్కించిన ఈ సినిమా అందరి అంచనాలను తలకిందులు చేసింది. విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకుంది. కేవలం రూ.20 కోట్లతో తెరకెక్కిన ఈ సినిమా ఏకంగా బాక్సాఫీసు వద్ద రూ.200 కోట్ల వసూళ్లు రాబట్టి అదరగొట్టేసింది. అత్యధిక వసూళ్లు సాధించడమే కాకుండా ఎన్నో రికార్డులను సైతం క్రియేట్ చేసింది. ఆ మధ్య ఎక్కడ చూసినా ఈ సినిమానే.. ఎక్కడ విన్నా ఈ సినిమా వీడియోలే. ఇలాంటి ఒక చిత్రాన్ని అందించిన దర్శకుడు చిదంబరం పై సినీ ప్రేక్షకులు, అభిమానులు ప్రశంసలు కురిపించారు.

Also Read: ‘ఇతడెవరు..’ అంటున్న విజయ్ ఆంటోని.. షేక్ చేస్తున్న‘తుఫాన్’ లిరికల్ సాంగ్


ఈ చిత్రంతో మలయాళ ఇండస్ట్రీ మరో స్థాయికి వెళ్లిందనే చెప్పాలి. ముఖ్యంగా ఈ సినిమా హైలైట్స్‌లో దర్శకుడు ఆలోచనా విధానం ఒకటి అయితే.. సినిమాటోగ్రఫీ, మ్యూజిక్, ఎడిటింగ్ వంటివి సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లాయి. గుణ కేవ్స్, కొడైకెనాల్ పరిసర ప్రాంతాలు చూపించడంలో సినిమాటోగ్రాఫర్ తన ప్రతిభను కనబరిచాడు. మరి ఇలాంటి ఒక బ్లాక్ బస్టర్ సినిమాను మలయాళ ఇండస్ట్రీకి అందించి ఎంతో గుర్తింపు సంపాదించుకున్న దర్శకుడు చిదంబరం.. ఈ సారి నార్త్‌లో భారీ ఆఫర్ కొట్టేసినట్లు తెలుస్తోంది.

దర్శకుడు చిదంబరం ఇప్పుడు బాలీవుడ్ ఎంట్రీకి రెడీ అయ్యాడు. ప్రముఖ నిర్మాణ సంస్థ ఫాటమ్ స్టూడియోస్‌తో కలిసి ఒక కొత్త సినిమాను పట్టాలెక్కించేందుకు సిద్ధమయ్యాడు. ఈ విషయాన్ని తాజాగా ఫాంటమ్ స్టూడియోస్ సోషల్ మీడియా ద్వారా తెలిపింది. టాలెంటెడ్ అండ్ విజనరీ డైరెక్టర్ చిదంబరాన్ని బాలీవుడ్‌లోకి పరిచయం చేస్తుండటం చాలా ఆనందంగా ఉందని ఓ పోస్టర్ రిలీజ్ చేశారు. మంజుమ్మల్ బాయ్స్ సినిమాతో ఎన్నో రికార్డులు బద్దలు కొట్టిన చిదంబరం‌తో కలిసి తాము మ్యాజిక్ చేసేందుకు ఎగ్జైటింగ్‌గా ఉన్నట్లు నిర్మాణ సంస్థ తెలిపింది. మరి బాలీవుడ్ ఇండస్ట్రీకి దర్శకుడు చిదంబరం ఎలాంటి సినిమాను అందిస్తాడో చూడాలి.

Tags

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×