BigTV English

Manmadha: 20 ఏళ్ల తర్వాత రీ రిలీజ్ కి సిద్ధం.. ఎప్పుడంటే..?

Manmadha: 20 ఏళ్ల తర్వాత రీ రిలీజ్ కి సిద్ధం.. ఎప్పుడంటే..?
Advertisement

Manmadha.. కోలీవుడ్ లో 2004లో జ్యోతిక(Jyothika )- శింబు(Simbu ) జంటగా నటించిన చిత్రం మన్మధన్. ఈ సినిమాని తెలుగులో మన్మధ పేరుతో రిలీజ్ చేశారు. తెలుగు, తమిళ్ భాషల్లో ఈ సినిమా భారీ విజయం అందుకుంది ..ఇప్పుడైతే అందరూ బేబీ , ఆర్ఎక్స్ 100 సినిమాల గురించి మాట్లాడుకుంటున్నారు కానీ ఒకప్పుడు ఇదే పాయింట్తో ఇంతకు మించి కథాంశం తో 20 ఏళ్ల క్రితమే ఈ సినిమా వచ్చి సంచలనం సృష్టించింది. ఇప్పటికీ కూడా ఈ సినిమా పాటలు ఎవర్ గ్రీన్ గా నిలిచాయి. ముఖ్యంగా సినిమానే కాదు సాంగ్స్ కూడా సూపర్ హిట్ అని చెప్పవచ్చు.


20 ఏళ్ల తర్వాత రీ రిలీజ్ కి సిద్ధం..

ఇకపోతే ఈమధ్య కాలంలో రీ రిలీజ్ సందడి ఎక్కువగా కొనసాగుతున్న నేపథ్యంలో చాలా సినిమాలు ఇప్పటికే రిలీజ్ అయ్యి ఆడియన్స్ కు మంచి వినోదాన్ని పంచడమే కాకుండా నిర్మాతలు కూడా క్యాష్ చేసుకుంటున్నారు. ఇలాంటి బ్లాక్ బస్టర్ మూవీ ని దాదాపు 20 ఏళ్ల తర్వాత మళ్లీ తెలుగులో విడుదల కాబోతోంది. అక్టోబర్ 5వ తేదీన మన్మధ సినిమాను రీ రిలీజ్ చేయడానికి చిత్ర బృందం సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. ఈ సినిమాని తెలుగులో అజిత్ కుమార్ సింగ్ , వేమూరి శ్రేయాస్ , సుధా రాచకొండ,రమణ విడుదల చేయబోతున్నారట. భారీ అంచనాల మధ్య ఈ సినిమా ఇప్పుడు మళ్లీ విడుదలకు సిద్ధం కాబోతోంది. ఇకపోతే ఇక్కడ మరో విశేషం ఏమిటంటే ఈ సినిమాకి కథ ,స్క్రీన్ ప్లే రెండూ కూడా శింబునే అందించారు ఈ సినిమాలో హీరో కూడా ఈయనే.


శింబు క్రేజ్ అలాంటిది మరి..

ఈ సినిమాలో సింధు తులాని , యానగుప్త, అతుల్ కులకర్ణి , మందిరా బేడి, అర్జు గోవిత్రిక తదితరులు కీలకపాత్రలు పోషించగా, ఎస్.జే.మురుగన్ దర్శకత్వంలో ఈ సినిమాను తెరకెక్కించారు. దీనికి తోడు ఈ సినిమాలో శింబు ద్విపాత్రాభినయం చేశారు. నిజానికి ఈ మధ్యకాలంలో తెలుగులో మంచి పాపులారిటీ సంపాదించుకున్న తమిళ్ హీరోలు అంటే వెంటనే సూర్య, కార్తీ, విజయ్ పేర్లు చెప్పుకుంటున్నారు కానీ వీళ్ళందరి కంటే ముందు టాలీవుడ్ లో అత్యధికంగా పేరు సంపాదించుకున్న హీరో శింబు.. ఈయన అంటే చాలామందికి ఎనలేని అభిమానం. ఒకరకంగా చెప్పాలి అంటే మన్మధ సినిమాతోనే ఈయన టాలీవుడ్ లో మంచి పాపులారిటీ కూడా సొంతం చేసుకున్నారు. అప్పట్లోనే ఇంత పాపులారిటీ సంపాదించి పెట్టిన ఈ సినిమా ఇప్పుడు మళ్లీ రీ రిలీజ్ కి సిద్ధమవుతున్న నేపథ్యంలో శింబు ఫాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారని చెప్పాలి. ప్రస్తుతం ఈ సినిమా రీ రిలీజ్ కి సిద్ధమవుతోంది అంటూ వార్తలు వస్తున్నాయి కానీ చిత్ర బృందం నుంచి అధికారిక ప్రకటన వెలువడలేదు. త్వరలోనే ఈ ప్రకటన వెలువడే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. ఇక జ్యోతిక విషయానికి వస్తే..అటు కోలీవుడ్ ఇటు టాలీవుడ్ లో కూడా మంచి పేరు తెచ్చుకున్న ఈమె కోలీవుడ్ స్టార్ హీరో సూర్య ను వివాహం చేసుకున్న తర్వాత లేడీ ఓరియంటెడ్ కథలతో మాత్రమే ప్రేక్షకులను అలరిస్తోంది.
.

Related News

Influencer Bhavani Ram : కన్నీళ్లు తెప్పిస్తున్న ఇన్‌ఫ్లుయెన్సర్ భవాని స్టోరీ… అప్పుడు ట్రోల్ చేశారు.. ఇప్పుడు సంపాదన ఎంతంటే?

Lazawal Ishq Show: పాక్‌‌లో డేటింగ్ రియాల్టీ షో.. వెంటనే ఆపాలంటూ గోలగోల, ఎందుకంటే?

Venu Swamy: శత్రువుల నాశనం కోసం వేణు స్వామి పూజలు…నీటిపై తేలియాడుతూ అలా!

Bigg Boss 9 Wildcard Entry: 6 గురు వైల్డ్ కార్డ్ ఎంట్రీస్… యాడ దొరికిన సంతరా ఇది.. అంతా స్క్రాపే

PVRInox : తింటూ సినిమా చూసే ఎక్స్పీరియన్స్, ఏంట్రా బాబు ఆ సౌండ్స్ ను ఎలా భరించాలి

Durga Rao: టిక్ టాక్ దుర్గారావు ఇంట్లో విషాదం.. సమాధి దగ్గరే.. కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం!

Rakesh Poojary: ‘కాంతారా-1’లో కడుపుబ్బా నవ్వించిన.. ఈ నటుడు ఎలా చనిపోయాడో తెలుసా? కన్నీళ్లు ఆగవు!

Janu lyri- Deelip Devagan: జాను లిరితో బ్రేకప్.. దిలీప్ రియాక్షన్ ఇదే.. సెలబ్రిటీలం కాబట్టే అంటూ!

Big Stories

×