Manchu Manoj: మంచు మనోజ్(Manchu Manoj) ప్రస్తుతం భైరవం,(Bhairavam) సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో ఎంతో బిజీగా ఉన్నారు. ఈ కార్యక్రమాలలో భాగంగా ఆయన సినిమా విషయాలతో పాటు తన వ్యక్తిగత విషయాల గురించి కూడా అభిమానులతో పంచుకుంటున్నారు. మంచు మనోజ్ వ్యక్తిగత జీవితం గురించి అందరికీ తెలిసిందే. మొదట ఈయన ప్రణతి అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నారు. పెద్దలు కుదిర్చిన ఈ వివాహ బంధం ఎక్కువ కాలం నిలబడలేదు. తన మొదటి భార్యకు విడాకులు ఇచ్చిన మనోజ్ అనంతరం భూమా మౌనిక(Bhuma Mounika) ప్రేమలో పడ్డారు. ఇక వీరి ప్రేమ విషయం బయటపడటంతో వీరిద్దరి గురించి ఎన్నో రకాల వార్తలు బయటకు వచ్చాయి.
ఇలా వీరి గురించి, వార్తలు వస్తున్న నేపథ్యంలో వీరిద్దరూ తమ పెళ్లి గురించి ప్రకటన చేసి అందరిని ఆశ్చర్యానికి గురి చేశారు. ఇక మనోజ్ మౌనికల వివాహం అతి కొద్ది మంది సమక్షంలో మంచు లక్ష్మి ఇంట్లో జరిగింది. అయితే ఈ వివాహం మంచు విష్ణు మోహన్ బాబుకు ఏ మాత్రం ఇష్టం లేదని పెళ్లిలో కూడా వీరు అయిష్టంగానే కనిపించిన సంగతి తెలిసిందే. ఇలా మౌనికతో వివాహమైన తర్వాత మంచి విష్ణు తన అనుచరులతో మనోజ్ ఇంటి ముందు హల్చల్ చేశారు. దీంతో మనోజ్ తన భార్యతో కలిసి చెన్నై వెళ్ళిపోయారు.
యోగక్షేమాలు అడిగారు…
ఇలా చెన్నై వెళ్లిన తర్వాత దిక్కులేని వాడిగా బ్రతికాను అంటు తాజాగా ఒక ఇంటర్వ్యూ సందర్భంగా కన్నీళ్లు పెట్టుకున్నారు. ఇలా చెన్నైలో తన భార్యతో కలిసి బ్రతుకుతున్న నాకు పవన్ కళ్యాణ్(Pawan Kalyan) పెద్దన్నయ్య లాగా అండగా నిలిచార అంటూ ఈయన గురించి ఆసక్తికరమైన విషయాలను బయటపెట్టారు. ఓసారి తాను పవన్ కళ్యాణ్ ని కలిసినప్పుడు తనని భీమ్లా నాయక్ షూటింగ్ లొకేషన్లో కలవమని చెప్పారు. అక్కడికి వెళ్లి పవన్ అన్నయ్యను కలవడంతో ఆయన నాకు క్షేమం గురించి ఆరా తీసారు. పవన్ కళ్యాణ్ అన్నయ్యను నేను కలవడంతో అసలు ఎక్కడుంటున్నావ్? ఏం చేస్తున్నావ్? అంటూ ప్రశ్నించారు. ఇలా చెన్నైలో ఉంటున్నానని చెప్పడంతో హైదరాబాద్లో ఏమైంది? అని అడిగారు. హైదరాబాదులో కాస్త ఇబ్బందిగా ఉండటంతో చెన్నైలో ఉంటున్నానని తెలిపారు.
కెరియర్ గురించి క్లాస్ పీకారు…
మనసులో ఏది పెట్టుకోకుండా నీకేదైనా అవసరం వచ్చినప్పుడు తప్పకుండా నన్ను కలువు, చెన్నై వచ్చినప్పుడు కూడా నేను మీ ఇంటికి వస్తాననీ నాకు మౌనికకు అండగా నిలిచిన మొదటి వ్యక్తి పవన్ కళ్యాణ్ అని మనోజ్ ఎమోషనల్ అయ్యారు. ఇక నా కెరియర్ గురించి కూడా కొన్ని సూచనలు చేశారు ముందు బరువు తగ్గు హీరో అని కాకుండా ఎలాంటి క్యారెక్టర్ అయినా చేసే టాలెంట్ నీలో ఉంది. ఆ దిశగా ప్రయత్నాలు చెయ్యి అంటూ నాకు భరోసా కూడా కల్పించింది కూడా పవన్ కళ్యాణ్ గారు అంటూ మనోజ్ ఈ సందర్భంగా పవన్ గురించి చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.