BigTV English

Trisha : మన్సూర్ వ్యాఖ్యలపై త్రిష అనూహ్య స్పందన..

Trisha : మన్సూర్ వ్యాఖ్యలపై త్రిష అనూహ్య స్పందన..
Trisha

Trisha : సినీ ఇండస్ట్రీలో పనిచేసే నటీ నటుల మధ్య ఒక స్నేహపూరితమైన వాతావరణం ఎప్పుడూ ఉంటుంది. అయితే కొన్ని సందర్భాలలో కొందరికి మాటల కారణంగా లేనిపోని వివాదాలు తలెత్తుతాయి. మన్సూర్ అలీ ఖాన్ త్రిషపై చేసిన వ్యాఖ్యలు ఇదే రకంగా పెద్ద దుమారానికి దారితీసాయి. తోటి నటుల పట్ల.. ముఖ్యంగా స్త్రీల పట్ల గౌరవం లేకుండా మాట్లాడిన అతని మాటలపై సినీ ఇండస్ట్రీ మొత్తం ధ్వజమెత్తింది. అందరూ అతని ప్రవర్తనను తప్పు పట్టినా..మన్సూర్‌ మాత్రం క్షమాపణ చెప్పేదే లేదు అని భీష్ముంచుకొని కూర్చున్నాడు.


లియో షూటింగ్ సందర్భంగా త్రిషతో ఒక్క రేప్ సీన్ అయినా ఉంటుందని అనుకున్నాను లేకపోవడం చాలా బాధాకరంగా ఉంది అంటూ అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేశాడ మన్సూర్. అతను చేసిన వ్యాఖ్యలను సినీ సెలబ్రిటీలతో పాటు రాజకీయ ప్రముఖులు కూడా తీవ్రంగా ఖండించారు. అయితే వివాదం మరీ పెద్దది కావడం.. తట్టుకోలేని ఒత్తిడి.. సినీ ఇండస్ట్రీ నుంచి తీవ్ర విమర్శలు.. ఎట్టకేలకు అతని దిగివచ్చేలా చేశాయి. త్రిష కు క్షమాపణ చెప్పకపోతే..దక్షిణ భారత నటీనటుల సంఘం నుంచి మన్సూర్ పేరు రద్దు చేస్తామని ఆ సంఘం సభ్యులు హెచ్చరించారు.

మొదట్లో ఏ మాత్రం వెనక్కి తగ్గకుండా త్రిషకు క్షమాపణ చెప్పే ప్రసక్తే లేదని ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పిన మన్సూర్.. ఫైనల్ గా క్షమాపణ చెబుతూ ప్రకటన కూడా విడుదల చేశాడు.‘నా సహ నటి త్రిష, దయచేసి నన్ను క్షమించండి!’ మన్సూర్ అలీఖాన్ క్షమాపణలకు త్రిష స్పందిస్తూ.. తప్పు చేయడం మానవ సహజం.. క్షమించడం మానవత్వం అంటూ పేర్కొంది. ఇలా మొత్తానికి ఈ వివాదానికి తెరపడింది.


ఇదిలా ఉండగా ఇప్పటికే త్రిష పై మన్సూర్ అలీఖాన్‌ చేసిన వ్యాఖ్యలపై పలుచోట్ల పోలీస్ స్టేషన్లో అతనిపై కేసులు నమోదయ్యాయి. కొన్ని కేసుల విచారణ కోసం అతను పోలీసుల ఎదుట కూడా హాజరయ్యాడు. ఇన్ని కేసుల ఉక్కిరి బిక్కిరి తట్టుకోలేక ఫైనల్ గా మన్సూర్ దిగివచ్చాడు అని అందరూ భావిస్తున్నారు.

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×