BigTV English

OTT Movie : పూజ చేస్తే కోరికలు తీర్చే బొమ్మ … క్లైమాక్స్ వరకూ కన్ఫ్యూజ్ చేసే సినిమా

OTT Movie : పూజ చేస్తే కోరికలు తీర్చే బొమ్మ … క్లైమాక్స్ వరకూ కన్ఫ్యూజ్ చేసే సినిమా

OTT Movie : ఎంటర్టైన్మెంట్ కోసం ఓటీటీ వైపు ఎక్కువగా చూస్తున్నారు మూవీ లవర్స్. వీటిలో క్రైమ్ థ్రిల్లర్ సినిమాలను ఎక్కువగా ఫాలో అవుతున్నారు. చివరి వరకు ఈ సినిమాలు ప్రేక్షకుల్ని చూపు పక్కకు తిప్పుకోకుండా చేస్తున్నాయి. ఇప్పుడు మనం చెప్పుకోబోయే మూవీ ఒక సింగర్ హత్య చుట్టూ తిరుగుతుంది. ఇందులో ఒక బొమ్మ కూడా ప్రధాన పాత్ర పోషిస్తుంది. ఆ బొమ్మకి పూజలు కూడా చేయడం మొదలుపడతారు. చివరికి అదంతా ఒక ట్రాప్ అని తెలుస్తుంది. ఈ మూవీ పేరు ఏమిటి? ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో వివరాల్లోకి వెళితే..


నెట్ ఫ్లిక్స్ (Netflix)లో

2021 లో వచ్చిన ఈ మూవీ పేరు ‘ది గార్డియన్ ‘(The Guardian). వియత్నామ్ నుంచి వచ్చిన ఈ మూవీకి విక్టర్ వు దర్శకత్వం వహించారు. దీనిని ఒక రివెంజ్ థ్రిల్లర్‌గా తెరకెక్కించారు. ఈ కథ పాప్ స్టార్‌గా ఉన్న ఒక యువతి చుట్టూ తిరుగుతుంది. ఆమె జీవితంలో సంభవించే ఒక దుర్ఘటన తర్వాత సింగర్‌ గా ఎలా మారుతుందనే విషయాన్ని చూపిస్తుంది. ఈ మూవీ నెట్ ఫ్లిక్స్ (Netflix)లో స్ట్రీమింగ్ అవుతోంది.


స్టోరీలోకి వెళితే

లామ్ ఫుంగ్ అనే పాప్ స్టార్ తన బాత్‌టబ్‌లో ఆత్మహత్య చేసుకుని చనిపోతుంది. ఒక నైట్‌క్లబ్‌లో ముగ్గురు వ్యక్తులు ఆమెను డ్రగ్స్ ఇచ్చి, ఆమెపై అత్యాచారం చేసి, ఆ దృశ్యాలను వీడియో తీసి వైరల్ చేస్తారు. అందుకే ఆమె ఆత్మహత్య చేసుకుంటుంది. ఆమె చనిపోయే సమయంలో, ఆమె వద్ద ఒక కుమాంతాంగ్ బొమ్మ ఒకటి ఉంటుంది. ఈ బొమ్మ ఉండటం వలన ఆమె మరణంలో, అతీంద్రియ శక్తుల పాత్ర ఉందని అనుమానాలను రేకెత్తిస్తుంది. ఈ సంఘటన తర్వాత ఫుంగ్ కి బ్యాకప్ సింగర్ అయిన లీ కథలోకి ప్రవేశిస్తుంది. లీ గతంలో ఫుంగ్‌తో కలిసి పనిచేసిన ఒక సాధారణ అమ్మాయి. పోలీసులు ఈ కేసును దర్యాప్తు చేస్తున్నప్పుడు, లీని కూడా ఈ కేసులో ప్రశ్నిస్తారు. అయితే ఆ రాత్రి జరిగిన సంఘటనల గురించి ఆమెకు ఏమీ గుర్తు లేదని లీ చెబుతుంది. ఫుంగ్ మరణం తర్వాత, లీకి క్రమంగా గుర్తింపుతో పాటు విజయాలు లభిస్తాయి. ఆమె కూడా కుమాంతాంగ్ బొమ్మను ఉపయోగించి తన కోరికలను నెరవేర్చుకోవడానికి ప్రయత్నిస్తుంది. ఈ బొమ్మకు పూజలు కూడా చేస్తుంది. ఆమె విజయాలకు కారణం కుమాంతాంగ్ బొమ్మ అని నమ్ముతుంది.

నిజానికి ఈ బొమ్మ వాస్తవంగా అతీంద్రియ శక్తులతో పనిచేయదు. ఇది ఒక పెద్ద పథకంలో భాగంగా వాడతారు. మరోవైపు ఫుంగ్ కాబోయే భర్త అయిన ఖాన్, ఆమె తల్లిదండ్రులు ఫుంగ్ మరణానికి ప్రతీకారం తీర్చుకోవాలనుకుంటారు. వారు లీ నుండి నిజాన్ని బయటకు తీసుకురావడానికి, ఈ బొమ్మలో ఒక రహస్య కెమెరా, మైక్రోఫోన్ అమర్చి, ఆమె కోరికలను రికార్డ్ చేస్తారు. ఆమె కోరికలను వీళ్ళు తీర్చడంతో, బొమ్మ వల్లే ఇదంతా జరుగుతుందని అనుకుంటుంది లీ. చివరికి లీ ద్వారా ఫుంగ్ ను చంపిన వాళ్ళు ఎవరో తెలుసుకుని, ఖాన్ వారిని చంపేస్తాడు, కానీ లీని చంపకుండా ఆమెను తన అపరాధ భావనతో బతకనిస్తాడు. అయితే లీ ఈ ఒత్తిడిని తట్టుకోలేక, ఫుంగ్ ఆత్మను భ్రమల్లో చూస్తూ, చివరికి బాల్కనీ నుండి దూకి ఆత్మహత్య చేసుకుంటుంది. చివర్లో ఖాన్‌ను పోలీసులు అరెస్ట్ చేస్తారు. ఈ సినిమా హారర్ సినిమా కంటే ఎక్కువగా థ్రిల్ చేస్తుంది.

Related News

OTT Movie : భర్తే భార్యను వేరొకడితో … కుంభకోణాల ట్విస్ట్‌ లు, సీట్ ఎడ్జ్‌ థ్రిల్లర్ లు … ఒక్కసారి చూశారంటే

OTT Movie : డ్రగ్ ట్రాఫికింగ్ చుట్టూ తిరిగే బెంగాలీ సిరీస్ … తల్లీకూతుర్లదే అసలు స్టోరీ … IMDBలో కూడా మంచి రేటింగ్

OTT Movie : ఆటకోసం అబ్బాయిగా మారే అమ్మాయి … ట్రయాంగిల్ లవ్ స్టోరీతో అదిరిపోయే థ్రిల్లింగ్

OTT Movie : అడవిలో ఒంటరి అమ్మాయి … రాత్రీపగలూ అతడితోనే … క్లైమాక్స్ వరకూ రచ్చే

OTT Movies : ఈ వీకెండ్ ఓటీటీలోకి కొత్త సినిమాలు.. మిస్ అవ్వకుండా చూసేయ్యండి…

OTT Movie : కామాఠిపురంలో కాలుజారే ఒంటరి జీవితాలు … లాక్ డౌన్ మిగిల్చిన జ్ఞాపకాలు … ఒక్కో స్టోరీ ఒక్కో స్టైల్లో

Big Stories

×