BigTV English
Advertisement

Marco : ‘మార్కో’ రక్తపాతం వెనుక ఉన్నది ఇతనే… నేషనల్ అవార్డు టాలెంట్ మావా ఇది

Marco : ‘మార్కో’ రక్తపాతం వెనుక ఉన్నది ఇతనే… నేషనల్ అవార్డు టాలెంట్ మావా ఇది

Marco : మలయాళం హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘మార్కో’ (Marco) మూవీ అన్ని భాషల్లోనూ అదరగొడుతోంది. అయితే ప్రేక్షకులను ఈ మూవీ ఇంతలా ఆకట్టుకోవడానికి ముఖ్య కారణం ఆ మూవీలో ఉన్న హింస, రక్తపాతమే అని చెప్పాలి. అయితే బ్లడ్ బాత్ చేసే హీరోలు, విలన్లనే తెరపై చూస్తాం మనం. కానీ దాని వెనక ఉన్న టెక్నికల్ టీం గురించి పెద్దగా ఆలోచించము. మరి ‘మార్కో’ రక్తపాతం వెనుక ఉన్న వ్యక్తి ఎవరో తెలుసా ?


‘యానిమల్’ తర్వాత ప్రేక్షకుల ఆలోచనా విధానం పూర్తిగా మారిపోయింది. సినిమాలో ఎంత రక్తపాతం ఉంటే అంత హిట్ అన్నట్టుగా నడుస్తోంది ట్రెండ్. దానికి తగ్గట్టుగానే ఉన్ని ముకుందన్ హీరోగా నటించిన మలయాళ యాక్షన్ ఎంటర్టైనర్ ‘మార్కో’ (Marco) తెరపైకి వచ్చింది. డిసెంబర్ 20న మలయాళ భాషలో రిలీజ్ అయిన ఈ మూవీ అక్కడ బ్లాక్ బస్టర్ టాక్ తో నిర్మాతలకు కాసుల వర్షం కురిపించింది. దీంతో ఈ మూవీని తెలుగు ప్రేక్షకులకు కూడా పరిచయం చేస్తే బాగుంటుందనే ఆలోచనతో జనవరి 1న టాలీవుడ్ లో కూడా రిలీజ్ చేశారు. ఇంకేముంది ఇక్కడ కూడా ఈ సినిమాకు అదిరిపోయే టాక్ నడుస్తోంది.

ఇదిలా ఉండగా ఈ సినిమా ఈ రేంజ్ లో హిట్ కావడానికి ముఖ్య కారణం రక్తపాతం అని చెప్పుకున్నాం మనం. మరి ఆ రక్తపాతం వెనక ఉన్నది ఎవరో తెలుసా? ‘మార్కో’ (Marco) మూవీ మేకప్ ఆర్టిస్ట్. మేకప్ అనగానే ఏదో క్రీములు మొహానికి పూసేయడం, హీరో హీరోయిన్లను అందంగా చూపించడం అని అనుకుంటాం మనం. కానీ తాజాగా ‘మార్కో’ మూవీకి వర్క్ చేసిన మేకప్ ఆర్టిస్ట్ మాత్రం ఏకంగా సినిమాలో తెగిపడే తలలు, బ్రెయిన్, చేతులు వంటి వాటిని చూడ్డానికి రియల్ గా ఉండేలా తయారు చేసి వార్తల్లో నిలిచారు. ఏదో తయారు చేయడం అంటే అల్లాటప్పా మేకింగ్ కాదు… ఒక చెయ్యి విరిగితే అందులోని ఎముక ఏ విధంగా పైకొస్తుందో కూడా పక్కాగా డిజైన్ చేశారు.


ప్రస్తుతం సోషల్ మీడియాలో ఆయన ఈ సైంటిఫిక్ రీజన్స్ వివరిస్తూ ఎలా ఇంత వైలెన్స్ ని క్రియేట్ చేశారో చెప్పిన వీడియో వైరల్ అవుతుంది. ఆ వీడియో చూసిన నెటిజన్లు ఇది నేషనల్ అవార్డు విన్నింగ్ ట్యాలెంట్ మావా అంటున్నారు. సినిమా చిన్నదైనా, పెద్దదైనా అందులో పని చేసే టెక్నీషియన్లు కూడా ఎంత ముఖ్యమో ఈ వీడియో ద్వారా అర్థమవుతుంది. ఏదేమైనా ఈ వీడియో వల్ల సినిమాకు మరింత బూస్ట్ దొరికినట్టే.

ఇక ‘మార్కో’ ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే ఈ సినిమా 80 కోట్లకు పైగా కలెక్షన్లను కొల్లగొట్టింది. నిజానికి 21 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో ఈ సినిమా మలయాళంలో రిలీజ్ అయింది. కానీ బ్లాక్ బస్టర్ టాక్ తో అంతకు మూడు నాలుగు ఇంతలు లాభాలు తెచ్చిపెట్టింది. తెలుగులో కూడా మొదటి రోజే ఈ సినిమా ఏకంగా 1.45 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ అందుకుంది. ఇక రెండో రోజు వీక్ డే అయినప్పటికీ 75 లక్షల గ్రాస్ రాబట్టడం విశేషం. రెండు రోజుల్లోనే ఈ మూవీ తెలుగులో 2.20 కోట్ల కలెక్షన్స్ కొల్లగొట్టింది. మరో 2 కోట్ల షేర్ రాబడితే ఈ మూవీ తెలుగులో కూడా బ్రేక్ ఈవెన్ టార్గెట్ ను దాటినట్టే. మరోవైపు హిందీలో కూడా ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ దక్కుతుంది. ఇప్పటిదాకా ఈ సినిమా వరల్డ్ వైడ్ గా 81 కోట్ల పైగా గ్రాస్, 38 కోట్ల షేర్ రాబట్టింది.

Related News

Tejaswini Nandamuri: నందమూరి వారసురాలు వైరల్ యాడ్ డైరెక్టర్ ఎవరో తెలుసా? ఇంత బ్యాక్గ్రౌండ్ ఉందా?

Film industry: ఘనంగా సినిమాటిక్ ఎక్స్ పో 3వ ఎడిషన్!

CM Revanth on Movie Tickets: సినిమా టికెట్ డబ్బుల్లో సినీ కార్మికులకు వాటా… సీఎం సంచలన ప్రకటన

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇల్లు చూడండి.. ఎంత అద్భుతంగా ఉందో!

Telugu Heroes : సినిమాలతో పాటు హోటల్స్… లగ్జరీ రెస్టారెంట్స్ ఉన్న హీరోలు వీళ్లే

Salman Khan: పాక్ ను కెలికిన సల్లు భాయ్.. తెలుగు సినిమాలు బాగా చూస్తారంటూ..

Siva Jyothi: బేబీబంప్ తో పెళ్లి పీటలు ఎక్కిన శివ జ్యోతి.. ఇలా కూడా చేస్తారా?

Kantara 2: వైకల్యాన్ని జయిస్తూ.. నోటితోనే కాంతార బిజీఎం!

Big Stories

×