BigTV English

Matka Day 1 Collections : ఒక్క రోజుకే మట్కా మటాష్… తీరు ఏం మారలేదు..

Matka Day 1 Collections : ఒక్క రోజుకే మట్కా మటాష్… తీరు ఏం మారలేదు..

ప్రముఖ మెగా ప్రిన్స్ హీరో వరుణ్ తేజ్ (Varun Tej) తాజాగా నటించిన చిత్రం ‘మట్కా'(Matka ). ప్రముఖ డైరెక్టర్ కరుణకుమార్ (Karuna Kumar) దర్శకత్వం వహించగా వైరా ఎంటర్టైన్మెంట్, ఎస్ఆర్టి ఎంటర్టైన్మెంట్ బ్యానర్ల పై డాక్టర్ విజయేందర్ రెడ్డి తీగల, రజినీ తాళ్లూరు సంయుక్తంగా సినిమాను నిర్మించారు. నవంబర్ 14వ తేదీన ప్రపంచవ్యాప్తంగా చాలా గ్రాండ్ గా విడుదలైంది. గ్యాంగ్ స్టర్ డ్రామాగా వచ్చిన ఈ సినిమా మొదటిరోజే డిజాస్టర్ టాక్ అందుకుంది. మరి మొదటి రోజు ఈ సినిమా ఎన్ని కోట్లు రాబట్టింది అనే విషయాలు వైరల్ గా మారుతున్నాయి.


మట్కా గ్యాంగ్ స్టర్ జీవిత ఆధారంగా మూవీ..

గత కొన్ని సంవత్సరాలుగా వరుస డిజాస్టర్లతో సతమతమవుతున్న వరుణ్ తేజ్.. వివాహం తర్వాత తెరకెక్కించిన మూవీ ఇది. ఎన్నో అంచనాల మధ్య హిట్టు కొట్టాలని రతన్ ఖేత్రి (Rathan khetri) అనే మట్కా గ్యాంగ్ స్టర్ జీవితం ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఇందులో మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటించింది. అంతేకాదు ఇందులో నోరాఫతేహి, నవీన్ చంద్ర తదితరులు కీలకపాత్రలు పోషించారు.


మట్కా సినిమా స్టోరీ..

1950 నుంచి 1980 మధ్యకాలంలో మట్కా అనే గ్యాంబ్లింగ్ గేమ్ బ్యాక్ డ్రాప్ తో ఈ సినిమాను తెరకెక్కించడం జరిగింది. ఇందులో వరుణ్ తేజ్ ‘వాసు’ అనే గ్యాంగ్ స్టర్ పాత్రలో నటించారు. వాసు అనే వ్యక్తి చిన్న వయసులోనే బర్మా నుంచి ఆశ్రయం పొందడానికి వైజాగ్ చేరుకుంటారు. పేదరికంతో వాసు చిన్న చిన్న దొంగతనాలు చేస్తూ.. జీవితాన్ని గడుపుతూ ఉంటారు. అదే సమయంలో చేయని తప్పుకు జైలు శిక్ష కూడా అనుభవిస్తారు. ఇక జైలులో జరిగిన కొన్ని పరిణామాలతో ఎలాగైనా డబ్బు సంపాదించాలని ఫిక్సయిన వాసు మట్కా అనే గ్యాంబ్లింగ్ గేమ్ బిజినెస్ లోకి అడుగు పెడతాడు. ఈ బిజినెస్ లోకి వచ్చిన వాసు కోట్లు సంపాదిస్తాడు. కటిక పేదరికంలో పుట్టిన వాసు మట్కా కింగ్ గా ఎలా ఎదిగాడు..? ఈ ప్రయాణంలో అతడు ఎదుర్కొన్న సవాళ్లేంటి.? ఆనాటి పరిస్థితులు ఎలా ఉన్నాయి? అనేది ఈ సినిమా కథ..

మట్కా సినిమా ఎలా ఉందంటే..

ఇకపోతే హీరో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ సినిమాపై ఎన్నో అంచనాలు పెట్టుకున్నారు. కానీ ఆడియన్స్ మాత్రం ఈ సినిమాకు డిజాస్టర్ రెస్పాన్స్ అందించారు. ఒకరకంగా చెప్పాలి అంటే వరుణ్ తేజ్ ఆశలపై ఈ సినిమా నీళ్లు చల్లింది. అయినా సరే కలెక్షన్స్ బాగానే రాబడినట్లు సమాచారం. మరి మొదటి రోజు ఈ సినిమా ఎంత కలెక్షన్స్ వసూలు చేసింది అనే విషయానికొస్తే.. ఇండియన్ బాక్సాఫీస్ వద్ద రూ.0.70 కోట్లు (నెట్) వసూలు రాబడుతుందని అంచనా వేశారు. ఇక తాజాగా అందుతున్న రిపోర్టుల ప్రకారం.. ఈ సినిమా రెండు తెలుగు రాష్ట్రాలలో రూ.80 లక్షల నుండి రూ.1కోటిలోపు కలెక్షన్స్ వసూలు చేసినట్టు తెలుస్తోంది. ఇక ప్రపంచవ్యాప్తంగా రూ 1.2కోట్లు రాబట్టినట్లు సమాచారం. దీనికి తోడు మొదటి రోజు థియేటర్ ఆక్యూపెన్సీ కేవలం 20 శాతం కంటే కూడా తక్కువగా ఉందని వార్తలు వినిపిస్తున్నాయి. మరి అసలే డిజాస్టర్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమాకి వీకెండ్ లో నైనా కలెక్షన్స్ వస్తాయో లేదో చూడాలి.

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×