Kanguva – Matka : తెలుగులో ప్రతి వారం రిలీజ్ అయ్యే సినిమాల సంఖ్య ఎక్కువే ఉంటుంది. కానీ, పెద్ద సినిమాలు రిలీజ్ అయ్యే టైంలో మాత్రం చిన్న సినిమాలు వాయిదా వేసుకుని సేఫ్ అవుతూ ఉంటాయి. అలా ఈ వారం కూడా జరిగింది.
ఈ వారం కంగువ (Kanguva), మట్కా(Matka) సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. కంగువ… భారీ పాన్ ఇండియా మూవీ. ఇది కోలీవుడ్‌లో ఫస్ట్ 1000 కోట్ల మూవీ అవుతుందని ట్రేడ్ పండితులు గట్టిగా నమ్ముతున్నారు. తెలుగుతో పాటు ఇతర భాషల్లో కూడా సూర్య (Suriya) అండ్ టీం గట్టిగా ప్రమోషన్స్ చేస్తున్నారు.
ఇక మట్కా… వరుస డిజాస్టర్స్ తర్వాత వరుణ్ తేజ్ (Varun Tej) చేస్తున్న సినిమా ఇది. ఇప్పటి వరకు వచ్చిన ఫెయిల్యూర్స్ ను తుడిచి పెట్టే సినిమా ఇది అని వరుణ్ తేజ్ నమ్ముతున్నాడు.
అయితే ఈ రెండు సినిమాలకు ఆడియన్స్ బిగ్ షాక్ ఇస్తున్నారు. సొంత లాంగ్వేజ్‌లో కూడా పరిస్థితి దారుణంగా ఉంది. అసలేం జరుగుతుంది ఈ వారం అనేది ఇప్పుడు చూద్ధాం…
ఈ వారం రెండంటే… రెండే సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. అంటే ఆడియన్స్ ముందు రెండే ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి కంగువ. మరకొటి మట్కా. రెండే సినిమాలున్నా… ఆడియన్స్ దేనికి కూడా ఇంట్రెస్ట్ చూపించడం లేదు. రేపే రిలీజ్ అవుతున్న ఈ సినిమాల టికెట్ల బుకింగ్ మరీ స్లోగా సాగుతుంది.
కంగువ మూవీ తెలుగు సినిమా కాకపోయినా… ఇక్కడ మంచి బజ్ ఉంది. పీరియాడిక్ మూవీ అవ్వడం ఒకటి అయితే, దీంట్లో సూర్య హీరో కావడం వల్ల తెలుగులో బజ్ క్రియేట్ అయింది. అలాగే కంగువ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి దర్శకదిగ్గజం ఎస్ ఎస్ రాజమౌళి (SS Rajamouli), మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను, స్టార్ నిర్మాతలు దిల్ రాజు (Dil Raju), అల్లు అరవింద్‌తో పాటు యంగ్ హీరోలు విశ్వక్ సేన్ (Vishwak Sen), సిద్ధు జొన్నలగడ్డ హజరయ్యారు.
అంటే దాదాపు టాలీవుడ్‌లో (Tollywood) సగం మంది సెలబ్రెటీలు అటెండ్ అయ్యారు అన్నట్టే. తెలుగులో బజ్ క్రియేట్ అవ్వడానికి ఇది కూడా ఓ కారణం. అంత బజ్ క్రియేట్ అయినా… ఈ సినిమా బుకింగ్స్ చాలా స్లోగా ఉన్నాయి. బుక్ మై షో (Book My Show) ఓపెన్ చేస్తే దాదాపు అన్ని థియేటర్స్ గ్రీన్ కలర్‌లోనే కనిపిస్తున్నాయి.
ఇక మట్కా… తెలుగు సినిమానే. పైగా ఈ వారం తెలుగు నుంచి మరే సినిమా కూడా రిలీజ్ అవ్వడం లేదు. అలాగే ఇది మెగా కంపౌండ్ నుంచి వచ్చిన వరుణ్ తేజ్ మూవీ. వరుణ్ తేజ్ నుంచి కాకపోయినా.. మెగా కంపౌండ్ హీరో అనే క్వాలిఫికేషన్ తో అయినా… మినిమం బుకింగ్స్ అంచనా వేశారు. కానీ, మట్కా మూవీకి కూడా పరిస్థితి దారుణంగానే ఉంది. థియేటర్స్ కూడా తక్కువే ఉన్నాయనే మాటలు కూడా వినిపిస్తున్నాయి. ఉన్న థియేటర్స్‌లో బుకింగ్స్ స్లోగానే ఉన్నాయి. యూఎస్ ప్రీమియర్స్ కేవలం 500 లోపే టికెట్లు అమ్ముడుపోయాయి అనే టాక్ మట్కా టీంనే షాక్ చేస్తుంది.
సాధారణంగా చిన్న చిన్న సినిమాలు రిలీజ్ అయ్యే టైంలో ఇలాంటి దుస్థితి మనకు బాక్సాఫీస్ వద్ద కనిపిస్తుంది. కానీ, ఈ వారం మాత్రం విడుదలయ్యేవి రెండు పెద్ద సినిమాలే. కానీ, బాక్సాఫీస్ పై ఎలాంటి ప్రభావాన్ని చూపించలేకపోతున్నాయి.
రేపు సినిమా రిలీజ్ అయ్యాకా… ప్రీమియర్స్ నుంచి పాజిటివ్ టాక్ వస్తే.. అప్పుడైనా… బుకింగ్స్‌లో కదలికలు రావొచ్చు.
ఒకవేళ ప్రీమియర్స్ నుంచి నెగిటివ్ టాక్ వస్తే… అడపాదడపా… వీక్ ఎండ్ వరకు మాత్రమే నడుస్తాయి.