Pushpa 2: ఈమధ్య కాలంలో ప్యాన్ ఇండియా అనే ట్యాగ్‌తో తెరకెక్కుతున్న చాలావరకు సినిమాలు విడుదలను చాలా లేట్ చేస్తున్నాయి. విడుదల తేదీ ప్రకటించి కూడా పలుమార్లు పోస్ట్‌పోన్ అవుతున్నాయి. అలాంటి లిస్ట్‌లో ముందుండే సినిమా ‘పుష్ప 2’. అల్లు అర్జున్ (Allu Arjun), సుకుమార్ (Sukumar) కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ‘పుష్ప 2’ రెండేళ్ల క్రితమే విడుదల అవుతుందని మేకర్స్ మాటిచ్చారు. కానీ ఇప్పటికీ ఫస్ట్ పార్ట్ విడుదలయ్యి మూడేళ్లు అవుతోంది. ఇప్పటికి ఈ మూవీ సీక్వెల్ ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతోంది. ఇదే సమయంలో ఆడియన్స్‌కు ఉన్న అనుమానాలు దూరం చేస్తూ రష్మిక మందనా అలియాస్ శ్రీవళ్లి బ్యాక్ టు బ్యాక్ అప్డేట్స్ అందించింది.
వరుస అప్డేట్స్
‘పుష్ప’ అనేది రష్మిక కెరీర్‌లో మొదటి ప్యాన్ ఇండియా సినిమా. దాని తర్వాతే తన కెరీర్ మరో మలుపు తిరిగింది. తనకు బాలీవుడ్ నుండి కూడా ఆఫర్లు రావడం మొదలయ్యింది. ప్రస్తుతం పర్ఫెక్ట్ ప్యాన్ ఇండియా హీరోయిన్ ఎవరు అంటే రష్మిక మందనా అనడంలో ఆశ్చర్యం లేదు. ఇదంతా ముఖ్యంగా ‘పుష్ప’ వల్లే సాధ్యమయ్యింది. అందులో శ్రీవళ్లిగా డీ గ్లామర్ పాత్రలో ప్రేక్షకులను మెప్పించింది రష్మిక. ఇప్పుడు ‘పుష్ప 2’తో మరోసారి అదే పాత్రతో ఆడియన్స్ ముందుకు రానుంది. అందుకే ఈ మూవీ గురించి ఇప్పటివరకు ఎవరూ ఇవ్వని బ్యాక్ టు బ్యాక్ అప్డేట్స్ ఇస్తూ ఫ్యాన్స్‌ను హ్యాపీ చేసింది రష్మిక. దాంతో పాటు కొన్ని ఫోటోలు కూడా షేర్ చేసింది.
Also Read: ఆ ఒక్క సీన్ కోసమే రూ.60 కోట్లు.. సీక్రెట్ రివీల్ చేసిన నటుడు..!
అదొక అద్భుతం
‘పుష్ప 2’ (Pushpa 2) కోసం డబ్బింగ్ మొదలుపెట్టింది రష్మిక మందనా. అందుకే డబ్బింగ్ స్టూడియో నుండి ఫోటోలు షేర్ చేయడంతో పాటు సినిమాపై పలు అప్డేట్స్ కూడా అందించింది. ‘ఇప్పుడు ఫన్, గేమ్స్ అన్నీ అయిపోయాయి. ఇక అసలు విషయం మొదలుపెట్టాల్సిన సమయం వచ్చేసింది. దానికి అర్థం ఏంటంటే.. పుష్ప షూటింగ్ దాదాపుగా అయిపోయింది. పుష్ప ది రూల్ ఫస్ట్ హాఫ్‌కు సంబంధించిన డబ్బింగ్ కూడా అయిపోయింది. నేను సెకండ్ హాఫ్‌కు కూడా డబ్బింగ్ మొదలుపెట్టేశాను. ఈ సినిమా ఫస్ట్ హాఫ్ చాలా అద్భుతంగా ఉంది. సెకండ్ హాఫ్ అయితే అంతకు మించి ఉంటుంది’ అంటూ బన్నీ ఫ్యాన్స్‌లో హైప్ క్రియేట్ చేసింది శ్రీవళ్లి.
బాధగా ఉంది
‘నాకు ఈ సినిమా గురించి మాటల్లో చెప్పడానికి రావడం లేదు. ప్రేక్షకులంతా మైండ్ బ్లోయింగ్ ఎక్స్‌పీరియన్స్‌కు సిద్ధంగా ఉండండి. నేను కూడా దానికోసమే ఎదురుచూస్తున్నాను. ఈ ఫోటోలో నేను బాధగా ఎక్స్‌ప్రెషన్ ఎందుకు ఇచ్చానంటే.. ఈ సినిమా షూటింగ్ దాదాపుగా అయిపోయింది. నాకు బాధగా ఉంది’ అంటూ చెప్పుకొచ్చింది రష్మిక మందనా (Rashmika Mandanna). ఇప్పటికే మ్యూజిక్ డైరెక్టర్స్ తమన్, దేవీ శ్రీ ప్రసాద్ కూడా సినిమా ఫస్ట్ హాఫ్ చూశామని అద్భుతంగా ఉందని అన్నారు. ఇప్పుడు ఈ హీరోయిన్ కూడా అదే చెప్తోంది. దీంతో ‘పుష్ప 2’పై ఫ్యాన్స్‌లో అంచనాలు పెరిగిపోతున్నాయి.
#RashmikaMandanna shares major updates on her upcoming film #Pushpa2. The actress is currently busy dubbing for it. 💯#Celebs pic.twitter.com/SYGKHBsWVM
— Filmfare (@filmfare) November 13, 2024