BigTV English

Mechanic Rocky: విడుదల వాయిదా.. ట్రైలర్ డేట్ లాక్..పోస్టర్ తో అధికారిక ప్రకటన..!

Mechanic Rocky: విడుదల వాయిదా.. ట్రైలర్ డేట్ లాక్..పోస్టర్ తో అధికారిక ప్రకటన..!

Mechanic Rocky.. వరుస విజయాలతో ఫుల్ స్వింగ్ లో ఉన్న మాస్ కా దాస్ విశ్వక్ సేన్ (Vishwak Sen) తాజాగా నటిస్తున్న చిత్రం మెకానిక్ రాకీ(Mechanic Rocky).. మీనాక్షి చౌదరి (Meenakshi Choudhary), శ్రద్ధా శ్రీనాథ్ (Shraddha Srinath)హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రం యాక్షన్ , కామెడీ ఎంటర్టైనర్ గా రాబోతోంది. నూతన దర్శకుడు రవితేజ ముల్లపూడి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తూ.. ఇండస్ట్రీకి పరిచయం కాబోతున్నారు. ఈ సినిమాని రామ్ తాళ్లూరి తన సొంత బ్యానర్ ఎస్ఆర్టీ ఎంటర్టైన్మెంట్స్ పై భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఫస్ట్ లుక్ నుండి ఫస్ట్ గేర్ టీజర్ వరకు.. అలాగే ఇటీవల రిలీజ్ చేసిన ఫస్ట్ సింగిల్ కి కూడా మంచి రెస్పాన్స్ లభించింది. మ్యూజికల్ ప్రమోషన్స్ లో భాగంగా 2వ పాటను కూడా విడుదల చేయగా ఈ పాట కూడా విపరీతమైన రెస్పాన్స్ అందుకోవడం గమనార్హం.


విడుదల తేదీ వాయిదా..

మొదటి పాటకు కాస్త భిన్నంగా ఊ పిల్ల అంటూ పెప్పీ బీట్ లో చాలా ఆకట్టుకుంది. ఇటీవలే సరిపోదా శనివారం సినిమా కోసం బ్లాక్ బాస్టర్ మ్యూజిక్ ఆల్బమ్ అందించిన జోక్స్ బెజోయ్ ఈ సినిమాకు సంగీతాన్ని అందిస్తున్నారు. ముఖ్యంగా కృష్ణ చైతన్య రాసిన పాటలు సినిమాకు హైలైట్ గా నిలవనున్నాయి. విశ్వక్ సేన్ మీనాక్షి కలసి చాలా అందంగా ఈ పాటలో కనిపించారు. విజువల్స్ కూడా చాలా బాగా ఆకట్టుకున్నాయి. మనోజ్ కాటసాని సినిమాటోగ్రఫీ అందిస్తుండగా.. ఇందులో శ్రద్ధ శ్రీనాథ్ మరో హీరోయిన్ గా నటిస్తోంది. ఈ చిత్రానికి సత్యం రాజేష్, విద్యాసాగర్.జే.. ఎగ్జిక్యూటివ్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్న ఈ సినిమాను దీపావళి సందర్భంగా అక్టోబర్ 31వ తేదీన విడుదల చేస్తామని చిత్ర బృందం ప్రకటించగా.. ఇప్పుడు ఆ విడుదల తేదీని వాయిదా వేసినట్లు సమాచారం.


పోస్టర్ తో సహా టైలర్ డేట్ లాక్..

ఇదిలా ఉండగా తాజాగా నిర్మాతలు ఈ సినిమా విడుదలను వాయిదా వేస్తూ.. ఇప్పుడు ఒక పోస్టర్ తో సహా ప్రకటించారు. నవంబర్ 22వ తేదీన మెకానిక్ రాకీ సినిమా థియేటర్లలోకి ప్రపంచవ్యాప్తంగా రాబోతోంది అంటూ తెలిపారు. అదృష్టవశాత్తు ఈ సినిమా సోలో తేదీని సొంతం చేసుకుంది. ముఖ్యంగా బాక్సాఫీస్ వద్ద దీనికి బలమైన పోటీ కూడా ఏ చిత్రం లేకపోవడం గమనార్హం. అంతే కాదు ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్ ని కూడా అక్టోబర్ 20 తేదీన విడుదల చేయనున్నట్లు మేకర్స్ ఒక పోస్టర్ తో సహా విడుదల చేశారు. ఇందులో విశ్వక్ సేన్ మిస్టరీని చాటాడు. హీరోయిన్లు మీనాక్షి చౌదరి అందమైన సాంప్రదాయ చీరలో కనిపించగా.. శ్రద్ధ శ్రీనాథ్ పట్టణ మహిళా గెటప్ లో ఆకట్టుకుంది. ఇక ప్రమోషన్స్ లో భాగంగా మేకర్స్ ఫస్ట్ గేర్ అనే టీజర్ తో పాటు రెండు పాటలను కూడా విడుదల చేశారు. రెండూ కూడా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఇక ఈ సినిమాకి ఈ ట్రైలర్ వేదికగా నిలుస్తుందని మేకర్స్ భావిస్తున్నారు. మరి ఈ సినిమా విశ్వక్ సేన్ కి ఎలాంటి విజయాన్ని అందిస్తుందో చూడాలి.

Mechanic Rocky: Release Postponed..Trailer Date Locked..Official Announcement With Poster..!
Mechanic Rocky: Release Postponed..Trailer Date Locked..Official Announcement With Poster..!

Related News

Alekhya sisters: ఇదేంట్రా బాబూ.. కుక్కలకు, నక్కలకు జీవితం అంకితం అంటోంది?

Movie Tickets : బుక్ మై షోలో లేని టికెట్స్ డిస్ట్రిక్ట్ యాప్‌లో ఎలా వస్తున్నాయి ?

Save the Tigers 3 : ‘సేవ్ ది టైగర్స్’ మళ్లీ వచ్చేస్తుంది.. ఎమ్మెల్యే గా ఘంటా రవి..

BIG TV Kissik talk Show: ఆ డైరెక్టర్ వల్లే నా కెరీర్ మొత్తం నాశనం.. మండిపడ్డ నటి రాశి

BIG TV Kissik talk Show : పదేళ్లుగా పిల్లలు పుట్టలేదు, చివరికి నా ప్రాణాలు ఫణంగా పెట్టి.. రాశి భావోద్వేగం

Sydney Sweeney: సిడ్నీ స్వీని బాలీవుడ్ ఎంట్రీ.. ఏకంగా రూ.530 కోట్లు ఆఫర్.. కళ్లు తేలేసిన నటి!

BIG TV Kissik talk Show : అతడితో పెళ్లి.. ఇంట్లో చాలా పెద్ద గొడవలు అయ్యాయి – కిస్సిక్ టాక్‌లో రాశి కామెంట్స్

Priyanka Jain: ప్రియాంకకు హ్యాండిచ్చి.. శోభశెట్టితో పులిహోర కలిపిన శివ్, అడ్డంగా బుక్కయ్యాడుగా!

Big Stories

×