BigTV English

Nindu Noorella Saavasam Serial Today October 14th: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ఇంట్లోకి ఘోర వచ్చాడని ఆరుకు చెప్పిన గుప్త – మిస్సమ్మకు బుల్లెట్‌ నేర్పిస్తానన్న అమర్‌

Nindu Noorella Saavasam Serial Today October 14th: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ఇంట్లోకి ఘోర వచ్చాడని ఆరుకు చెప్పిన గుప్త – మిస్సమ్మకు బుల్లెట్‌ నేర్పిస్తానన్న అమర్‌
Advertisement

Nindu Noorella Saavasam Serial Today Episode:  ఘోర మనోహరికి ధైర్యం చెప్పి ఈ ఒక్కరోజు నువ్వు తెగిస్తే మనం గెలుస్తాం.. ఇక మనకు ఎదురుండదు అంటూ మనోహరికి  బ్రెయిన్‌ వాష్‌ చేస్తాడు ఘోర. దీంతో మనోహరి ఘోరాను తన రూంలో ఉండమని ఏవ్వరూ రాకుండా చూస్తానని చెప్తుంది. అయితే ఇప్పుడు నేనేం చేయాలో చెప్పు అని అడుగుతుంది. మనోహరికి ఏం చేయాలో ఘోర చెప్తుంటాడు.


గార్డెన్ లో ఉన్న గుప్త ఇంటిలోకి ఘోర వచ్చింది పసిగడతాడు. వాడు ఇంట్లోకి వచ్చాడని భయపడుతుంటాడు. ఇంతలో అక్కడికి ఆరు వస్తుంది. లోపల జరుగుతున్న బర్తుడే సెలబ్రేషన్స్‌ గురించి గుప్తకు చెప్తుంది. అయితే గుప్త పలకకుండా అలాగే ఉంటాడు. ఆరు గుప్తను లోపలికి వెళ్దాం పద అని అడుగుతుంది. గుప్త రానని. నువ్వు కూడా వెళ్లొద్దని ఆరుకు చెప్తాడు.  దీంతో ఆరు,  అంజు బర్తుడే రోజు నేను లోపలికి వెళ్లకూడదా? ఎందుకు? ఓహో అక్కడ మిస్సమ్మ కూడా ఉంటుందనా? మిస్సమ్మకు కనిపించకుండా ఉంటాను. ఏమైంది గుప్త గారు ఎందుకు అంత సీరియస్‌ గా ఉన్నారు అని అడుగుతుంది.

ఏదో జరగబోవుతున్నదని నా మనసు కీడు శంకించుచున్నది బాలిక. ఆ ఘోర ఈ ఇంటి ఆవరణలోకి ప్రవేశించాడని నాకు అనిపిస్తున్నది అని చెప్పగానే ఆరు భయపడుతుంది. వెంటనే  ఏం మాట్లాడుతున్నారు గుప్త గారు అటుంది. అవును ఇది అనుమానమో నిజమో తెలియడం లేదు బాలిక. కానీ ఆ ఘోర ఈ పరిసరాలలోనే ఉన్నాడని నా దివ్య దృష్టి చెబుతున్నది అంటాడు. అయితే  మీ దగ్గర ఉన్న భవిష్యవాణి తీసి ఘోర ఇంట్లో ఉన్నాడో లేడో ఒక్కసారి చూడండి గుప్త గారు అని చెప్తుంది ఆరు.


దైవ శక్తి వలే తాంత్రిక శక్తి కూడా చాలా శక్తివంతమైనది బాలిక. ఎవ్వరికీ అనుమానం రాకుండా ఆ ఘోర బంధనము వేసినట్టు అనిపిస్తున్నది అని చెప్పగానే మా ఆయన ఇంట్లో ఉండగానే అంత ధైర్యంగా లోపలికి ఎలా వచ్చాడు గుప్త గారు అని అడుగుతుంది ఆరు. చెప్పాను కదా బాలిక నీకు శక్తులు వచ్చాయని గ్రహించి నిన్ను ఇప్పుడు బంధించినచో అతగాడు మరింత శక్తివంతుడు అవునని తెగించి వచ్చినట్టున్నాడు అని చెప్తాడు గుప్త.

కరుణతో మాట్లాడాలని బయటకు వస్తాడు అమర్‌. అమర్‌ వెనకాలే రాథోడ్, కరుణ వస్తారు. చెప్పండి అమర్‌ గారు.. ఏంటి విషయం.. నాతో ఏం మాట్లాడాలి అని అడుగుతుంది. మిస్సమ్మ గురించి పూర్తిగా తెలుసుకుందామని మిమ్మల్ని పిలిచాను అని చెప్తాడు అమర్‌. అంతా గమనిస్తున్న ఆరు మా ఆయన బంగారం గుప్త గారు అంటుంది. ఇంతలో కరుణ… అమరేంద్ర గారు దాని కిస్మత్‌ ఎప్పుడూ మంచిగ లేదు. చిన్నప్పటి నుంచి అంతే.. అమ్మ చనిపోయింది. గయ్యాళి పిన్ని వచ్చింది. నచ్చిన సదువు లేదు. నచ్చిన బతుకు లేదు. కానీ దానిలో నచ్చేదేదో తెలుసా? ఏం జరిగినా ఏన్ని సార్లు కింద పడినా.. ఎట్ల లేవగలను.. ఎట్ల సంతోషంగా ఉండగలను అని ఆలోచించే దాని మనస్తత్వం అని కరుణ చెప్తుంది.

అది కాకుండా తనకి తీరని కోరికలు లాంటివి. ఏమైనా ఉన్నాయా? అని అమర్‌ అడుగుతాడు. తీరని కోరికలు అంటే.. చిన్నప్పుడు తప్పిపోయిన వాళ్ల అక్కను కలవాలనుకుంది. కానీ కలవలేదు. కొడైకెనాల్‌ లో  మిస్సమ్మ ఫ్యాన్‌ ఒకామె ఉండేది. ఆమెను కలవాలనుకుంది. కానీ అది కూడా జరగలేదు. ఆ ఇంకోటి ఉంది…. అంటూ ప్రశ్నార్థకంగా చూస్తుంటే.. ఇంకోటి ఏంటి..? ఇవన్నీ  కాదు కానీ  ఇప్పటికిప్పుడు నేను చేయగలిగేవి. మిస్సమ్మ హ్యాపీగా ఫీలయ్యేవి ఏమైనా ఉన్నాయా..? అని అడుగుతాడు అమర్‌.

దానికి ఎప్పటి సందో బుల్లెట్‌ నేర్చుకుని.. రోడ్డు మీద దర్జాగా తిరగాలని కోరిక. కానీ దానికి బుల్లెట్టు లేదు.. నేర్పించే మనిషి లేడు అంటుంది కరుణ. అయితే నేను ట్రైనర్‌ ను పెట్టి.. అని అమర్‌ ఏదో చెప్పబోతుంటే.. అంటే మీరు రేపటి నుంచి తనకు బుల్లెట్‌ నేర్పిస్తారన్నమాట. ఓ నా ఫ్రెండ్‌ ఎంత అదృష్టవంతురాలు అంటూ అమర్‌ ఏదో చెప్పాలనుకున్నా పట్టించుకోకుండా లోపలికి వెళ్లిపోతుంది. అమర్‌ బుల్లెట్‌ ను చూపిస్తూ అది కండీషన్‌ లో ఉందో లేదో చూడు రాథోడ్‌  అనగానే రాథోడ్‌ సరే అంటాడు.

మిస్సమ్మ అంజును రెడీ చేస్తుంది. సైడు పిన్నులు తక్కువగా ఉన్నాయి తీసుకురాపో అని చెప్పగానే కిందకు వచ్చిన అమ్ము మనోహరి రూంలోకి వెళ్లి అడుగుతుంది. లోపల ఘోరతో మాట్లాడుతున్న మనోహరి అమ్మును చూసి షాక్‌ అవుతుంది. అయితే అమ్ము డోర్‌ ఓపెన్‌ చేయడం గమనించిన ఘోర తలుపు చాటుకు దాక్కుంటాడు. లోపలికి వచ్చిన అమ్ము రూంలో ఏదోలా ఉందని మనోహరికి చెప్తుంది. పిన్నులు తీసుకుని బయటకు వెళ్తున్న అమ్ముకు మనోహరి ఇంకోసారి రూంలోకి వస్తే పర్మిషన్‌ తీసుకుని రమ్మని చెప్తుంది  ఇంతటితో నేటి నిండు నూరేళ్ల సావాసం సీరియల్ ఎపిసోడ్‌ అయిపోతుంది.

Related News

New Movie in TV : ఫ్యామిలీ ఫ్యామిలీ తింగరోల్లే… కడుపుబ్బా నవ్వించే తమిళ కామెడీ మూవీ టీవీలోకి… ఎప్పుడంటే?

Karthika Deepam: సోషల్ మీడియాలో హీటేక్కిస్తున్న వంటలక్క.. ‘కార్తీక దీపం’ టీమ్ కు బిగ్ షాక్..

Illu Illalu Pillalu Today Episode: ప్రేమ దెబ్బకు ధీరజ్ షాక్.. వల్లికి కొత్త టెన్షన్..ప్రమాదంలో ఇరుక్కున్న ధీరజ్..

Nindu Noorella Saavasam Serial Today october 21st: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: అబార్షన్‌ చేయించుకోవడానికి హాస్పిటల్‌కు వెళ్లిన మిస్సమ్మ  

Intinti Ramayanam Today Episode: గది కోసం రచ్చ చేసిన శ్రీయ.. ఇంట్లో పెద్ద గొడవ.. పల్లవి నెక్స్ట్ ప్లాన్ ఏంటి..?

GudiGantalu Today episode: ఇంట్లో దీపావళి సంబరాలు.. కక్కుర్తి పడ్డ మనోజ్..రోహిణికి ఫ్యూజులు అవుట్..

Brahmamudi Serial Today October 21st: ‘బ్రహ్మముడి’ సీరియల్‌: కావ్యకు అబార్షన్‌ జరిగేందుకు రుద్రాణి ప్లాన్‌  

Today Movies in TV : మంగళవారం మూవీ మస్తీ.. టీవీల్లోకి బోలెడు సినిమాలు..

Big Stories

×