No Indian Flag at Stadium: ఈనెల 19వ తేదీ నుండి దాయాది దేశం పాకిస్తాన్, దుబాయ్ వేదికలలో ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ప్రారంభం కాబోతున్న విషయం తెలిసిందే. ఈ టోర్నీ నిర్వహణకు పాకిస్తాన్ ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేసుకుంది. ఇందులో భాగంగా ఈనెల 7 శుక్రవారం రోజున లాహోర్ లోని గడాఫీ స్టేడియాన్ని సిద్ధం చేసిన పాకిస్తాన్ క్రికెట్ బోర్డు {పిసిబి}.. అదే స్టేడియంలో శుక్రవారం రోజు తమ జట్టు కొత్త జెర్సీ లాంచ్ ఈవెంట్ ని కూడా నిర్వహించింది.
Also Read: Virender Sehwag: వరల్డ్ భయంకరమైన బ్యాట్స్ మెన్… బౌలర్ కు గులాబ్ జామ్ లు గడగడలాడాల్సిందే?
గడాఫీ స్టేడియంలో ఈవెంట్ గ్రాండ్ గా జరిగింది. పునరుద్ధరించబడిన స్టేడియంలో కొత్త ఎల్ఈడి స్క్రీన్లు, సీట్లు, ఫ్లడ్ లైట్లు కూడా ఉన్నాయి. పునరుద్ధరించబడిన ఈ స్టేడియాన్ని ఘనంగా ప్రారంభించాలని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు నిర్ణయించుకొని.. ఫిబ్రవరి 7న ఘనంగా ఈవెంట్ ని జరిపింది. ఈ మెగా ఈవెంట్ ని వీక్షించడానికి అనేకమంది ప్రముఖులు హాజరయ్యారు. పాకిస్తాన్ ప్రధాని షాబాజ్ షరీఫ్ ముఖ్యఅతిథిగా స్టేడియాన్ని అధికారికంగా ప్రారంభించారు.
ఈ ఈవెంట్ లో పాల్గొనేందుకు అభిమానులకు ఉచిత ప్రవేశాన్ని కల్పించారు. ఈ ఈవెంట్ లో ఛాంపియన్స్ ట్రోఫీ 2025 యొక్క టీజర్ ని కూడా విడుదల చేశారు. అనంతరం పాకిస్తాన్ క్రికెటర్లు వారి జెర్సీ పైన స్వెటర్లు వేసుకుని స్టేడియంలోకి ఎంట్రీ ఇచ్చారు. ఆ తరువాత స్వెటర్లను విప్పేసి వారి నూతన జెర్సీని రివీల్ చేశారు. అయితే ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా జరిగిన ఈ ఈవెంట్ లో.. గడాఫీ స్టేడియంలో భారత జాతీయ జెండాని తొలగించారు.
పాకిస్తాన్ క్రికెట్ బోర్డు గడాఫీ స్టేడియంలో భారతీయ జెండాను ఏర్పాటు చేయలేదని సోషల్ మీడియాలో తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు భారత క్రీడాభిమానులు. అన్ని దేశాలకు చెందిన జాతీయ జెండాలను ఆ స్టేడియంలో ఏర్పాటుచేసి.. కేవలం భారత జాతీయ జెండాను ఏర్పాటు చేయకపోవడం పట్ల పాకిస్తాన్ క్రికెట్ బోర్డుపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు.
Also Read: Kohli-Pietersen: పీటర్సన్ కొడుక్కి విరాట్ కోహ్లీ అదిరిపోయే గిఫ్ట్ !
ఈ జాతీయ జెండాలకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో.. కొంతమంది తీవ్ర విమర్శలు చేస్తుండగా.. మరి కొంతమంది మాత్రం మన జాతీయ జెండా చాలా విలువైనదని, అందువల్ల దానిని పాకిస్తాన్ ఏర్పాటు చేయలేకపోయిందని ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. అయితే అందులో ఆఫ్గానిస్థాన్ జాతీయ జెండా కూడా లేదని మరికొంతమంది కామెంట్స్ చేస్తున్నారు. ఇక ఫిబ్రవరి 19న ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా తొలి మ్యాచ్ కరాచీ వేదికగా పాకిస్తాన్ – న్యూజిలాండ్ జట్ల మధ్య జరుగుతోంది. ఆ తర్వాత ఫిబ్రవరి 20న భారత్ తన తొలి మ్యాచ్ ని బంగ్లాదేశ్ తో ఆడబోతోంది. ఇక భారత్ – పాకిస్తాన్ మధ్య ఫిబ్రవరి 23న ఆసక్తికర పోరు జరగబోతోంది.
?utm_source=ig_embed&utm_campaign=loading" data-instgrm-version="14">