Meenakshi Chaudhary: నటీనటులు అనేవారు ఎప్పటికప్పుడు కొత్త ప్రయోగాలు చేయాలి, కొత్త పాత్రల్లో కనిపించాలని ఆశపడుతుంటారు. కానీ ప్రతీ ఒక్కరికి ఆ అవకాశం రాకపోవచ్చు. తమకు ఒక పాత్రలో గుర్తింపు వచ్చిందంటే.. వరుసగా అలాంటి పాత్రలే ఇస్తుంటారు మేకర్స్. మీనాక్షి చౌదరి విషయంలో అలా జరగలేదు. ఇప్పటివరకు మీనాక్షి దగ్గరకు వచ్చిన కథలన్నీ దాదాపుగా కమర్షియల్ హిట్స్‌గానే నిలిచాయి. అంతే కాకుండా అందులో తను చేసిన పాత్రలు కూడా తనకు మంచి గుర్తింపు తెచ్చిపెట్టాయి. త్వరలోనే అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ‘సంక్రాంతికి వస్తున్నాం’తో ప్రేక్షకులను పలకరించనుంది మీనాక్షి చౌదరి.
కామెడీ యాంగిల్
అనిల్ రావిపూడి సినిమా అంటేనే తన హీరోయిన్స్‌ను చాలా స్పెషల్‌గా చూపిస్తాడు. అప్పటివరకు ఇతర దర్శకులు.. హీరోయిన్స్‌లో చూడని కొత్త యాంగిల్‌ను ప్రేక్షకులకు చూపిస్తారు అనిల్. అలా ఇప్పటివరకు తన హీరోయిన్స్ అంతా చాలావరకు కామెడీలో కూడా మొదటిసారి ప్రయోగాలు చేశారు. అలాగే ‘సంక్రాంతికి వస్తున్నాం’తో మీనాక్షి చౌదరిలోని కామెడీ యాంగిల్‌ను కూడా బయటపెట్టారు అనిల్. అయితే మొదటిసారి కామెడీ యాంగిల్‌లో, అది కూడా పోలీస్ పాత్రలో నటించడం ఎలా ఉందనే విషయాన్ని తాజాగా ఇంటర్వ్యూలో బయటపెట్టింది మీనాక్షి చౌదరి (Meenkashi Chaudhary). ‘సంక్రాంతికి వస్తున్నాం’ (Sankranthiki Vasthunam)తో తన కల నెరవేరిందంటూ వ్యాఖ్యలు చేసింది.
Also Read: ‘లక్కీ భాస్కర్ ‘ మూవీని కాపీ కొట్టారా? డైరెక్టర్ షాకింగ్ కామెంట్స్..
ఆర్మీ ఫ్యామిలీ
‘‘సంక్రాంతికి వస్తున్నాంలో నటించడం నా అదృష్టంగా భావిస్తున్నాను. దీంతో మొదటిసారి నేను కామెడీలో ప్రయోగం చేస్తున్నాను. ఒక కామెడీ సినిమాలో పోలీస్‌గా నటించడం అనేది చాలా కొత్త అనుభవం. నన్ను చాలా కొత్త పాత్రలో చూసి ఆడియన్స్ ఎంజాయ్ చేస్తారు. నేను మొదటిసారి యాక్షన్ సీన్స్‌లో కూడా నటించాను. అది కూడా ఫన్‌గా అనిపించింది. అందరూ నా పాత్రను ఇష్టపడతారని కోరుకుంటున్నాను. నిజానికి ఒక పోలీస్ పాత్ర చేయడం అనేది నా కల. కానీ కెరీర్‌లో ఇంత త్వరగా ఆ పాత్ర నాకు రావడంతో నేను చాలా లక్కీ. నేను దీనికోసం రిఫరెన్స్ ఏమీ తీసుకోలేదు. కానీ ఆర్మీ బ్యాక్‌గ్రౌండ్ ఉన్న ఫ్యామిలీ నుండి వచ్చాను కాబట్టి పోలీసులు లైఫ్‌స్టైల్ ఎలా ఉంటుందో నాకు ఐడియా ఉంది’’ అని చెప్పుకొచ్చింది మీనాక్షి చౌదరీ.
చాలా పాజిటివ్
‘‘వెంకటేశ్‌తో కలిసి నటించడం చాలా సంతోషంగా అనిపించింది. ఆయన చాలా మంచి మనిషి, ఎప్పుడూ పాజిటివ్‌గా ఉంటారు. ఆయన కామెడీ టైమింగ్ ఎప్పుడూ మిస్ అవ్వదు. చాలా ఎనర్జీతో ఉంటారు. ఎప్పుడూ ఉత్సాహంతో పనిచేస్తారు. అందుకే ఆయనతో పనిచేయడం ఒక అద్భుతమైన ఎక్స్‌పీరియన్స్‌గా ఉండిపోతుంది’’ అంటూ వెంకటేశ్ (Venkatesh)తో కలిసి పనిచేసిన అనుభవాన్ని పంచుకుంది మీనాక్షి చౌదరి. ‘సంక్రాంతికి వస్తున్నాం’లో మీనాక్షితో పాటు మరొక హీరోయిన్‌గా ఐశ్వర్య రాజేశ్ (Aishwarya Rajesh) కూడా కనిపించనుంది. సంక్రాంతి కానుకగా ఈ సినిమా థియేటర్లలో విడుదల కానుంది. అనిల్ రావిపూడి (Anil Ravipudi) సక్సెస్ స్ట్రీక్‌లో ఇది కూడా యాడ్ అవుతుందని ప్రేక్షకులు నమ్మకంతో ఉన్నారు.