Ind vs Aus 5th Test Day 2: బోర్డర్ – గవాస్కర్ ట్రోఫీలో భాగంగా సిడ్నీ వేదికగా జరుగుతున్న ఐదవ టెస్ట్ లో భారత జట్టు తన తొలి ఇన్నింగ్స్ లో 185 పరుగులకే ఆల్ అవుట్ అయిన విషయం తెలిసిందే. కేవలం 72.2 ఓనర్లు మాత్రమే ఆడిన భారత జట్టులో వికెట్ కీపర్ రిషబ్ పంత్ మాత్రమే అత్యధికంగా 40 పరుగులు చేశాడు. ఇక మిగతా బ్యాటర్లు రవీంద్ర జడేజా (26), బుమ్రా (22), గిల్ (20), విరాట్ కోహ్లీ (17), యశస్వి జైష్వాల్ (10) పరుగులు మినహా మిగతా ఏ బ్యాటర్ రెండేంకెల స్కోర్ ని టచ్ చేయలేకపోయాడు.
Also Read: Gautam Gambhir: గంభీర్ కు బిగ్ షాక్.. టీమిండియాను కాపాడేందుకు తెలుగోడు వస్తున్నాడు ?
ఇక ఆస్ట్రేలియా బౌలర్లలో స్కాట్ బోలాండ్ నాలుగు వికెట్లు పడగొట్టగా.. మిచెల్ స్టార్క్ 3, పాట్ కమీన్స్ 2, నాథన్ లియోన్ 1 వికెట్లు తీశారు. అనంతరం తన మొదటి ప్రారంభించిన ఆస్ట్రేలియా జట్టు మొదటి రోజు 9 పరుగులు చేసి ఒక వికెట్ కోల్పోయింది. ఇక రెండవ రోజు తన మొదటి ఇన్నింగ్స్ ని ప్రారంభించిన ఆస్ట్రేలియా జట్టు.. 15 పరుగుల వద్ద లబుషేన్ వికెట్ పడగొట్టాడు కెప్టెన్ బూమ్రా.
ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియాలో ఒకే సిరీస్ లో అత్యధిక వికెట్లు తీసిన ఆటగాడిగా రికార్డ్ సృష్టించాడు బుమ్రా. ఈ రికార్డ్ ఇంతకుముందు బిషణ్ సింగ్ బేడి పేరున ఉండేది. అతడు ఒకే సిరీస్ లో 31 వికెట్లు పడగొట్టగా.. ఇప్పుడు బుమ్రా 32 వికెట్లు తీసి ఆ రికార్డుని బ్రేక్ చేశాడు. ఇక 23 పరుగుల వద్ద సిరాజ్ బౌలింగ్ లో కాన్ స్టాస్ స్లిప్ లో జైస్వాల్ కి దొరికిపోయాడు.
ఆ తరువాత 12వ ఓవర్ లో 39 పరుగుల వద్ద ట్రావీస్ హెడ్ 4 పరుగులు మాత్రమే చేసి పెవిలియన్ చేరాడు. ఇక అక్కడినుండి ఆస్ట్రేలియా బ్యాటర్లు స్మిత్, వెబ్ స్టర్ కాస్త నిలకడగా ఆడారు. కానీ 33 పరుగులు చేసిన స్టీవ్ స్మిత్ ని.. ఈ మ్యాచ్ లో జట్టులోకి వచ్చిన ప్రసిద్ద్ కృష్ణ బోల్తా కొట్టించాడు. దీంతో 96 పరుగుల వద్ద ఐదో వికెట్ ని కోల్పోయింది ఆస్ట్రేలియా. ఈ క్రమంలో రెండవ రోజు ఆట ప్రారంభమైన కొద్దిసేపటికే ఆసీస్ టాప్ ఆర్డర్ ని కుప్పకూల్చారు భారత బౌలర్లు.
Also Read: Washington Sundar: ఆసీస్ తో అంపైర్లు ఫిక్సింగ్… సుందర్ వికెట్ పై కొత్త వివాదం!
ప్రస్తుతం ఆస్ట్రేలియా 101 పరుగులకు ఐదు వికెట్లు కోల్పోయింది. వెబ్ స్టర్ (28*), అలెక్స్ కారి (4*) క్రీజ్ లో ఉన్నారు. ఇక భారత బౌలర్లలో బుమ్రా 2, మహమ్మద్ సిరాజ్ 2, ప్రసిద్ద్ కృష్ణ 1 వికెట్ పడగొట్టారు. ఈ చివరి టెస్ట్ భారత జట్టుకు అత్యంత కీలకం కావడం వల్ల.. ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ చేరుకోవడానికి భారత జట్టు ఆఖరి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటుంది. ప్రస్తుతం ఈ సిరీస్ లో ఆస్ట్రేలియా టీమ్ 2-1 తో ముందంజలో ఉంది. ఈ మ్యాచ్ లో భారత జట్టు విజయం సాధించి సిరీస్ ని సమం చేయాలని పట్టుదలతో ఉంది.