BigTV English

Meera Jasmine Birthday : భద్ర బ్యూటీ.. మీరా జాస్మిన్ సినీ కెరీర్ విశేషాలు..

Meera Jasmine Birthday : భద్ర బ్యూటీ.. మీరా జాస్మిన్ సినీ కెరీర్ విశేషాలు..

Meera Jasmine Birthday special : “ఓణి వేసిన దీపావళి వచ్చిందా ఇంటికి” అంటూ పందెంకోడి సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది మీరా జాస్మిన్. మొదట సూత్రదారన్ (2002) అనే మలయాళ సినిమాతో సినీరంగ ప్రవేశం చేసింది. మలయాళం, తెలుగు, తమిళం, కన్నడ చిత్ర పరిశ్రమలలో తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకుంది. ఫిబ్రవరి 15న ఆమె బర్త్ డే సందర్భంగా స్పెషల్ స్టోరీ మీకోసం..


“అమ్మాయి బాగుంది” చిత్రంతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన మీరా జాస్మిన్ తర్వాత పవన్ కల్యాణ్ సరసన గుడుంబా శంకర్ సినిమాలో నటించింది. ఆ వెంటనే రవితేజతో భద్రలో జోడీ కట్టిన మీరా జాస్మిన్ తొలి కమర్షియల్ హిట్ అందుకుంది. ఆ తర్వాత రారాజు, ఆకాశ రామన్న, బంగారు బాబు, మా ఆయన చంటి పిల్లాడు, యమగోల.. మళ్లీ మొదలైంది, మహారథి వంటి సినిమాల్లో నటించింది.

చిత్ర పరిశ్రమలో అడుగు పెట్టిన అనతి కాలంలోనే స్టార్ హీరోయిన్ గా మారింది. ఇక ఆ తర్వాత ఆమెను వరుస ప్లాప్ లు వెంటాడాయి. చివరిగా గోరింటాకులో రాజశేఖర్ చెల్లిగా నటించి హిట్ అందుకుంది.


Read more : వాలెంటైన్స్ డే.. ప్రేమబంధంతో ఒక్కటైన టాలీవుడ్ కపుల్స్..!

2004 లో పాదమ్ ఒన్ను ఒరు విలాపం అనే మలయాళ సినిమాకి గాను ఉత్తమ నటిగా జాతీయ అవార్డు అందుకుంది. ఇవే కాకుండా నేషనల్ బెస్ట్ యాక్ర్టస్, కేరళ, తమిళనాడు ప్రభుత్వ అవార్డులతో పాటు మరెన్నో అవార్డులు సాధించింది. ఇలా తన నటనతో ప్రేక్షకులను అలరించిన మీరా జాస్మిన్ కొంతకాలం పాటు తెరపై కనుమరుగైంది. సినీ ఇండస్ట్రీకి దూరంగా ఉన్న మీరా జాస్మిన్ 2014 లో దుబాయ్ కి చెందిన అనిల్ జాన్ టైటస్ ని వివాహం చేసుకుని అక్కడే సెటిల్ అయ్యింది.

2016 నుంచి సినిమాలకి దూరంగా ఉన్న మీరా జాస్మిన్ 2023 లో విమానం సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చింది. ఇటీవలే ఇన్ స్టాగ్రామ్ లో ఎంట్రీ ఇచ్చిన మీరా జాస్మిన్ నాలుగు పదుల వయసులోనూ బోల్డ్ ఫొటోలతో అదరగొడుతోంది. అన్ని భాషల్లో మళ్లీ రీ ఎంట్రీ ఇవ్వడానికి ట్రై చేస్తుంది మీరా జాస్మిన్. ప్రస్తుతం మలయాళంలో ఒక సినిమాకి ఓకే చెప్పినట్లు తెలుస్తోంది.

Related News

Film industry: కన్న తండ్రే కసాయి.. కొట్టి ఆ గాయాలపై కారం పూసేవాడు.. హీరోయిన్ ఆవేదన!

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Big Stories

×