BigTV English

Valentines day 2024: వాలెంటైన్స్ డే.. ప్రేమబంధంతో ఒక్కటైన టాలీవుడ్ కపుల్స్..!

Valentines day 2024: వాలెంటైన్స్ డే.. ప్రేమబంధంతో ఒక్కటైన టాలీవుడ్ కపుల్స్..!
tollywood celebrity news

Valentine day 2024(Tollywood celebrity news): ఫిబ్రవరి 14 వచ్చేసింది. ఈ రోజు ప్రేమ పక్షులకు చాలా ప్రత్యేకమైనది. ఈ రోజును ఎంతోమంది ప్రేమ జంటలు తమ ప్రేమను రకరకాలుగా వ్యక్తపరచుకుంటారు. ప్రేమ‌ అనే రెండు అక్షరాలతో మొదలై పెళ్లి వరకు వెళ్లే వారు చాలా మందే ఉన్నారు. అయితే ఇవాళ వాలెంటైన్స్ డే సందర్భంగా ప్రేమలో పడి పెళ్లి చేసుకున్న టాలీవుడ్ సెలబ్రెటీల గురించి తెలుసుకుందాం.


నాగార్జున – అమల:

కారాయి దాదా సినిమాతో వీరిద్దరూ ప్రేమలో పడ్డారు. అనంతరం ఇరు కుటుంబాలు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో పెళ్లి చేసుకున్నారు.


శ్రీకాంత్ – ఊహ:

‘ఆమె’ సినిమా చిత్రీకరణ సమయంలో శ్రీకాంత్, ఊహాల మధ్య ఏర్పడిన పరిచయం.. పెళ్లి వరకు తీసుకెళ్లింది. 1997 జనవరి 20న వీరిద్దరూ ఒక్కటయ్యారు.

READ MORE: నాగ చైతన్యతో అనుష్క పెళ్లి .. నాగార్జున ఏమన్నాడో తెలుసా..?

మహేశ్ బాబు – నమ్రత:

వంశీ మూవీలో కలిసి నటించిన ఈ జంట ఆ సమయంలోనే ప్రేమలో పడ్డారు. ఆ తర్వాత ఐదేళ్లు ప్రేమాయణం కొనసాగించి 2005లో వివాహ బంధంతో ఒక్కటయ్యారు.

అల్లు అర్జున్ – స్నేహా:

అల్లు అర్జున్, స్నేహను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఓ పెళ్లిలో కలుసుకున్న వీరిద్దరూ.. ఆ తర్వాత ఫోన్ నెంబర్ల మార్చుకున్నారు. అప్పుడే వీరిమధ్య ప్రేమ చిగురించింది. ఆ తర్వాత ఈ జంట తమ కుటుంబ సభ్యుల అంగీకారంతో పెళ్లి పీటలెక్కారు.

రామ్ చరణ్ – ఉపాసన:

రామ్ చరణ్, ఉపాసన చిన్నప్పటి నుంచి మంచి స్నేహితులు. అయితే ‘ఆరెంజ్’ సినిమా నుంచి వీరిద్దరూ డేటింగ్ చేయడం స్టార్ట్ చేశారు. ఇక దాదాపు ఐదేళ్ల పాటు ప్రేమాయణం సాగించి చివరికి ఏడడుగులు వేసి ఒక్కటయ్యారు.

READ MORE: ఉపాసన కంటే ముందు చరణ్‌కి ఈ స్టార్ హీరో కూతురితో పెళ్లి అనుకున్నారట..?

నాని – అంజనా యలవర్తి:

నాని విశాఖపట్నంలో వీడియో జాకీ(వీజే)గా పనిచేశాడు. అంజన సాఫ్ట్‌వేర్ ఇంజినీర్. ఆ సమయంలో అంజనా ఓ పనిమీద నానిని కలిసింది. ఆ తర్వాత ఫోన్ నెంబర్లు మార్చుకుని స్నేహితులుగా మారిన వీరిద్దరూ ప్రేమాయణం మొదలెట్టారు. ఇక ఐదేళ్లపాటు డేటింగ్‌లో ఉంటూ చివరికి మూడుముళ్ల బంధంతో ఒక్కటయ్యారు.

నాగ చైతన్య – సమంత:

‘ఏ మాయ చేసావే’ సినిమా ద్వారా ప్రేమలో పడిన వీరిద్దరూ ఆ తర్వాత కొన్నేళ్లకు ప్రేమ వివాహం చేసుకున్నారు. కానీ పెళ్లయిన నాలుగేళ్లకే ఈ జంట విడిపోయి అందరికీ షాక్ ఇచ్చారు.

మంచు మనోజ్ – భూమ మౌనిక:

మంచు మనోజ్ – భూమ మౌనిక గతేడాది పెళ్లి చేసుకున్నారు. సినీ ఇండస్ట్రీకి ఎలాంటి సంబంధం లేకపోయినప్పటికీ.. ఇరువురు కుటుంబాల పరిచయంతో భూమ మౌనికతో.. మనోజ్ ప్రేమలో పడ్డాడు. ఆ తర్వాత వివాహబంధంలోకి అడుగుపెట్టారు.

READ MORE: 2024లో పెళ్లికి సిద్ధమైన సెలబ్రెటీలు వీళ్లే..?

వరుణ్ తేజ్ – లావణ్య త్రిపాఠి:

వరుణ్ తేజ్ – లావణ్య త్రిపాఠి జంటగా మిస్టర్, అంతరిక్షం సినిమాల్లో నటించారు. ఈ సినిమాలతోనే వీరిద్దరూ ప్రేమలో పడినట్లు తెలుస్తోంది. ఆ తర్వాత కొన్నేళ్లు ప్రేమాయణం సాగించి.. చివరకు గతేడాది పెళ్లిబంధంలోకి అడుగుపెట్టారు.

ఇక వీరితో పాటు మరెందరో టాలీవుడ్ సెలబ్రెటీలు లవ్ మ్యారేజ్ చేసుకుని హ్యాపీగా ఉన్నారు.

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×