BigTV English

Mega 157:  డెహ్రాడూన్ లో ల్యాండ్ అయిన బాస్.. పరుగులు పెట్టిస్తున్న అనిల్!

Mega 157:  డెహ్రాడూన్ లో ల్యాండ్ అయిన బాస్.. పరుగులు పెట్టిస్తున్న అనిల్!

Mega 157: మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) రీ ఎంట్రీ తర్వాత వరుస సినిమాలకు కమిట్ అవుతూ కెరియర్ పరంగా బిజీ అవ్వడమే కాకుండా యంగ్ హీరోలకు గట్టి పోటీ ఇస్తున్నారు. ఇక చిరంజీవి చివరిగా బాబీ డైరెక్షన్లో వాల్తేరు వీరయ్య అనే సినిమా ద్వారా ప్రేక్షకులు ముందుకు వచ్చి అద్భుతమైన విజయాన్ని సొంతకు చేసుకున్నారు. ఇక ఈ సినిమా తర్వాత చిరు తన తదుపరి చిత్రాన్ని బింబిసార దర్శకుడు వశిష్ట దర్శకత్వంలో విశ్వంభర (Vishwamvara) సినిమాకు కమిట్ అయిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ పనులు పూర్తి అయ్యాయని తెలుస్తుంది. అయితే ఈ సినిమాని వచ్చే నెలలో ప్రేక్షకుల ముందుకు తీసుకురావడం కోసం అన్ని ఏర్పాట్లు చేశారు కానీ కొన్ని కారణాలవల్ల వాయిదా పడటంతో ఆగస్టు నెలలో చిరంజీవి పుట్టిన రోజు సందర్భంగా విడుదల చేయాలనే ఆలోచనలో నిర్మాతలు ఉన్నారని తెలుస్తోంది.


సంక్రాంతి పండుగ టార్గెట్..

ఈ సినిమా పనులు పూర్తి కావడంతో చిరంజీవి తన 157 సినిమాని మరొక డైరెక్టర్ అనిల్ రావిపూడి (Anil Ravipudi)తో కమిట్ అయిన విషయం తెలిసిందే. అనిల్ రావిపూడి ఇటీవల వెంకటేష్ హీరోగా నటించిన సంక్రాంతికి వస్తున్నాం సినిమా ద్వారా సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు. ఈ సినిమా ద్వారా ఏకంగా 300 కోట్ల కలెక్షన్లను రాబట్టినట్టు తెలుస్తోంది. ఈ సినిమా తర్వాత అనిల్ రావిపూడి తన తదుపరి చిత్రాన్ని మెగాస్టార్ చిరంజీవితో కమిట్ అయ్యారు. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులన్నీ పూర్తి అయ్యాయని, షూటింగ్ పనులను ప్రారంభించబోతున్నారని తెలుస్తోంది. ఈ సినిమా షూటింగ్ కార్యక్రమాలలో భాగంగా చిత్ర బృందం డెహ్రాడూన్ చేరుకున్నట్టు తెలుస్తుంది.


డెహ్రాడూన్…

తాజాగా మెగాస్టార్ చిరంజీవితో పాటు ఇతర చిత్ర బృందం డెహ్రాడూరన్ లో ల్యాండ్ అయినటువంటి కొన్ని ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక అనిల్ రావిపూడి ఈ సినిమా షూటింగ్ పనులను పరిగెత్తిస్తున్నట్టు తెలుస్తుంది. సంక్రాంతి పండుగకు కచ్చితంగా ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలన్న టార్గెట్ తోనే షూటింగ్ పనులు శరవేగంగా జరుపుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమాని సంక్రాంతి పండుగకు విడుదల చేయబోతున్నామని మేకర్స్ తెలిపారు.


ఇక ఈ సినిమాకు షైన్ స్క్రీన్స్, గోల్డెన్ బాక్స్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై సాహూ గారపాటి, సుస్మిత కొణిదెల నిర్మాతలుగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో చిరంజీవికి జోడిగా మరోసారి నయనతార నటించబోతున్నారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించి మరొక వార్త కూడా సోషల్ మీడియాలో చక్కెరలు కొడుతుంది. ఇందులో చిరంజీవి ద్విపాత్రాభినయంలో నటించబోతున్నట్లు సమాచారం. ఇందులో ఒక పాత్రలో వింటేజ్ చిరంజీవిని చూడబోతున్నామని మరొక పాత్రలో యాక్షన్ మోడ్ ఉంటుందని తెలుస్తోంది. ఇక ఈ విషయం గురించి చిత్ర బృందం నుంచి ఎలాంటి అధికారకు ప్రకటన వెలబడలేదు కానీ ప్రస్తుతం ఈ వార్త మాత్రం ప్రస్తుతం వైరల్ అవుతుంది.

Related News

Alekhya sisters: ఇదేంట్రా బాబూ.. కుక్కలకు, నక్కలకు జీవితం అంకితం అంటోంది?

Movie Tickets : బుక్ మై షోలో లేని టికెట్స్ డిస్ట్రిక్ట్ యాప్‌లో ఎలా వస్తున్నాయి ?

Save the Tigers 3 : ‘సేవ్ ది టైగర్స్’ మళ్లీ వచ్చేస్తుంది.. ఎమ్మెల్యే గా ఘంటా రవి..

BIG TV Kissik talk Show: ఆ డైరెక్టర్ వల్లే నా కెరీర్ మొత్తం నాశనం.. మండిపడ్డ నటి రాశి

BIG TV Kissik talk Show : పదేళ్లుగా పిల్లలు పుట్టలేదు, చివరికి నా ప్రాణాలు ఫణంగా పెట్టి.. రాశి భావోద్వేగం

Sydney Sweeney: సిడ్నీ స్వీని బాలీవుడ్ ఎంట్రీ.. ఏకంగా రూ.530 కోట్లు ఆఫర్.. కళ్లు తేలేసిన నటి!

BIG TV Kissik talk Show : అతడితో పెళ్లి.. ఇంట్లో చాలా పెద్ద గొడవలు అయ్యాయి – కిస్సిక్ టాక్‌లో రాశి కామెంట్స్

Priyanka Jain: ప్రియాంకకు హ్యాండిచ్చి.. శోభశెట్టితో పులిహోర కలిపిన శివ్, అడ్డంగా బుక్కయ్యాడుగా!

Big Stories

×