OTT Movie : మెక్సికో నగరంలో, రద్దీగా ఉన్న రెస్టారెంట్‌లో… ఒక తండ్రి తన మాజీ భార్యతో వాదిస్తున్నాడు. ఆమె ఒక షాకింగ్ రహస్యాన్ని వెల్లడిస్తుంది. తన కొడుకు గురించి కలలో కూడా ఊహించని నిజం అది. అంతలోనే అకస్మాత్తుగా ఒక విషాదం సంభవిస్తుంది. అది అతని ప్రపంచాన్ని తలకిందులు చేస్తుంది. ఇప్పుడు ఆ చిన్న పిల్లాడితో కలిసి, అతను మెక్సికో అంతటా సత్యాన్ని వెతకడానికి ప్రయాణం మొదలు పెడతాడు. కానీ ఈ యాత్ర వారిని సమాధానాల వైపు నడిపిస్తుందా? లేక వారి జీవితాలను మరింత గందరగోళంలోకి నెట్టేస్తుందా? ఈ సస్పెన్స్ థ్రిల్లర్ ఏ ఓటీటీలో ఉంది? అనే విషయాలపై ఓ లుక్కేద్దాం.
కథలోకి వెళ్తే…
గాబ్రియెల్ అకా గాయో ఒక సెల్ఫీష్ టీవీ ప్రొడ్యూసర్. తన రియాలిటీ షో Lo Mejor del Mundoతో బిజీగా ఉంటాడు. 10 ఏళ్ల తన కొడుకు బెనిటోను అస్సలు పట్టించుకోడు. కొంచం సేపు కూడా అతనితో టైమ్ స్పెండ్ చేయడు. అతని మాజీ భార్య అలీసియా మాడ్రిడ్‌కు వెళ్లడానికి ప్లాన్ చేస్తున్నాను అని, బెనిటోను తీసుకెళ్తానని చెప్పినప్పుడు కూడా గాయో పెద్దగా పట్టించుకొడు. అది వారి మధ్య వాదనకు దారి తీస్తుంది.
ఈ గొడవలోనే అలీసియా ఒక షాకింగ్ రహస్యాన్ని బయట పెడుతుంది. బెనిటో అతని బయోలాజికల్ కొడుకు కాకపోవచ్చు అన్నది ఆ సీక్రెట్. ఆ వెంటనే అకస్మాత్తుగా ఒక విషాదకర ప్రమాదంలో అలీసియా మరణిస్తుంది. గాయోను బాధ్యత బెనిటోపై వదిలేస్తుంది. బెనిటో నిజమైన తండ్రి ఎవరో కనుక్కోవడానికి… గాయోతో పాటు బెనిటో లెర్నింగ్ సైకాలజిస్ట్ డయానా మెక్సికో రోడ్ ట్రిప్ లో బయలుదేరతారు. అలీసియా గతంలో కలిసిన వ్యక్తులను కలుస్తారు. సింగర్ ఎరిక్, సైకాలజిస్ట్ కానెక్, హ్యాపినెస్ ఏజెన్సీ యజమాని ఎన్రిక్ వేగా ఈ లిస్ట్ లో ఉంటారు.
ఈ ఇన్వెస్టిగేషన్ లో అలీసియా జీవితంలోని రహస్యాలు ఒక్కొక్కటిగా బయట పడతాయి. ఈ ట్రిప్ లో గాయో తన సెల్ఫీష్ లైఫ్ స్టైల్ గురించి ఆలోచనలో పడతాడు. అంతేకాదు బెనిటోతో అతని బంధం బలపడుతుంది. డయానా వారికి సపోర్ట్ గా నిలుస్తుంది. గాయో ఎమోషన్స్ ను అర్థం చేసుకుంటూ, ఒక కొత్త బంధంలోకి అడుగు పెడతారు. మరి ఇంతకీ చివరికి బెనిటో తండ్రి ఎవరో కనిపెట్టారా? అలిసియా లైఫ్ లో ఉన్న సీక్రెట్స్ ఏంటి? ఒకరితో బిడ్డను కని, మరొకరిని తండ్రిగా ఎందుకు చేసింది? అనే ప్రశ్నలకు సమాధానాలు కావాలంటే ఈ మూవీని చూడాల్సిందే.
ఎక్కడ చూడొచ్చంటే ?
ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న మూవీ పేరు ‘The Dad Quest’. 2025లో రిలీజ్ అయిన ఈ మూవీ ప్రస్తుతం Netflixలో అందుబాటులో ఉంది. ఇందులో మిచెల్ బ్రౌన్, మార్టినో లియోనార్డి, మైరా హెర్మోసిల్లో, ఫెర్నాండా కాస్టిల్లో తదితరులు నటించారు. సాల్వడార్ ఎస్పినోసా ఈ మూవీకి దర్శకత్వం వహించారు.