BigTV English

SIT primary inquiry on five areas: సిట్ ఎంక్వైరీ, ఆ ప్రాంతాల్లో టూర్, నేతలను అరెస్ట్ చేసే ఛాన్స్?

SIT primary inquiry on five areas: సిట్ ఎంక్వైరీ, ఆ ప్రాంతాల్లో టూర్, నేతలను అరెస్ట్ చేసే ఛాన్స్?

SIT primary inquiry on five areas(Latest news in Andhra Pradesh):

ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల రోజు, ఆ తర్వాత జరిగిన హింసాత్మక ఘటనలపై సిట్ ఎంక్వైరీ మొదలు పెట్టేసింది. సీనియర్ ఐపీఎస్ అధికారి వినీత్ బ్రిజ్‌లాల్ నేతృత్వంలో 14 మంది సభ్యుల గల బృందం ఏర్పాటు అయ్యింది. శుక్రవారం సాయంత్రం డీజీపీ హరీష్‌కుమార్ గుప్తాను సిట్ చీఫ్ వినీత్ కలిశారు. ఏయే అంశాలపై దర్యాప్తు చేయాలన్న దానిపై డీటేల్స్ తీసుకున్నారు.


శనివారం ఉదయం నుంచి సిట్ చీఫ్ వినీత్ నేతృత్వంలో 14 మంది సభ్యులు నాలుగు టీమ్‌గా ఏర్పడ్డా యి. ఆయా టీమ్‌లు అనంపురంలోని తాడిపత్రి, తిరుపతిలోని చంద్రగిరి, పల్నాడులోని మాచర్ల, గురజాల, నరసరావుపేట ప్రాంతాల్లోని పర్యటిస్తున్నాయి. అల్లర్ల సందర్భంగా నమోదైన ఎఫ్ఐఆర్‌లు, డీటేల్స్‌ను తొలుత పరిశీలించాయి.

గురజాల నియోజకవర్గంలో వందకు పైగా కేసులు, 192 మందిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు పోలీసులు. నరసరావుపేట నియోజకవర్గంలో 20 పైగా కేసు, 60 మంది నిందితులను గుర్తించారు. వీలైతే కొన్ని సెక్షన్లు కూడా జోడించే అవకాశం ఉందని అంటున్నారు కొంతమంది అధికారులు. బాధితులైన కొందరు పోలీసులు, రాజకీయ పార్టీల కార్యకర్తల నుంచి సమాచారం తీసుకోనున్నారు. లభించిన ఆధారాలతో ప్రాథమిక నివేదికను ఎన్నికల సంఘానికి ఇవ్వనుంది సిట్.


ఇదిలావుండగా అల్లర్లతో సంబంధ ఉన్న కొందరు రాజకీయ నేతలను అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయంటూ తెలుస్తోంది. ఆరోపణలు ఎదుర్కొంటున్న పోలీసులపైనా చర్యలు తీసుకునే ఛాన్స్ ఉందంటున్నాయి పోలీస్ వర్గాలు. సిట్ ఇచ్చే ప్రాథమిక నివేదిక పరిశీలించాక ముందుకు ఎలా వెళ్లాలనేది ఎన్నికల సంఘం కీలక సూచనలు ఇవ్వనుంది. ఇంకా లోతుగా విచారణ చేస్తారా? ప్రాథమిక నివేదిక ఆధారంగా చర్యలు తీసుకుంటారా? అనేది సస్పెన్స్‌గా మారింది.

ALSO READ: ఎయిర్‌పోర్టులో జగన్, అనుమానాస్పద వ్యక్తి, పోలీసులు అదుపులో..

అల్లర్లు తర్వాత కొన్ని ప్రాంతాల్లో 144 సెక్షను విధించింది ఎన్నికల సంఘం. కానీ కొందరు నేతలు ఎస్కేప్ కావడాన్ని నేతలు తప్పుబడుతున్నారు. అటు వైపు కూడా సిట్ దర్యాప్తు చేస్తుందా? ఇలా రకరకాల ప్రశ్నలు నేతలను వెంటాడుతున్నాయి.

Tags

Related News

Chandrababu: మళ్లీ జన్మంటూ ఉంటే నాకు అక్కడ పుట్టాలని ఉంది -చంద్రబాబు

Jagan-Sharmila: అన్న పేరెత్తకుండా షర్మిల, చెల్లి పేరు లేకుండా జగన్ రక్షా బంధన్ ట్వీట్లు

AP villages: లం*జబండ.. ఇదేం ఊరండి బాబు, పేరు మార్చాలంటూ.. గ్రామస్తులు గోల!

Tirumala devotees: తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. దర్శనానికి పట్టే సమయం ఎంతంటే?

CM Chandrababu: సిఎం చంద్రబాబు పై అభిమానం… 108 ఆలయాల్లో ఆ అభిమాని ఏం చేశారంటే?

AP new rule: ఏపీలో కొత్త రూల్.. పాటించకుంటే జరిమానా తప్పదు!

Big Stories

×