BigTV English
Advertisement

Smita Sabharwal Konda Surekha: సమంత విడాకులపై స్పందించిన ఐఎఎస్ అధికారి స్మిత సబర్వాల్..

Smita Sabharwal Konda Surekha: సమంత విడాకులపై స్పందించిన ఐఎఎస్ అధికారి స్మిత సబర్వాల్..

Smita Sabharwal Konda Surekha| సమంత, నాగచైతన్య విడాకులకు కేటీఆర్ కారణమంటూ తెలంగాణ అటవీ పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలపై సెలెబ్రిటీలు ఒక్కొక్కరుగా స్పందిస్తున్నారు. ఇప్పటికే నటి సమంత, కింగ్ నాగార్జున, మాజీ మంత్రి కేటీఆర్ ఈ అంశంపై స్పందించగా.. తాజాగా తెలంగాణ ఐఎఎస్ అధికారి స్మిత సబర్వాల్ సోషల్ మీడియాలో ఒక ట్వీట్ చేశారు.


సమాజంలో పేరొందిన మహిళలను కొందరు స్వలాభాల కోసం, పాపులారీటీ కోసం, ఉపయోగించుకుంటున్నారని.. సెన్సేషన్ కోసం మహిళల గురించి థంబ్‌నెయిల్స్ క్రియేట్ చేస్తున్నారని స్మిత సబర్వాల్ తన ట్వీట్ లో రాశారు. ”కష్టపడి ఉన్నత స్థానాలు చేరే మహిళలపై అంతటి స్థాయిలోనే దుష్ప్రచారం జరుగుతుంది. ఇది వ్యక్తిగత అనుభవం చెబుతుననాను.ఒక మంత్రి పదవిలో ఉంటూ ఇలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం చాలా షాకింగ్ గా ఉంది. ప్రతి విషయాన్ని రాజకీయం చేయకూడదు. ఇకనైనా బహిరంగ వ్యాఖ్యలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. మంత్రిగారు ప్రజా జీవనం పట్ల బాధ్యతగా ఉండాలని, వ్యక్తి గత జీవితాలకు గౌరవించి.. తన స్థాయి మరిచి వ్యాఖ్యలు చేయకూడదని కోరుకుంటున్నాను ” అని స్మిత సబర్వాల్ ట్విట్టర్ ఎక్స్ లో రాశారు.

మరోవైపు నటి సమంత కూడా మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలపై స్పందిస్తూ ట్వీట్ చేశారు. నాగచైతన్యతో తన విడాకులు ఇరువురి సమ్మతంతోనే జరిగాయని కామెంట్ చేశారు.


తనపై విమర్శలు రావడంతో మంత్రి కొండా సురేఖ తన వ్యాఖ్యలను ఉపసంహరించుకున్నట్లు ట్వీట్ చేశారు. తన ఉద్దేశం సమంత బాధపెట్టడం కాదని, మహిళలను చిన్నచూపు చూసే ఒక రాజకీయ నాయకుడిని ప్రశ్నించడే అని ఆమె రాశారు. సమంత ఎంతో కష్టపడి తన జీవితంలో ఎదిగారని, ఆమె ఇతరులకు ఆదర్శప్రాయమని మంత్రి కొండసురేఖ కొనియాడారు. తన వ్యాఖ్యల వల్ల సమంత లేదా ఆమె అభిమానుల మనోభావాలు దెబ్బతిని ఉంటే.. తన వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటున్నట్లు తన ట్వీట్ లో పేర్కొన్నారు.

మరోవైపు బిఆర్ఎస్ నాయకుడు కేటీఆర్.. మంత్రి కొండా సురేఖకు లీగల్ నోటీస్ పంపారు. తన వ్యాఖ్యలపై బహిరంగంగా క్షమాపణ చెప్పాలని లేదా చట్టపరమైన చర్యలు ఎదుర్కోవాల్సి ఉంటుందని అన్నారు. మంత్రి కొండా సురేఖను ఇప్పటికే నటుడు నాగార్జున, నాగచైతన్య, సమంత తప్పుబట్టారు.

Related News

Tejaswini Nandamuri: నందమూరి వారసురాలు వైరల్ యాడ్ డైరెక్టర్ ఎవరో తెలుసా? ఇంత బ్యాక్గ్రౌండ్ ఉందా?

Film industry: ఘనంగా సినిమాటిక్ ఎక్స్ పో 3వ ఎడిషన్!

CM Revanth on Movie Tickets: సినిమా టికెట్ డబ్బుల్లో సినీ కార్మికులకు వాటా… సీఎం సంచలన ప్రకటన

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇల్లు చూడండి.. ఎంత అద్భుతంగా ఉందో!

Telugu Heroes : సినిమాలతో పాటు హోటల్స్… లగ్జరీ రెస్టారెంట్స్ ఉన్న హీరోలు వీళ్లే

Salman Khan: పాక్ ను కెలికిన సల్లు భాయ్.. తెలుగు సినిమాలు బాగా చూస్తారంటూ..

Siva Jyothi: బేబీబంప్ తో పెళ్లి పీటలు ఎక్కిన శివ జ్యోతి.. ఇలా కూడా చేస్తారా?

Kantara 2: వైకల్యాన్ని జయిస్తూ.. నోటితోనే కాంతార బిజీఎం!

Big Stories

×