BigTV English
Advertisement

Allu Arjun : శిల్పా రవి vs మెగా ఫ్యామిలీ.. తేడా గమనించు అల్లు అర్జున్..?

Allu Arjun : శిల్పా రవి vs మెగా ఫ్యామిలీ.. తేడా గమనించు అల్లు అర్జున్..?

Allu Arjun : టాలీవుడ్ హీరో అల్లు అర్జున్ అరెస్ట్ అవ్వడం, రిమాండ్ విధించడం, హైకోర్టు ఆయన వేసిన పిటిషన్ ను పరిగణలోకి తీసుకొని ఆయనకు బెయిల్ మంజూరు చెయ్యడం ఇదంతా కేవలం గంటల వ్యవధిలోనే జరిగిపోయింది. పుష్ప 2 రిలీజ్ అయ్యి వెయ్యి కోట్లు అందుకున్న అంత క్రేజ్ రాలేదు గాని నిన్న అరెస్ట్ ఎపిసోడ్ మాత్రం హాట్ టాపిక్ అయ్యింది. డిసెంబర్ 4 న సంధ్య ధియేటర్ దగ్గర తొక్కిసలాట.. మహిళ మృతి, బాలుడు ఇప్పటికీ కోమాలో ఉండటం సగటు మనిషిని బాధించే విషయాలు. దురదృష్టకర సంఘటనతో పుష్ప 2 భారీ విజయాన్ని అందుకున్నా కూడా మనస్ఫూర్తిగా టీమ్ సంబరాలు చేసుకోలేని పరిస్థితి. బాధిత కుటుంబాన్ని ఆదుకుంటామని హామీ ఇస్తూ ఓవైపు.. సక్సెస్ మీట్స్ తో మరోవైపు వెళ్తున్న చిత్ర బృందానికి అల్లు అర్జున్ అరెస్టు పెద్ద షాక్ ఇచ్చింది.. ఇదంతా పక్కన పెడితే ఈ మధ్య జరిగిన గొడవలను పక్కన పెట్టేసి అల్లు అర్జున్ కోసం చిరంజీవి, పవన్ కళ్యాణ్ కదిలివచ్చారు. అల్లు ఫ్యామిలీకి అండగా నిలిచారు. ఇది నిజంగానే హైలైట్ అనే చెప్పాలి. అల్లు అర్జున్ రిలీజ్ అవ్వడం కన్నా కూడా మెగా & అల్లు ఫ్యామిలీ కలవడంపై ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు..


అల్లు అర్జున్ కు సపోర్ట్ గా మెగా హీరోలు.. 

సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో మహిళ మృతి చెందడానికి కారణం అల్లు అర్జున్ అని ఆమె కుటుంబ సభ్యులు కేసులు పెట్టారు. ఆ కేసును సీరియస్ గా తీసుకున్న పోలీసులు ఆయన నిన్న అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. అల్లు అర్జున్ అరెస్ట్ అయ్యాడని వార్త విన్న మెగా ఫ్యామిలీ విభేదాలను పక్కనపెట్టి చిరంజీవి అల్లు ఫ్యామిలీని కలిసి జరిగిన విషయాలను తెలుసుకున్నారు. అటు పవన్ కళ్యాణ్ కూడా హైదరాబాద్ కు చేరుకున్నారు. కష్టం వచ్చినప్పుడు కలిసారనేది కాదు. ఎలా వచ్చిందో తెలియని అభిప్రాయాలను అలుసుగా తీసుకుని మెగా, అల్లు మధ్య కొన్ని శక్తులు పెద్దవిగా చూపడమే కారణం.. వీరి కుటుంబాల్లో ఎప్పుడైనా.. ఎవరెంత ఎదిగినా.. చూసే మొదటి చూపు మెగాస్టార్ చిరంజీవి వైపే. ఆయనే రెండు కుటుంబాలకు పెద్ద.ఇదే సత్యం. మెగా హీరోలు, అల్లు అర్జున్ సైతం చిరంజీవే చేయిపట్టి నడిపించారు. అశేష తెలుగు ప్రేక్షకుల్లో చిరంజీవి సాధించుకున్న ప్రేమ ఇందుకు కారణం… ఏపీ ఎన్నికల నేపథ్యంలోలో అల్లు అర్జున్ కాంగ్రెస్ అభ్యర్థకి సపోర్ట్ చేసాడు. అదే వీరిద్దరి మధ్య గొడవలు పుట్టించింది.. ఇక ఇప్పుడు అల్లు అర్జున్ అరెస్ట్ తర్వాత ఇరు కుటుంబాలు మధ్య ఏర్పడిన దూరం పోయినట్లే తెలుస్తుంది. అయితే ఇప్పుడు మరో వార్త చక్కర్లు కొడుతుంది.


అల్లు అర్జున్ అరెస్ట్ శిల్పా రవి ఎక్కడ..? 

థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటతో మహిళ మృతికి కారణం అల్లు అర్జున్ అని ఆమె కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే.. ఈ ఫిర్యాదు తో పోలీసులు నిన్న అల్లు అర్జున్ ను జూబ్లీహిల్స్ లోని తన నివాసం వద్దే అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.. బన్నీ అరెస్ట్ విషయం తెలుసుకున్న మెగా హీరోలు బయటకు తీసుకురావడానికి ప్రయత్నాలు చేశారు. అల్లు అర్జున్ భార్యను కలిసి ధైర్యం చెప్పారు. ఇక ఇవాళ బెయిల్ మీద మీద జైలు నుంచి విడుదలయ్యే వరకు చిరంజీవి ప్రయత్నాలు చేశారు. కానీ ఇంత జరుగుతున్నా కూడా నంద్యాల మాజీ ఎమ్మెల్యే, అల్లు అర్జున్ స్నేహితుడు శిల్పా రవి రెడ్డి మాత్రం ఎక్కడ స్పందించలేదు.. కనీసం అరెస్ట్ గురించి కూడా పట్టించుకున్నట్లు కనిపించలేదు. దీనిపై మెగా ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.. ఈ తేడాను గమంచాలి.. ఇప్పటికైనా కళ్లు తెరిచి మనవాళ్ళు ఎవరో, పరాయి వాళ్ళు ఎవరు తెలుసుకోవాలని సలహా ఇస్తున్నారు.. మరి దీనిపై అల్లు అర్జున్ ఎలా రియాక్ట్ అవుతాడో చూడాలి..

Related News

Tejaswini Nandamuri: నందమూరి వారసురాలు వైరల్ యాడ్ డైరెక్టర్ ఎవరో తెలుసా? ఇంత బ్యాక్గ్రౌండ్ ఉందా?

Film industry: ఘనంగా సినిమాటిక్ ఎక్స్ పో 3వ ఎడిషన్!

CM Revanth on Movie Tickets: సినిమా టికెట్ డబ్బుల్లో సినీ కార్మికులకు వాటా… సీఎం సంచలన ప్రకటన

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇల్లు చూడండి.. ఎంత అద్భుతంగా ఉందో!

Telugu Heroes : సినిమాలతో పాటు హోటల్స్… లగ్జరీ రెస్టారెంట్స్ ఉన్న హీరోలు వీళ్లే

Salman Khan: పాక్ ను కెలికిన సల్లు భాయ్.. తెలుగు సినిమాలు బాగా చూస్తారంటూ..

Siva Jyothi: బేబీబంప్ తో పెళ్లి పీటలు ఎక్కిన శివ జ్యోతి.. ఇలా కూడా చేస్తారా?

Kantara 2: వైకల్యాన్ని జయిస్తూ.. నోటితోనే కాంతార బిజీఎం!

Big Stories

×