Suchir Balaji Dead: సుచిర్ బాలాజీ చనిపోయాడు.. అది కూడా అనుమానస్పద స్థితిలో. ఎవరీ సుచిర్ బాలాజీ.. అతను చనిపోతే ఏంటి? అనుకుంటున్నారా? కానీ అతని మిస్టరీ డెత్ అనేక అనుమానాలకు తెరపైకి తీసుకొచ్చింది. సుచీర్ బాలాజీ భారత సంతతికి చెందిన యువ టెకీ. అతను చాట్ జీపీటీని డెవలప్ చేసిన ఓపెన్ ఏఐ మాజీ ఉద్యోగి. నాలుగేళ్లు అందులో పనిచేశాడు. అయితే అతను చనిపోవడానికి ముందు ఓపెన్ ఏఐ గురించి.. చాట్ జీపీటీ గురించి సంచలన విషయాలు బయటికి తీసుకొచ్చాడు. ఓపేన్ ఏఐ కాపీ రైట్ ఉల్లంఘనలకు పాల్పడుతుందని ఆరోపించాడు. ఇంతలోనే అతని ఫ్లాట్‌లో నిర్జీవమై కనిపించాడు. అందుకే ఇప్పుడు మృతి.. ఇంత సెన్సేషన్‌గా మారింది.
శాన్‌ఫ్రాన్సిస్‌కోలోని బుచానన్ స్ట్రీట్ అపార్ట్‌మెంట్‌లో సుచిన్ బాలాజీ మృతదేహాన్ని గుర్తించారు. అతను సూసైడ్ చేసుకున్నట్లు మెడికల్ ఆఫీసర్ తెలిపారు. హత్య అనడానికి ఎలాంటి ఆధారాలు లేవని.. అయితే ఆత్మహత్యకు గల కారణాలపై ఫోకస్ చేస్తున్నామన్నారు.
Also Read: ట్రంప్‌పై పరోక్ష విమర్శలు చేసిన కెనెడా ప్రధాని.. ఎలన్ మస్క్ సీరియస్
ఓపెన్ ఏఐలో 2020 నవంబర్‌లో చేరాడు బాలాజీ.. అప్పటి నుంచి ఈ ఏడాది ఆగస్టు వరకు వర్క్ చేశాడు. ఈ మధ్యలోనే ఆ సంస్థ చేసిన తప్పిదాలను గమనించాడు బాలాజీ. కాపీరైట్ చట్టాన్ని ఉల్లంఘించి చాట్ జీపీటీని డెవలప్ చేశారన్నది బాలాజీ ఆరోపణ. అంతేకాదు.. చాప్ జీపీటీ ఇంటర్నెట్‌ను శాసించే స్థాయికి ఎదగాలని చూస్తుందన్నారు. చాట్ జీపీటీని డెవలప్ చేయడంపై అతను ఏడాదిన్నర వర్క్ చేశాడు. ఉద్యోగాన్ని వదిలేయడం.. ఆరోపణలు చేయడం.. ఆ తర్వాత మృతి చెందడం ఇప్పుడు అనేక అనుమానాలకు కారణమవుతుంది.