BigTV English

Sukumar: రాజకీయాల్లోకి సుకుమార్ ఎంట్రీ.. ఈ ట్విస్ట్ ఏంటి మాస్టర్..?

Sukumar: రాజకీయాల్లోకి సుకుమార్ ఎంట్రీ.. ఈ ట్విస్ట్ ఏంటి మాస్టర్..?

Sukumar: టాలీవుడ్ టాలెంటెడ్ డైరెక్టర్ సుకుమార్ (Director Sukumar) గురించి అందరికీ తెలుసు.. ఈయన ఇండస్ట్రీలోని స్టార్ హీరోల అందరితో సినిమాలు చేస్తాడు. ముఖ్యంగా మెగా హీరోలతో అద్భుతమైన సినిమాలను తెరకెక్కించాడు. చరిత్రలో ఎప్పటికీ మర్చిపోలేని అద్భుతమైన మూవీలను అందించిన ఘనత సుకుమార్ దే.. ఆర్య, రంగస్థలం, పుష్ప ది రైజ్, పుష్ప 2 ది రూల్ వంటి సంచలనాత్మక చిత్రాలను మెగా ఫ్యామిలీ కి అందించాడు.. అయితే సుకుమార్ మెగా ఫ్యామిలీకి యాంటీగా వ్యవహరిస్తున్నారంటూ ఓ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. అదేంటి మెగా హీరోలతో బ్లాక్ బస్టర్ హిట్ చిత్రాలను అందించిన సుకుమారు ఇప్పుడు మెగా ఫ్యామిలీకి వ్యతిరేకంగా ఎందుకు మారారు? కొంపదీసి సుకుమారు రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నాడా? అనే డౌట్ కూడా రావచ్చు.. అసలు విషయం ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..


టాలీవుడ్ మోస్ట్ టాలెంటెడ్ డైరెక్టర్ సుకుమార్ ఇటీవల అల్లు అర్జున్ తో పుష్ప 2 సినిమాని తెరకెక్కించాడు. గతేడాది డిసెంబర్లో రిలీజ్ అయిన ఈ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద రికార్డులను బ్రేక్ చేస్తూ భారీగా కలెక్షన్లను రాబట్టింది.. అటు ఓటిటిలో కూడా సినిమా భారీ వ్యూస్ ని రాబడుతుంది. ఇక ప్రస్తుతం సుకుమార్ రామ్ చరణ్ తో సినిమా చేయబోతున్నాడు అంటూ గత కొన్ని రోజులుగా వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే.. రామ్ చరణ్ 17వ సినిమా సుకుమార్ డైరెక్షన్ లో  చేయబోతున్నాడు అంటూ అనౌన్స్ చేశారు. ఇలా ఆయన కెరీర్ లో సంచలనాత్మకంగా నిల్చిన సినిమాలన్నీ మెగా హీరోలు అందించినవే. అలాంటి సుకుమార్ రీసెంట్ గా వైసీపీ పార్టీకి మద్దతుగా నిలిచాడంటూ ఓ వార్త నెట్టింట ప్రచారంలో ఉంది. వైసీపీ పార్టీ ఏర్పాటు చేసిన అవార్డు వేడుకక సుకుమార్ హాజరయ్యారు.

Also Read : రాజమౌళిని కాపీ కొడుతున్న అనిల్ రావిపూడి..ఆస్కార్ రేంజ్ లో సినిమా..?


ఇదే ఇప్పుడు పెద్ద చర్చనీయాంశంగా మారింది. గతంలో అల్లు అర్జున్ వైసీపీ నేతకు సపోర్ట్ చేస్తూ ఎన్నికల్లో ప్రచారం చేసిన సంగతి తెలిసిందే. దానివల్లే మెగా ఫ్యామిలీకి దూరమయ్యాడు. ఇప్పుడు సుకుమార్ కూడా వైసీపీకి సపోర్ట్ చేయడంతో టాలీవుడ్ ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. సుకుమారేమీ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వట్లేదు కదా? అనే ప్రశ్నలు కూడా జనాల్లో వినిపిస్తున్నాయి . గతంలో ఎన్నడు లేని విధంగా సుకుమారిలా పార్టీ ఏర్పాటు చేసిన ఫంక్షన్కు వెళ్లడం కొత్తగా ఉందంటూ ఆయన అభిమానులు కూడా చెవులు కొరుక్కుంటున్నారు.. ఇక గతంలో జరిగిన పరిణామాలన్నిటిని కనెక్ట్ చేసుకొని, సుకుమార్ కూడా వైసీపీ పార్టీ కి సపోర్టు చేస్తున్నట్టుగా భావించాల్సి ఉంటుందని పవన్ అభిమానులు అంటున్నారు. ఇకపోతే సుకుమార్ నిన్న మొన్నటి వరకు అబుదాబి లో ఉంటూ వస్తున్న సంగతి తెలిసిందే. రామ్ చరణ్ తో తీయబోయే సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ ని రాస్తున్నాడని తెలుస్తుంది. రామ్ చరణ్ ప్రస్తుతం బుచ్చిబాబుతో సినిమా చేస్తున్నాడు ఆ సినిమా తర్వాత సుకుమార్ సినిమాలో నటించనున్నాడు.

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×