SSMB 29 Shooting Update : దిగ్గజ దర్శకుడు రాజమౌళి (Rajamouli) చాలా సెలెక్టివ్ గా హీరోలను ఎంచుకుంటూ.. ఆ హీరోలను తన కథకు తగ్గట్టుగా మలిచి, వారిలోని ఇంకో టాలెంట్ ను బయటకు తీస్తూ.. భారీ పాపులారిటీ సొంతం చేసుకుంటున్నారు. చివరిగా ఎన్టీఆర్ (NTR ), రామ్ చరణ్ (Ram Charan) కలయికలో ఆర్ఆర్ఆర్ (RRR) సినిమా చేసి ఏకంగా ఆస్కార్ వేదికపై సందడి చేసిన రాజమౌళి.. ఇప్పుడు మహేష్ బాబు (Maheshbabu) తో ఎస్ ఎస్ ఎం బి 29 అనే వర్కింగ్ టైటిల్ తో సినిమా చేయబోతున్నారు. ఇదివరకే షూటింగ్ కూడా ప్రారంభమైన ఈ సినిమా.. ఇప్పుడు శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ముఖ్యంగా ఎవరు ఊహించని లొకేషన్ లలో షూటింగ్ చేస్తూ అందరిని ఆశ్చర్యపరుస్తూ సినిమాపై భారీ అంచనాలు పెంచేస్తున్నారు జక్కన్న.
అవుట్డోర్ షూటింగ్ ఆరంభం..
అందులో భాగంగానే ఇప్పటివరకు ఇండోర్ షూటింగ్ పూర్తయింది. హైదరాబాదు శివారులోని అల్యూమినియం ఫ్యాక్టరీలో.. కాశీలోని మణికర్ణిక ఘాట్ సెట్ ని వేసి పలు కీలక సన్నివేశాలను చిత్రీకరించారు. ఇంతటితో ఇండోర్ షూటింగ్ కూడా ముగిసింది. ఇక ఇప్పుడు అవుట్డోర్ షూటింగ్ మొదలుపెట్టబోతున్నారు జక్కన్న . అందులో భాగంగానే ఒరిస్సా లోని కొరాపుట్ ఘాట్ తో పాటు ఒరిస్సా లోని సెమిలిగడా లొకేషన్ లో సినిమా షూటింగ్ జరపబోతున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ వారంలో అక్కడ షూటింగ్ నిర్వహించబోతున్నట్లు సమాచారం. ఏది ఏమైనా ఎవరు గెస్ చేయని ప్రదేశాలను సెలెక్ట్ చేసుకుంటూ ఆ ప్రదేశాలలో తన సినిమా కథకు తగ్గట్టుగా షూటింగ్ నిర్వహిస్తూ ఉండడంతో ఎస్ ఎస్ ఎం బి 29 మూవీపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి . ఆఫ్రికన్ అడవుల నేపథ్యంలో రాబోతున్న ఈ సినిమా ఇప్పుడు ఇండియాలోని పలు ప్రాంతాలలో షూటింగ్ జరుపుకుంటూ ఉండటంపై ఆయా ప్రాంతాల ప్రజలు వీరిని చూడడానికి పెద్ద ఎత్తున తరలివస్తున్నట్లు కూడా వార్తలు వినిపిస్తున్నాయి. ఏది ఏమైనా చాలా పగడ్బందీగా తెరకెక్కిస్తున్న ఈ సినిమాకు సంబంధించి ఇంకొన్ని విషయాలు త్వరలోనే బయటకు రానున్నాయి.
Chhaava Telugu Trailer: ఛావా తెలుగు ట్రైలర్ వచ్చేసిందోచ్.. అదిరిపోయిందిగా..!
SSMB 29 మూవీ విశేషాలు..
ఇకపోతే ఈ సినిమాలో మహేష్ బాబు లుక్కుకు సంబంధించిన.. వీడియో ఒకటి జిమ్ నుండీ బయటకు రావడంతో అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఇందులో మహేష్ బాబు సింహంలా జూలు విధించిన ఫోటోలు చూసి అభిమానులు సంతోషంతో ఉక్కిరిబిక్కిరి అయిపోతున్నారు. అసలైన సింహాన్ని చూడబోతున్నాము అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇకపోతే ఈ సినిమాలో గ్లోబల్ ఐకాన్ స్టార్ ప్రియాంక చోప్రా జోనాస్ (Priyanka Chopra jonas) భాగం అయింది. ఈమెతో పాటు మరో హీరోయిన్ కూడా ఇందులో పాలు పంచుకోబోతోందని వార్తలు వినిపిస్తున్నాయి. ఇకపోతే దాదాపు రూ.1000 కోట్ల బడ్జెట్ తో రాబోతున్నట్లు సమాచారం. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి ఎటువంటి లీకులు ఎక్కడ జరగకుండా చాలా పగడ్బందీగా ప్లాన్ చేస్తున్నారు. ఇక ఈ చిత్రానికి రాజమౌళి తండ్రి ప్రముఖ రచయిత విజయేంద్ర ప్రసాద్ (Vijayendra Prasad) రచయితగా పనిచేస్తూ ఉండడం గమనార్హం. రాజమౌళి కుటుంబ సభ్యులు కూడా ఈ సినిమా కోసం పనిచేస్తున్నట్లు తెలుస్తోంది. ఆస్కార్ టార్గెట్ గా బరిలోకి దిగబోతున్న రాజమౌళి ఈ సినిమాతో నైనా ఆస్కార్ సొంతం చేసుకుంటారో లేదో చూడాలి.